Monday, 30 September 2024
Sunday, 29 September 2024
Saturday, 28 September 2024
Friday, 27 September 2024
Bible Quiz On Matthew 9th Chapter
1.యేసయ్య దోనె యెక్కి సముద్రము దాటి తన ------ లో ప్రవేశించెను?
తోటలో
గృహములో
పట్టణములో
మందిరములో
2.జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఎవరి యొద్దకు తీసికొనివచ్చిరి?
పేతురు నొద్దకు
అంద్రెయ నొద్దకు
యేసయ్య నొద్దకు
యోహాను నొద్దకు
3.కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని యేసయ్య ఎవరితో చెప్పెను?
కుష్టి రోగితో
పక్షవాయువు గలవానితో
గ్రుడ్డివానితో
దెయ్యము పట్టిన వానితో
4.శాస్త్రులలో కొందరు ఇతడు ----- చేయుచున్నాడని తమలోతాము అనుకొనిరి?
అధికారము
అద్భుతము
మోసము
దేవదూషణ
5.నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? అని యేసయ్య ఎవరితో అనెను?
శాస్త్రులతో
పరిసయ్యులతో
సద్దూకయ్యులతో
పక్షవాయువు గలవానితో
6.యేసయ్య వారితో పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి ------ కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పెను?
అధికారము
అవకాశము
ధైర్యము
సామర్థ్యము
7.యేసయ్య పక్షవాయువుగలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా వాడు లేచి ఎక్కడికి వెళ్లెను?
మందిరమునకు
తన యింటికి
తన పట్టణమునకు
అరణ్యమునకు
8.జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని -------?
దూషించిరి
ఆరాధించిరి
కీర్తించిరి
మహిమపరచిరి
9.యేసయ్య అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న ------- అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను?
మత్తయి
అల్ఫాయి
తద్దయి
లెబ్బయి
10.ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను ------?
కూర్చుండిరి
నిలుచుండిరి
పడుచుండిరి
వినుచుండిరి
11.మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని శిష్యులనడిగింది ఎవరు?
శాస్త్రులు
పరిసయ్యులు
సద్దూకయ్యులు
జనులు
12.రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. అని అన్నది ఎవరు?
యేసయ్య
పేతురు
యోహాను
యాకోబు
13.పరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని యేసయ్యను అడిగింది ఎవరు?
శాస్త్రులు
పరిసయ్యులు
సద్దూకయ్యులు
యోహాను శిష్యులు
14.పెండ్లి కుమారుడు తమతో కూడ నుండు కాలమున పెండ్లియింటి వారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు -------- చేతురు?
భోజనము
నాట్యము
ఉపవాసము
విజ్ఞాపన
15.ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును ---- మరి ఎక్కువగును?
చినుగు
నష్టము
కష్టము
ధనము
16.పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, ----- పాడగును?
ద్రాక్షారసము
ఇండ్లు
తిత్తులు
పట్టణములు
17.ఒక అధికారి యేసయ్య యొద్దకు వచ్చి ఆయనకు మ్రొక్కినా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె --------అనెను ?
స్వస్థ పరచబడుననెను
బ్రదుకుననెను
దీవించబడుననెను
క్షమించబడుననెను
18.యేసయ్య లేచి ఎవరి వెంట వెళ్లెను?
శిష్యుల వెంట
అధికారి వెంట
జనుల వెంట
పరిసయ్యుల వెంట
19.నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొన్నది ఎవరు?
కనాను స్త్రీ
రక్తస్రావరోగముగల యొక స్త్రీ
మగ్ధలేని మరియ
సమరయ స్త్రీ
20.రక్తస్రావరోగముగల యొక స్త్రీ యేసయ్య వెనుకకు వచ్చి ఆయన ---- ముట్టెను?
చేతులు
చెప్పులను
పాదములు
వస్త్రపు చెంగు
21.కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని యేసయ్య ఎవరితో చెప్పెను?
కనాను స్త్రీ తో
రక్తస్రావరోగముగల స్త్రీతో,
మగ్ధలేని మరియ తో
సమరయ స్త్రీ తో
22.యేసయ్య ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి ---- అనెను?
వెళ్లి పోవుడనెను
కూర్చుండుడనెను
నిలబడుమనెను
స్థలమియ్యుడనెను
23.ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని యేసయ్య ఎవరితో చెప్పెను?
జనులతో
శిష్యులతో
అధికారితో
పరిసయ్యులతో
24.ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని యేసయ్య వారితో చెప్పగా వారాయనను -----?
విశ్వసించిరి
అపహసించిరి
దూషించిరి
హింసించిరి
25.యేసయ్య జనసమూహమును పంపివేసి, లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది ------?
లేచెను
నడిచెను
ఏడ్చెను
మాట్లాడెను
26.ఇద్దరు గ్రుడ్డివారు యేసయ్య వెంట వచ్చి దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని -------?
కోరుకొనిరి
కేకలువేసిరి
వెళ్లిపోయిరి
పరుగెత్తిరి
27.నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని యేసయ్య ఎవరినడిగెను?
శిష్యులను
గ్రుడ్డివారిని
తల్లి తండ్రులను
జనులను
28.నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని యేసయ్య అడుగుగా నమ్ముచున్నాము ప్రభువా అని చెప్పింది ఎవరు?
గ్రుడ్డివారు
శిష్యులు
అధికారులు
జనులు
29.యేసయ్య వారి కన్నులు ముట్టి మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి ----- తెరువబడెను?
