Breaking

Friday, 13 September 2024

ఆద్యంతరహితుడవగు

                      

                        ఆద్యంతరహితుడవగు


1. ఆద్యంతరహితుడవగు మా జ్యోతి
మేదిని ప్రభూ నిన్ స్తుతింతుము - మేదిని
నా దీన కాపరి నీతి కృపానిధి
శుధ్ధ దివ్యగత్రుడా

2. మనోహరమగు నీ కృప పొందను
మానవు లెల్లరము చేరితిమి - మానవు
ఆత్మరూపా కృపామయా నీ కరుణా
వరముల మాకీయుమా

3. పాలచే కడుగబడిన - ధవళాక్షుడా
వళ్లిపూలయందు తిరుగువాడా - వళ్లి
షాలేము రాజా షారోను రోజా
శాంత భూపతివి నీవే

4. లక్షల దూతల స్తుతుల నందువాడా
అక్షయ హేమమకుట ధారుడా - అక్షయ
హేమ కిరీటధారులమై స్వర్గంబు
చేర కడవరి వర్షమీ

5. క్రొత్త యెరూషలేం నగర రాజా
రత్నాల పునాది వేసితివి - రత్నాల
ధీరతతో నీ సాక్ష్యము చాటను
స్థిరమగునాత్మ నిమ్ము

6. శ్రేష్ఠురాలా పావురమా నిరుపమాన
ఇష్టంపురూప లావణ్యవతీ - ఇష్ట
అట్లంచు పిల్చు దివ్య ధ్వనికి మమ్ము
పాత్రులుగా చేయుమా


No comments:

Post a Comment