అందరము ప్రభు
అందరము ప్రభు నిన్ను కొనియాడెదము
మహాత్ముండవు పరిశుద్ధుడవుబలియైతివి లోకమును రక్షించుటకు
1. అపారము నీ బుద్ధిజ్ఞాన మెంతయో
సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది
సర్వలోకము నీదు వశమందున్నది
|| అందరము ||
2. గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా
అద్భుతములు చేయు దేవ నీవే ఘనుడవు
శత్రువులను అణచునట్టి విజయశాలివి
|| అందరము ||
3. బండవైన ప్రభూ మమ్ము స్థిరపరచితివి
నీదు మార్గములు యెంతో అగమ్యంబులు
కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు
|| అందరము ||
4. కృపాళుండవైన యేసు దయగల దేవా
దయాకనికరములు గల దీర్ఘశాంతుడవు
వేల వేల తరములలో కృపను జూపెదవు
|| అందరము ||
5. క్షమించెదవు మానవుల పాపములెల్ల
విరోధులకు ప్రేమ జూపు దయామయుడవు
పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా
|| అందరము ||
No comments:
Post a Comment