కన్నులు
చెవులు
నోరు
హృదయము
30.ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని యేసయ్య వారికి -------- గా ఆజ్ఞాపించెను?
కఠినముగా
కోపముగా
ప్రేమగా
ఖండితముగా
31.యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యముపట్టిన యొక ------ వానిని యేసయ్య యొద్దకు తీసికొని వచ్చిరి?
చిన్నవానిని
మూగవాని
చెవిటివానిని
గ్రుడ్డివానిని
32..దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు -------?
బయపడిరి
ఆశ్చర్యపడిరి
కోపపడిరి
దిగులు పడిరి
33.యేసయ్య దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని అన్నది ఎవరు?
పరిసయ్యులు
సద్దూకయ్యులు
శిష్యులు
జనులు
34.యేసయ్య వారి సమాజమందిరములలో బోధించుచు ----- ప్రకటించెను?
విడుదల
స్వస్థత
ఆశీర్వాదం
రాజ్య సువార్త
35.యేసయ్య ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును ------- చేసెను?
అద్భుతములు
సూచక క్రియలు
సంచారము
భోజనము
36.యేసయ్య జన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద -----?
కనికరపడెను
కోపపడెను
ఇష్టపడెను
కష్టపడెను
37.కోత విస్తారమేగాని ------ వారు కొద్దిగా ఉన్నారు?
మంచివారు
చెడ్డవారు
పెద్దవారు
పనివారు
38.తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని యేసయ్య ఎవరితో చెప్పెను?
శిష్యులతో
పరిసయ్యులతో
శాస్త్రులతో
జనులతో
Wednesday, 25 September 2024
Tuesday, 24 September 2024
Sunday, 22 September 2024
వేవేల దూతలతో - Vevela Doothalatho song lyrics
Vevela Doothalatho song lyrics In English :
Vevela Doothalatho Koniyaadabaduchunna
Nithyudagu Thandri Samaadhaana Kartha
Balavanthudaina Devaa ||Vevela||
Maa Koraku Nee Praanam Siluvalo Thyaagam
Ne Maruvalenu Naa Devaa (2)
Emichchi Nee Runamu – Ne Theerchagalanu (2)
Ee Bhuvilo Nee Koraku Emivvagalanu (2) ||Vevela||
Maa Sthithini Maa Gathini Neevu Maarchagalavu
Maa Baadhalu Maa Vedana Neevu Theerchagalavu (2)
Entha Vedanainaa – Entha Shodhanainaa (2)
Maa Koraku Siluvalo Bali Ainaavu (2) ||Vevela||
వేసారిన మనసే - Vesaarina Manase song lyrics
Vesaarina Manase song lyrics In English
Vesaarina Manase Oogene
Chejaarina Sthithiki Cherene
Ye Gaayamaina Maanade
Naakunna Balamu Chaalade (2)
Vinipinchu Yesu Nee Swaram
Nadipinchu Neetho Anukshanam ||Vesaarina||
Korinaanu Shreyamaina Nee Premane
Thaalalenu Lesamaina Nee Kopame
Bhaaramu Mopake Lopamu Choodake
Ennadu Nee krupa Dooramu Cheyake ||Vesaarina||
Vaadipodu Shrestamaina Ee Bandhame
Veedipodu Aadarinche Nee Snehame
Thodugaa Undune – Throvanu Choopune
Cheekati Kamminaa kshemamu Pampune ||Vesaarina||
Thursday, 19 September 2024
Sunday, 15 September 2024
Saturday, 14 September 2024
నీ స్వరమే విన్నా - nee svarame vinna song lyrics in telugu
nee svarame vinna song lyrics in telugu :
నీ స్వరమే విన్నా – నీ మమతే కన్నా
ప్రియమైన నా యేసయ్య
నా చెలిమే నీవై – నీ ప్రేమే నాదై
నిలిచావు నా నేస్తమా
స్తుతి ఆలాపన – నీ కోసమే
ఆరాధనా – నైవేద్యమే
విశేషమైన బంధమే
వరాల సంబంధమే
1. నిన్ను చూడ – నిన్ను చేర
పరితపించే నా ప్రాణమే
ఎల్లవేళ – విన్నపాల
కరుణ చూపే నీ స్నేహమే
ఎంత ప్రేమ – నిమిషమైన
వీడిపోనీ సంబంధమే
సొంతమైన ఆనందమే
2. ఆశతీర – యేసు నీలో
పరవసించే – నా ప్రాణము
ప్రాణనాథా – ఎన్నడైనా
మరువలేను – నీ త్యాగము
కానరాదే – ఈ జగాన
నిన్ను పోలి – ఏ బంధము
ఆరిపోని – అనుబంధము
Friday, 13 September 2024
ఆద్యంతరహితుడవగు
ఆద్యంతరహితుడవగు
1. ఆద్యంతరహితుడవగు మా జ్యోతి
మేదిని ప్రభూ నిన్ స్తుతింతుము - మేదిని
నా దీన కాపరి నీతి కృపానిధి
శుధ్ధ దివ్యగత్రుడా
2. మనోహరమగు నీ కృప పొందను
మానవు లెల్లరము చేరితిమి - మానవు
ఆత్మరూపా కృపామయా నీ కరుణా
వరముల మాకీయుమా
3. పాలచే కడుగబడిన - ధవళాక్షుడా
వళ్లిపూలయందు తిరుగువాడా - వళ్లి
షాలేము రాజా షారోను రోజా
శాంత భూపతివి నీవే
4. లక్షల దూతల స్తుతుల నందువాడా
అక్షయ హేమమకుట ధారుడా - అక్షయ
హేమ కిరీటధారులమై స్వర్గంబు
చేర కడవరి వర్షమీ
5. క్రొత్త యెరూషలేం నగర రాజా
రత్నాల పునాది వేసితివి - రత్నాల
ధీరతతో నీ సాక్ష్యము చాటను
స్థిరమగునాత్మ నిమ్ము
6. శ్రేష్ఠురాలా పావురమా నిరుపమాన
ఇష్టంపురూప లావణ్యవతీ - ఇష్ట
అట్లంచు పిల్చు దివ్య ధ్వనికి మమ్ము
పాత్రులుగా చేయుమా
Wednesday, 11 September 2024
Bible Quiz On Matthew 8th Chapter
1.యేసయ్య కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను ------?
