Breaking

Sunday, 8 September 2024

అంత్యదినమందు దూత - anthyadinamandhu dhutha song lyrics

                  

                                అంత్యదినమందు దూత


అంత్యదినమందు దూత బూర నూదుచుండగా

నిత్యవాసరంబు తెల్లవారగా

రక్షణందుకొన్నవారి పేర్లు పిల్చుచుండగా

నేను కూడ చేరియుందు నచ్చటన్


నేను కూడ చేరి యుందున్

నేను కూడ చేరి యుందున్

నేను కూడ చేరి యుందున్

నేను కూడ చేరి యుందున్ నచ్చటన్


1. క్రీస్తునందు మృతులైనవారు లేచి క్రీస్తుతో

పాలుపొందునట్టి యుదయంబునన్

భక్తులారా కూడిరండి యంచు బిల్చుచుండగా

నేను కూడ చేరి యుందు నచ్చటన్  | నేను |


2. కాన యేసుసేవ ప్రత్యహంబు చేయుచుండి నే

క్రీస్తు నద్భుతంపు ప్రేమ చాటుచున్

కృపనొందువారి పేర్లు యేసు పిల్చుచుండగా

నేను కూడ చేరి యుందు నచ్చటన్   | నేను |

No comments:

Post a Comment