అడవి చెట్ల నడుమ
అడవి చెట్ల నడుమ - ఒక జల్దరు వృక్షం వలె
పరిశుద్ధుల సమాజములో - యేసు ప్రజ్వలించుచున్నాడు (2)కీర్తింతున్ నా ప్రభుని - జీవకాలమెల్ల ప్రభుయేసుని
కృతజ్ఞతతో స్తుతించెదను (2)
1. షారోను రోజా ఆయనే - లోయ పద్మమును ఆయనే
అతి పరిశుద్ధుడు ఆయనే - పదివేలలో అతిశ్రేష్ఠుడు (2)
|| అడవి ||
2. పరిమళతైలం నీ నామం - దాని వాసన వ్యాపించెగా
నిందశ్రమ సంకటములలో - నను సుగంధముగా చేయున్
|| అడవి ||
3. మనోవేదన సహించలేక - సిలువవైపునే చూడగా
లేవనెత్తి నన్నెత్తుకొని - భయపడకుమని యంటివి
|| అడవి ||
4. నా త్రోవకు దీపం నీవే - నా బ్రతుకుకు జీవం నీవే
నా సేవకు బలము నీవే - నా ఆత్మకాదరణనీవే
|| అడవి ||
5. ఘనమైన నా ప్రభువా - నీ రక్త ప్రభావమున
నా హృదయము కడిగితివి - నీకే నా స్తుతి ఘనత
|| అడవి ||
6. నీవు నా దాసుడవనియు - ఏర్పరచుకొంటినని
నేనే నీ దేవుడని - భయపడకు మని అంటివి
|| అడవి ||
No comments:
Post a Comment