ఆటంకపరిచెను
అనుమానించెను
వెంబడించెను
ప్రేమించెను
2.ఇదిగో కుష్ఠరోగి వచ్చి యేసయ్యకు మ్రొక్కిప్రభువా, నీకిష్టమైతే నన్ను -------- గా చేయగలవనెను?
సాక్షిగా
సేవకునిగా
శుద్ధునిగా
గొప్పవానిగా
3.ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, యేసయ్యను వేడుకున్నది ఎవరు?
శతాధిపతి
యాయీరు
నీకొదేము
నతనియేలు
4.శతాధిపతి యేసయ్య తో - ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు ----- మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడుననెను?
మాట
ఆలోచన
శక్తి
మర్మము
5.అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు ----- లోనికి త్రోయబడుదురు?
వెలుపటి గృహములోనికి
వెలుపటి చీకటిలోనికి
వెలుపటి ఆలయములోనికి
వెలుపటి ఆవరణములోనికి
6.యేసుఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు --------?
దైర్యము నొందెను
క్షమాపణ నొందెను
స్వస్థతనొందెను
మరణమొందెను
7.యేసయ్య పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చెయ్యిముట్టగా ------ ఆమెను విడిచెను ?
దెయ్యము
జ్వరము
బలము
ప్రాణము
8.జనులు దయ్యములు పట్టిన అనేకులను ఎవరి యొద్దకు తీసికొని వచ్చిరి?
యేసు నొద్దకు
యోహాను నొద్దకు
పరిసయ్యుల యొద్దకు
శాస్త్రుల యొద్దకు
9.యేసయ్య ---- వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను?
విశ్వాసం వలన
మాట వలన
ధైర్యము వలన
బయల్జెబూలు వలన
10.ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ఏ ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరెను?
యిర్మీయా
యెషయా
యెహెఙ్కేలు
దానియేలు
11.యేసయ్య తన యొద్దనున్న జన సమూహమును చూచి ఎక్కడికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను?
ఐగుప్తుకు
అద్దరికి
సమరయకు
సీదోనుకు
12.బోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని యేసయ్యతో అన్నది ఎవరు?
శాస్త్రి
పరిసయ్యుడు
సద్దూకయ్యుడు
సమరయుడు
13.నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అన్నది ఎవరు?
పేతురు
యోహాను
ఆంద్రెయా
యేసయ్య
14.ప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని యేసయ్యను అడిగింది ఎవరు?
శిష్యులలో ఒకడు
పరిసయ్యులలో ఒకడు
శాస్త్రులలో ఒకడు
సద్దూకయ్యులలో ఒకడు
15.యేసయ్య అతని చూచి నన్ను వెంబడించుము; మృతులు తమ ---- లను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను?
మృతులను
దేహములను
బంధువులను
స్నేహితులను
16.యేసయ్య దోనె యెక్కినప్పుడు ఆయన వెంట ఎవరు వెళ్లిరి?
శాస్త్రులు
పరిసయ్యులు
సద్దూకయ్యులు
శిష్యులు
17.సముద్రముమీద తుపాను లేచినందున దోనె ----- చేత కప్పబడెను?
నీటిచేత
గాలి చేత
వర్షము చేత
అలలచేత
18.శిష్యులు యేసయ్య యొద్దకు వచ్చి ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును ----- అని చెప్పి ఆయనను లేపిరి?
చూడమని చెప్పి
క్షమించమని చెప్పి
విడిపించుమని చెప్పి
రక్షించుమని చెప్పి
19.యేసయ్య శిష్యులతో - అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని చెప్పి, దేనిని గద్దించెను?
గాలిని
సముద్రమును
అలలను
గాలిని, సముద్రమును
20.శిష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని -------?
అనుకొనిరి
చెప్పుకొనిరి
భయపడిరి
కనుక్కొనిరి
21.యేసయ్య అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు ----- లలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి?
గ్రామములలో నుండి
పట్టణములలో నుండి
సమాధులలో నుండి
అరణ్యములో నుండి
22.ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలు వేసింది ఎవరు?
దయ్యములు పట్టిన యిద్దరు స్త్రీలు
దయ్యములు పట్టిన యిద్దరు శిష్యులు
దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు
దయ్యములు పట్టిన యిద్దరు పిల్లలు
23.ఆ దయ్యములు యేసయ్యతో నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ------ లోనికి పోనిమ్మని వేడుకొనెను?
సముద్రములోనికి
పందుల మందలోనికి
పట్టణములోనికి
అరణ్యములోనికి
24.యేసయ్య దయ్యములను పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ---- లోనికి పోయెను?
గొఱ్ఱెలలోనికి
పందులలోనికి
సమాధులలోనికి
సముద్రములోనికి
25.ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి ----- లోనికి వడిగా పరుగెత్తికొనిపోయెను?
