Breaking

Tuesday, 10 September 2024

అంధకారలోకమునకు

                                   

                         అంధకారలోకమునకు


 అంధకారలోకమునకు

          వెలుగునివ్వ ప్రభువు వచ్చెను

            స్తుతి మహిమ ప్రభునకే


1. నిష్కళంక బలి నిర్దోష ప్రభువే
అమూల్యరక్తమేగ ముక్తిమార్గము
ఏమి యర్పించెదము దానికి బదులుగా
స్తుతి మహిమ ప్రభునకే
|| అంధకారలోకమునకు ||

2. మృత్యువుపై జయమునొంది మన ప్రభువు
ప్రార్థించుచుండె తండ్రి కుడిప్రక్కను
ఏమి యర్పించెదము దానికి బదులుగా
స్తుతి మహిమ ప్రభునకే
|| అంధకారలోకమునకు ||

3. జీవజ్యోతి రక్షకా నీవే ప్రతిఫలం
నీవే ప్రేమ సత్యానంద ధైర్యము
సర్వమందు నమ్మదగిన వాడవు నీవే
స్తుతి మహిమ ప్రభునకే
|| అంధకారలోకమునకు ||

No comments:

Post a Comment