Breaking

Wednesday, 11 September 2024

Bible Quiz On Matthew 8th Chapter

 



1.యేసయ్య కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను ------? 

ఆటంకపరిచెను 

అనుమానించెను 

వెంబడించెను

ప్రేమించెను 



2.ఇదిగో కుష్ఠరోగి వచ్చి యేసయ్యకు మ్రొక్కిప్రభువా, నీకిష్టమైతే నన్ను -------- గా చేయగలవనెను? 

సాక్షిగా 

సేవకునిగా 

శుద్ధునిగా

గొప్పవానిగా



3.ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, యేసయ్యను వేడుకున్నది ఎవరు? 

శతాధిపతి 

యాయీరు 

నీకొదేము 

నతనియేలు 


4.శతాధిపతి యేసయ్య తో - ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు ----- మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడుననెను? 

మాట

ఆలోచన

శక్తి 

మర్మము 

 


5.అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు  ----- లోనికి  త్రోయబడుదురు? 

వెలుపటి గృహములోనికి 

వెలుపటి చీకటిలోనికి

వెలుపటి ఆలయములోనికి 

వెలుపటి ఆవరణములోనికి 



6.యేసుఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు --------? 

దైర్యము నొందెను 

క్షమాపణ నొందెను 

స్వస్థతనొందెను

మరణమొందెను 



7.యేసయ్య పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చెయ్యిముట్టగా ------ ఆమెను విడిచెను ?  

దెయ్యము 

జ్వరము

బలము 

ప్రాణము 


8.జనులు దయ్యములు పట్టిన అనేకులను ఎవరి యొద్దకు తీసికొని వచ్చిరి? 

యేసు నొద్దకు 

యోహాను నొద్దకు 

పరిసయ్యుల యొద్దకు 

శాస్త్రుల యొద్దకు



9.యేసయ్య ---- వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను? 

విశ్వాసం వలన

మాట వలన

ధైర్యము వలన 

బయల్జెబూలు వలన 



10.ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ఏ ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరెను? 

యిర్మీయా 

యెషయా

యెహెఙ్కేలు 

దానియేలు 


11.యేసయ్య తన యొద్దనున్న జన సమూహమును చూచి ఎక్కడికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను? 

ఐగుప్తుకు 

అద్దరికి

సమరయకు 

సీదోనుకు 



12.బోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని యేసయ్యతో అన్నది ఎవరు? 

శాస్త్రి

పరిసయ్యుడు 

సద్దూకయ్యుడు 

సమరయుడు 



13.నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అన్నది ఎవరు? 

పేతురు 

యోహాను

ఆంద్రెయా 

యేసయ్య


14.ప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని యేసయ్యను అడిగింది ఎవరు? 

శిష్యులలో ఒకడు

పరిసయ్యులలో ఒకడు 

శాస్త్రులలో ఒకడు 

సద్దూకయ్యులలో ఒకడు 


15.యేసయ్య అతని చూచి నన్ను వెంబడించుము; మృతులు తమ ---- లను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను? 

మృతులను

దేహములను 

బంధువులను 

స్నేహితులను 


16.యేసయ్య దోనె యెక్కినప్పుడు ఆయన వెంట ఎవరు వెళ్లిరి? 

శాస్త్రులు 

పరిసయ్యులు

సద్దూకయ్యులు 

శిష్యులు



17.సముద్రముమీద తుపాను లేచినందున దోనె ----- చేత కప్పబడెను? 

నీటిచేత 

గాలి చేత

వర్షము చేత 

అలలచేత



18.శిష్యులు యేసయ్య యొద్దకు వచ్చి ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును ----- అని చెప్పి ఆయనను లేపిరి? 

చూడమని చెప్పి

క్షమించమని చెప్పి

విడిపించుమని చెప్పి

రక్షించుమని చెప్పి


19.యేసయ్య శిష్యులతో - అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని చెప్పి, దేనిని గద్దించెను?

గాలిని 

సముద్రమును

అలలను 

గాలిని, సముద్రమును



20.శిష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని -------? 

అనుకొనిరి 

చెప్పుకొనిరి

భయపడిరి

కనుక్కొనిరి 



21.యేసయ్య అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు ----- లలో  నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి? 

గ్రామములలో నుండి 

పట్టణములలో నుండి

సమాధులలో నుండి

అరణ్యములో నుండి 



22.ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలు వేసింది ఎవరు? 

దయ్యములు పట్టిన యిద్దరు స్త్రీలు 

దయ్యములు పట్టిన యిద్దరు శిష్యులు 

దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు

దయ్యములు పట్టిన యిద్దరు పిల్లలు 



23.ఆ దయ్యములు యేసయ్యతో నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ------ లోనికి పోనిమ్మని వేడుకొనెను? 

సముద్రములోనికి 

పందుల మందలోనికి

పట్టణములోనికి 

అరణ్యములోనికి 



24.యేసయ్య దయ్యములను పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ---- లోనికి పోయెను? 

గొఱ్ఱెలలోనికి 

పందులలోనికి

సమాధులలోనికి

సముద్రములోనికి 


25.ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి ----- లోనికి వడిగా పరుగెత్తికొనిపోయెను? 

సముద్రములోనికి

సమాధులలోనికి 

అరణ్యములోనికి 

పట్టణములోనికి



26.పందులు మేపుచున్నవారు పారిపోయి ------- లోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి? 

పట్టణములోనికి

గ్రామములోనికి 

మందిరములోనికి  

అరణ్యములోనికి 



27.ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి ఏమని వేడుకొనిరి? 

వారి ప్రాంతములకు రమ్మని 

వారి ప్రాంతములను విడిచి పొమ్మని

వారి ప్రాంతములలో ఉండమని 

వారి ప్రాంతములను బాగుచేయమని 


No comments:

Post a Comment