సముద్రములోనికి
సమాధులలోనికి
అరణ్యములోనికి
పట్టణములోనికి
26.పందులు మేపుచున్నవారు పారిపోయి ------- లోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి?
పట్టణములోనికి
గ్రామములోనికి
మందిరములోనికి
అరణ్యములోనికి
27.ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి ఏమని వేడుకొనిరి?
వారి ప్రాంతములకు రమ్మని
వారి ప్రాంతములను విడిచి పొమ్మని
వారి ప్రాంతములలో ఉండమని
వారి ప్రాంతములను బాగుచేయమని
అడవి చెట్ల నడుమ
అడవి చెట్ల నడుమ
అడవి చెట్ల నడుమ - ఒక జల్దరు వృక్షం వలె
పరిశుద్ధుల సమాజములో - యేసు ప్రజ్వలించుచున్నాడు (2)కీర్తింతున్ నా ప్రభుని - జీవకాలమెల్ల ప్రభుయేసుని
కృతజ్ఞతతో స్తుతించెదను (2)
1. షారోను రోజా ఆయనే - లోయ పద్మమును ఆయనే
అతి పరిశుద్ధుడు ఆయనే - పదివేలలో అతిశ్రేష్ఠుడు (2)
|| అడవి ||
2. పరిమళతైలం నీ నామం - దాని వాసన వ్యాపించెగా
నిందశ్రమ సంకటములలో - నను సుగంధముగా చేయున్
|| అడవి ||
3. మనోవేదన సహించలేక - సిలువవైపునే చూడగా
లేవనెత్తి నన్నెత్తుకొని - భయపడకుమని యంటివి
|| అడవి ||
4. నా త్రోవకు దీపం నీవే - నా బ్రతుకుకు జీవం నీవే
నా సేవకు బలము నీవే - నా ఆత్మకాదరణనీవే
|| అడవి ||
5. ఘనమైన నా ప్రభువా - నీ రక్త ప్రభావమున
నా హృదయము కడిగితివి - నీకే నా స్తుతి ఘనత
|| అడవి ||
6. నీవు నా దాసుడవనియు - ఏర్పరచుకొంటినని
నేనే నీ దేవుడని - భయపడకు మని అంటివి
|| అడవి ||
Tuesday, 10 September 2024
అంధకారలోకమునకు
అంధకారలోకమునకు
అంధకారలోకమునకు
వెలుగునివ్వ ప్రభువు వచ్చెను
స్తుతి మహిమ ప్రభునకే
1. నిష్కళంక బలి నిర్దోష ప్రభువే
అమూల్యరక్తమేగ ముక్తిమార్గము
ఏమి యర్పించెదము దానికి బదులుగా
స్తుతి మహిమ ప్రభునకే
|| అంధకారలోకమునకు ||
2. మృత్యువుపై జయమునొంది మన ప్రభువు
ప్రార్థించుచుండె తండ్రి కుడిప్రక్కను
ఏమి యర్పించెదము దానికి బదులుగా
స్తుతి మహిమ ప్రభునకే
|| అంధకారలోకమునకు ||
3. జీవజ్యోతి రక్షకా నీవే ప్రతిఫలం
నీవే ప్రేమ సత్యానంద ధైర్యము
సర్వమందు నమ్మదగిన వాడవు నీవే
స్తుతి మహిమ ప్రభునకే
|| అంధకారలోకమునకు ||
Monday, 9 September 2024
అందరము ప్రభు నిన్ను - andharamu prabu ninnu song lyrics
అందరము ప్రభు
అందరము ప్రభు నిన్ను కొనియాడెదము
మహాత్ముండవు పరిశుద్ధుడవుబలియైతివి లోకమును రక్షించుటకు
1. అపారము నీ బుద్ధిజ్ఞాన మెంతయో
సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది
సర్వలోకము నీదు వశమందున్నది
|| అందరము ||
2. గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా
అద్భుతములు చేయు దేవ నీవే ఘనుడవు
శత్రువులను అణచునట్టి విజయశాలివి
|| అందరము ||
3. బండవైన ప్రభూ మమ్ము స్థిరపరచితివి
నీదు మార్గములు యెంతో అగమ్యంబులు
కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు
|| అందరము ||
4. కృపాళుండవైన యేసు దయగల దేవా
దయాకనికరములు గల దీర్ఘశాంతుడవు
వేల వేల తరములలో కృపను జూపెదవు
|| అందరము ||
5. క్షమించెదవు మానవుల పాపములెల్ల
విరోధులకు ప్రేమ జూపు దయామయుడవు
పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా
|| అందరము ||
Sunday, 8 September 2024
అంత్యదినమందు దూత - anthyadinamandhu dhutha song lyrics
అంత్యదినమందు దూత
అంత్యదినమందు దూత బూర నూదుచుండగా
నిత్యవాసరంబు తెల్లవారగా
రక్షణందుకొన్నవారి పేర్లు పిల్చుచుండగా
నేను కూడ చేరియుందు నచ్చటన్
నేను కూడ చేరి యుందున్
నేను కూడ చేరి యుందున్
నేను కూడ చేరి యుందున్
నేను కూడ చేరి యుందున్ నచ్చటన్
1. క్రీస్తునందు మృతులైనవారు లేచి క్రీస్తుతో
పాలుపొందునట్టి యుదయంబునన్
భక్తులారా కూడిరండి యంచు బిల్చుచుండగా
నేను కూడ చేరి యుందు నచ్చటన్ | నేను |
2. కాన యేసుసేవ ప్రత్యహంబు చేయుచుండి నే
క్రీస్తు నద్భుతంపు ప్రేమ చాటుచున్
కృపనొందువారి పేర్లు యేసు పిల్చుచుండగా
నేను కూడ చేరి యుందు నచ్చటన్ | నేను |
Bible Quiz On Matthew 6th Chapter
1.మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ---- పొందరు?
బహుమానం
బహు బలము
ఫలము
స్థలము
2.మీరు ప్రార్థనచేయునప్పుడు ----- వలె ఉండవద్దు?
అధికారులవలె
వేషధారులవలె
ధనవంతులవలె
దరిద్రులవలె
3.నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ------ ఇచ్చును?
బహుమానము
బాహు బలము
ప్రతిఫలము
పరిహారము
4.మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె ----- మాటలు వచింపవద్దు?
మంచిమాటలు
చెడ్డ మాటలు
గొప్ప మాటలు
వ్యర్థమైనమాటలు
5.మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ ------ లను క్షమించును?
అలవాట్లను
అపరాధములను
అభిప్రాయములను
ఆలోచనలను
6.మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ ------ లను క్షమింపడు?
అపరాధములను
అభిప్రాయములను
అలవాట్లను
ఆలోచనలను
7.మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె ------ లై యుండకుడి?
పాపముఖులై
దోషముఖులై
శాపముఖులై
దుఃఖముఖులై
8.పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి
అని అన్నది ఎవరు?
యోహాను
యేసుక్రీస్తు
పేతురు
ఆంద్రెయా
9.నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ ------ ఉండును?
ప్రాణము
శరీరము
నివాసము
హృదయము
10.దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు ----- మయమైయుండును?
పాపమయమై
శాపమయమై
చీకటిమయమై
వెలుగుమయమై
11.నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో --------?
మంచిది
చెడ్డది
గొప్పది
చిన్నది
12.మీరు దేవునికిని సిరికిని ----- గా నుండనేరరు?
దాసులుగా
సాక్ష్యులుగా
ప్రియులుగా
శత్రువులుగా
13.మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? అని అన్నది ఎవరు?
యోహాను
యేసుక్రీస్తు
పౌలు
పేతురు
14.ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై -----?
విచారింతురు
ప్రకాశింతురు
ప్రశ్నింతురు
ప్రచురించుతురు
Click here :
Bible Quiz On Matthew 7th Chapter
Bible Quiz On Matthew 5th Chapter
1.యేసయ్య జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఎవరు ఆయన యొద్దకు వచ్చిరి?
శిష్యులు
శాస్త్రులు
పరిసయ్యులు
సద్దూకయ్యులు
2.ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; ----- వారిది?
భూలోకరాజ్యము
పరలోకరాజ్యము
పరలోకసైన్యము
భూలోకసైన్యము
3.దుఃఖపడువారు ధన్యులు; వారు ------?
దీవించబడుదురు
క్షమించబడుదురు
ఓదార్చబడుదురు
ప్రేమించబడుదురు
4.సాత్వికులు ధన్యులు ; వారు ----- ను స్వతంత్రించుకొందురు?
భూలోకమును
బంగారమును
వజ్రములను
వస్త్రములను
5.నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు ------?
తృప్తిపరచబడుదురు
బాధపరచబడుదురు
బలపరచబడుదురు
సిగ్గుపరచబడుదురు
6.కనికరముగల వారు ధన్యులు; వారు ------- పొందుదురు?
కష్టాలు
కానుకలు
కన్నీరు
కనికరము
7.హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు ----- చూచెదరు?
దేవుని
దేవదూతలను
దెయ్యములను
ధనవంతులను
8.సమాధానపరచువారు ధన్యులు ; వారు ------- అనబడుదురు?
దేవుని సేవకులనబడుదురు
దేవుని సాక్ష్యులనబడుదురు
దేవుని దూతలనబడుదురు
దేవుని కుమారులనబడుదురు
9.నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; ----- వారిది?
భూలోక రాజ్యము
పరలోక రాజ్యము
పరలోక సైన్యము
భూలోక సైన్యము
10.మీరు లోకమునకు ------ అయి యున్నారు?
మట్టయి
ఉప్పయి
నిప్పయి
బంగారమై
11.మీరు లోకమునకు ------- అయి యున్నారు?
వెలుగై
చీకటై
ముఖ్యమై
సౌక్యమై
12.కొండమీదనుండు పట్టణము ------- అయి యుండనేరదు?
మంచిదై
గొప్పదై
మరుగై
చిన్నదై
13.మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై ------- మీదనే పెట్టుదురు?
మంచము మీదనే
ప్రాకారము మీదనే
దీపస్తంభము మీదనే
దేవాలయము మీదనే
14.మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ ------- ప్రకాశింప నియ్యుడి?
ముఖము
వెలుగు
కండ్లు
చెవులు
15.ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.అని అన్నది ఎవరు?
యోహాను
యేసుక్రీస్తు
పౌలు
పేతురు
16.ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల -------- అనబడును?
అల్పుడనబడును
గొప్పవాడనబడును
చిన్నవాడనబడును
చెడ్డవాడనబడును
17.శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని అన్నది ఎవరు?
యోహాను
యేసుక్రీస్తు
పౌలు
పేతురు
18.తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు -------- కి లోనగును?
నిరాశకి
నిస్పృహకి
నరకాగ్నికి
బలహీనతకి
19.నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో ------?
గొడవ పడుము
సమాధానపడుము
సంతోష పడుము
కష్టపడుము
20.ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో ----- చేసినవాడగును?
సహవాసం
స్నేహము
వ్యభిచారము
వ్యాపారము
21.మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది ----- నుండి పుట్టునది?
దేవుని నుండి
లోకము నుండి
మనుషుల నుండి
దుష్టుని నుండి
22.దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ---- కూడ త్రిప్పుము?
ఎడమచెంప కూడ త్రిప్పుము
ఎడమ చేతిని కూడ త్రిప్పుము
ఎడమ కాలిని కూడ త్రిప్పుము
ఎడమ కంటిని కూడ త్రిప్పుము
23.ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ ----- కూడా ఇచ్చివేయుము?
పైవస్త్రము కూడా
వస్తువులు కూడా
ఆయుధములు కూడా
ఆభరణములు కూడా
24.ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ ---- మైళ్లు వెళ్లుము?
రెండు మైళ్లు
మూడు మైళ్లు
నాలుగు మైళ్లు
ఐదు మైళ్లు
25.నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ----- త్రిప్పుకొనవద్దు?
చూపును త్రిప్పుకొనవద్దు
మనసు త్రిప్పుకొనవద్దు
ముఖము త్రిప్పుకొనవద్దు
చేతిని త్రిప్పుకొనవద్దు
26.మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ ------ లను ప్రేమించుడి?
సన్నిహితులను
స్నేహితులను
శ్రేయాభిలాషులను
శత్రువులను
27.మిమ్మును హింసించు వారికొరకు ----- చేయుడి?
ప్రార్థన
ఉపవాసం
ప్రమాణము
ప్రయాణము
28.దేవుడు చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను ----- కురిపించుచున్నాడు?
వర్షము
వడగండ్లు
మంచు
మన్నా
29.మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును ----- గా ఉండెదరు?
అపవిత్రులుగా
అవిధేయులుగా
పరిపూర్ణులుగా
అపరిపూర్ణులుగా
Click here :
Bible Quiz On Matthew 6th Chapter
Bible Quiz On Matthew 4th Chapter
1.యేసయ్య అపవాది చేత శోధింపబడుటకు ----- వలన అరణ్యమునకు కొనిపోబడెను?
ఆత్మ వలన
అభిషేకం వలన
బలము వలన
భయం వలన
2.యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసమున్నాడు?
30 రోజులు
40 రోజులు
50 రోజులు
60 రోజులు
3.శోధకుడు యేసు నొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు ------- అగునట్లు ఆజ్ఞాపించుమనెను?
రొట్టెలగునట్లు
చాపలగునట్లు
పాములగునట్లు
కఱ్ఱలగునట్లు
4.మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని ----- నుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించుననెను?
దేవుని నోట నుండి
దేవుని ప్రజల నుండి
దేవుని చేతి నుండి
దేవుని మనస్సు నుండి
5.నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుముఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును,నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు
అని యేసయ్యతో అన్నది ఎవరు ఎవరితో అనెను?
పేతురు
అంద్రెయ
అపవాది
యోహాను
6.ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని యేసయ్య ఎవరితో చెప్పెను?
పేతురుతో
యోహానుతో
యాకోబుతో
అపవాదితో
7.అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి యేసయ్యను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి ------ ఆయనకు చూపెను?
అవినీతిని
అవసరతలు
క్రమమును
మహిమను
8.అపవాది యేసయ్యకు యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను చూపి నీవు ----- చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని చెప్పెను?
సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల
సాగిలపడి నాకు సత్కార్యములు చేసినయెడల
సాగిలపడి నాకు పరిచర్య చేసినయెడల
సాగిలపడి నాకు ప్రమాణం చేసినయెడల
9.అపవాది యేసయ్యను విడిచిపోగా, ఎవరు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి?
దేవదూతలు
శిష్యులు
శాస్త్రులు
పరిసయ్యులు
10.యోహాను చెరపట్టబడెనని యేసు విని ఎక్కడికి తిరిగి వెళ్లెను?
గలిలయకు
సమరయకు
యూదయకు
సీదోనుకు
11.యేసయ్య నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి యను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి ------ నకు వచ్చి కాపురముండెను?.
నజరేతునకు
బెత్లహేమునకు
కపెర్న హూమునకు
సీదోనునకు
12.చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి ----- ఉదయించెను?
సూర్యుడు
నక్షత్రం
చంద్రుడు
వెలుగు
13.పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక ----- పొందుడని చెప్పుచు యేసయ్య ప్రకటింప మొదలు పెట్టెను?
బాప్తిస్మము
స్వస్థత
మారుమనస్సు
అభిషేకం
14.యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో ---- వేయుట చూచెను;
బట్టలువేయుట
దోనెలు వేయుట
వలలు వేయుట
చాపలు వేయుట
15.నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని అన్నది ఎవరు?
యోహాను
యేసుక్రీస్తు
పౌలు
పేతురు
16.యాకోబు,యోహానుల తండ్రి పేరు ఏమిటీ?
తద్దయి
లెబ్బయి
జెబెదయి
బర్తలోమయి
17.యాకోబు,యోహానులు తమ తండ్రియైన జెబెదయి యొద్ద వేటిని బాగు చేసి కొనుచుండిరి?
దోనెలను
వస్త్రములను
వలలను
కర్రలను
18.యాకోబు,యోహానులు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఎవరిని వెంబడించిరి?
యోహానును
యేసుక్రీస్తును
పౌలును
పేతురును
19.యేసయ్య సమాజమందిరములలో బోధించుచు,----- ను గూర్చిన సువార్తను ప్రకటించెను?
రాజ్యమును గూర్చిన సువార్తను
రాకడను గూర్చిన సువార్తను
రాజులను గూర్చిన సువార్తను
దూతలను గూర్చిన సువార్తను
20.యేసయ్య ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు ----- యందంతట సంచరించెను?
సిరియయందంతట
గలిలయయందంతట
సమరయయందంతట
బెత్లహేముయందంతట
21.యేసయ్య కీర్తి ---- దేశమంతట వ్యాపించెను?
ఐగుప్తు దేశమంతట
మోయాబు దేశమంతట
కనాను దేశమంతట
సిరియ దేశమంతట
22.నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, యేసయ్య యొద్దకు తీసికొని రాగా ఆయన వారిని -------?
స్వస్థపరచెను
బలపరచెను
గాయపరచెను
దుఃఖపరచెను
Click here :
Bible Quiz On Matthew 5th Chapter
Bible Quiz On Matthew 3rd Chapter
1.బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోకరాజ్యము సమీపించియున్నది, ------ పొందుడని ప్రకటించుచుండెను?
ఆశీర్వాదము
అభిషేకము
బాప్తిస్మము
మారుమనస్సు
2.పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యోహాను ఎక్కడ ప్రకటించుచుండెను?
యూదయ పట్టణములో
యూదయ అరణ్యములో
గలిలయ ప్రాంతములో
యెరూషలేము పట్టణములో
3.ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ఏ ప్రవక్త ద్వారా చెప్పబడెను?
యెషయాప్రవక్త ద్వారా
యిర్మీయా ప్రవక్త ద్వారా
యెహెఙ్కేలు ప్రవక్త ద్వారా
దానియేలు ప్రవక్త ద్వారా
4.యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు ----- ధరించుకొనువాడు?
బంగారు దట్టి
వెండి దట్టి
రాగి దట్టి
తోలుదట్టి
5.వీటిలో యోహాను తినే ఆహరం ఏది?
రొట్టెలు మాంసము
రొట్టెలు ద్రాక్షారసము
పాలు తేనె
మిడతలును తేనె
6.యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, యోహాను నొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు, అతని చేత ------ పొందుచుండిరి?
ఆశీర్వాదము
అభిషేకము
ఆరోగ్యము
బాప్తిస్మము
7.ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి ------ లో వేయబడుననెను?
అగ్నిలో
పెంటలో
నీటిలో
పొలములో
8.నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; అని అన్నది ఎవరు?
యోహాను
యేసుక్రీస్తు
పేతురు
పౌలు
9.యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు ---- నుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను?
నజరేతు నుండి
బెత్లహేము నుండి
గలిలయనుండి
కపెర్నహూము నుండి
10.యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఎక్కడికి వచ్చెను?
బెత్లహేమునకు
నజరేతునకు
అరణ్యమునకు
ఒడ్డునకు
11.ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ ------ వలె యేసయ్య మీదికి దిగి వచ్చెను?
అగ్ని వలె
సుడిగాలి వలె
పావురమువలె
పక్షి రాజు వలె
12.ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఎక్కడినుండి వచ్చెను?
ఆకాశము నుండి
అరణ్యములో నుండి
పట్టణములో నుండి
పర్వతములో నుండి
Click here :
Bible Quiz On Matthew 4th Chapter
Bible Quiz On Matthew 7th Chapter
1.మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి ----- తీర్చబడదు?
న్యాయము
తీర్పు
అప్పు
ఋణము
2.పరిశుద్ధమైనది ------ లకు పెట్టకుడి?
కుక్కలకు
నక్కలకు
పందులకు
మేకలకు
3. మీ ముత్యములను ----- యెదుట వేయకుడి?
కుక్కల యెదుట
పందులయెదుట
మేకల యెదుట
గొఱ్ఱెల యెదుట
4.అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు -------?
ఇయ్యబడును
తీయబడును
కొలువబడును
విడువబడును
5.మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ----- నైయున్నది?
సమాచారమునై
సహాయమునై
ఉపదేశమునై
కనికరమునై
6.ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము -----?
పొడవు
వెడల్పు
ఇరుకు
సంకుచితము
7.జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు ------?
చిన్నవారే
మంచివారే
గొప్పవారే
కొందరే
8.అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు -----?
క్రూరమైన తోడేళ్లు
క్రూరమైన పొట్టేళ్లు
క్రూరమైన సర్పములు
క్రూరమైన మృగములు
9.మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి ------ లో వేయబడును?
అగ్నిలో
అడవిలో
నీటిలో
మట్టిలో
10.ప్రభువా, ప్రభువా, అని పిలుచు ప్రతివాడును ---- లో ప్రవేశింపడు?
మందిరములో
అరణ్యములో
భూలోక రాజ్యములో
పరలోకరాజ్యములో
11.పరలోకమందున్న ----- ప్రకారము చేయువాడే పరలోకరాజ్యములో ప్రవేశించును?
తండ్రి చిత్త ప్రకారము
దూతల చిత్త ప్రకారము
పెద్దల చిత్త ప్రకారము
భక్తుల చిత్త ప్రకారము
12.దేవుని మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును ----- మీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును?
భూమి మీద
ఇసుక మీద
బండమీద
నీటి మీద
13.దేవుని మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ---- మీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును?
బండమీద
ఇసుకమీద
భూమి మీద
నీటి మీద
14.జనసమూహములు యేసయ్య బోధకు -------?
బయపడుచుండిరి
ఆశ్చర్యపడుచుండిరి
సంతోషపడుచుండిరి
లోబడుచుండిరి
15.యేసయ్య వారి శాస్త్రులవలె కాక ------ గలవానివలె వారికి బోధించెను?
జ్ఞానము గలవానివలె
వివేకము గలవానివలె
అధికారము గలవానివలె
అభిషేకం గలవానివలె
Bible Quiz On Matthew 2nd Chapter
1.యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చిరి?
యెరూషలేమునకు
నజరేతునకు
కపెర్నహూమునకు
సమరయాకు
2.యేసు ఎక్కడ జన్మించెను?
యెరూషలేములో
బెత్లహేములో
నజరేతులో
కపెర్నహూములో
3.యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని అని అన్నది ఎవరు?
జ్ఞానులు
గొల్లలు
పిల్లలు
స్త్రీలు
4.హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును ----------?
కలవరపడిరి
భయపడిరి
దిగులుపడిరి
తొందరపడిరి
5.క్రీస్తు ఎక్కడ పుట్టునని హేరోదు రాజు ఎరినడిగెను?
ప్రధానయాజకులను
శాస్త్రులను
పరిసయ్యులును
ప్రధానయాజకులను,శాస్త్రులను
6.హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి,
----- కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొనెను?
శిశువు కనబడిన కాలము
నక్షత్రము కనబడిన కాలము
సూచన కనబడిన కాలము
లేఖనము కనబడిన కాలము
7.హేరోదు జ్ఞానులతో మీరు వెళ్లి, ------ విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనుమనెను?
శిశువు విషయమై
నక్షత్రము విషయమై
లేఖనము విషయమై
జనుల విషయమై
8.హేరోదు జ్ఞానులతో నేనును వచ్చి,ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని ఎక్కడికి పంపెను?
యెరూషలేమునకు
బేత్లెహేమునకు
నజరేతునకు
ఐగుప్తునకు
9.జ్ఞానులు రాజు మాటవిని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ----- ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను?
శిశువు ఉండిన చోటికి మీదుగా
జనుల ఉండిన చోటికి మీదుగా
సైనికులు ఉండిన చోటికి మీదుగా
గొఱ్ఱెల కాపరులు ఉండిన చోటికి మీదుగా
10.జ్ఞానులు నక్షత్రమును చూచి, ---- అయిరి?
ఆనందభరితులైరి
అత్యానందభరితులైరి
భయకంపితులైరి
ధన్యులైరి
11.జ్ఞానులు తల్లియైన మరియను శిశువును చూచి, సాగిలపడి, ఎవరిని పూజించిరి?
మరియను
యోసేపును
హేరోదును
యేసును
12.జ్ఞానులు తమ పెట్టెలు విప్పి, ------ కానుకలుగా సమర్పించిరి?
బంగారమును
సాంబ్రాణిని
బోళమును
బంగారమును, సాంబ్రాణిని, బోళమును
13.జ్ఞానులు హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై ---- మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి?
మరియొక మార్గమున
నిత్య మార్గమున
ఇరుకు మార్గమున
విశాల మార్గమున
14.ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ----- నకు పారిపోమ్మననెను?
ఐగుప్తునకు
మోయాబునకు
కనానుకు
బబులోనుకు
15.యోసేపు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఎక్కడికి వెళ్లెను ?
యెరూషలేముకు
నజరేతునకు
ఐగుప్తునకు
మోయాబునకు
16.జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి ------ తెచ్చుకొనెను?
బలము తెచ్చుకొనెను
జ్ఞానము తెచ్చుకొనెను
ధైర్యము తెచ్చుకొనెను
ఆగ్రహముతెచ్చుకొనెను
17.బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల --- నందరిని హేరోదు వధించెను?
మగ పిల్లలనందరిని
ఆడ పిల్లలనందరిని
చిన్న పిల్లలనందరిని
పుట్టిన పిల్లలనందరిని
18.రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా ----- యు కలిగెను?
భయమును
భూకంపమును
రోదనధ్వనియు
ఆశ్చర్యమును
19.రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ఏ ప్రవక్త ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను?
యెషయా
యిర్మీయా
మీకా
దానియేలు
20.హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై
నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ----- దేశమునకు వెళ్లుమనెను?
ఐగుప్తు దేశమునకు
ఇశ్రాయేలుదేశమునకు
మోయాబు దేశమునకు
కనాను దేశమునకు
21.శిశువు ప్రాణము తీయజూచుచుండినవారు చనిపోయిరని యోసేపుకు చెప్పింది ఎవరు?
దూత
మరియ
జనులు
జ్ఞానులు
22.అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై యోసేపు ఏ ప్రాంతములకు వెళ్లెను?
గలిలయ ప్రాంతములకు
సిరియా ప్రాంతములకు
ఐగుప్తు ప్రాంతములకు
మోయాబు ప్రాంతములకు
23.యోసేపు స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, ----- అను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను?
కానా అను ఊరికి
కపెర్నహూము అను ఊరికి
నజరేతను అను ఊరికి
సీదోను అను ఊరికి
24.ఆయన నజరేయుడనబడునని ఎవరు చెప్పినమాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను?
దూతలుచెప్పినమాట నెరవేరునట్లు
ప్రవక్తలుచెప్పినమాట నెరవేరునట్లు
జనులు చెప్పినమాట నెరవేరునట్లు
యాజకులు చెప్పినమాట నెరవేరునట్లు
Click here :
Bible Quiz On Matthew 3rd Chapter