1.మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ---- పొందరు?
బహుమానం
బహు బలము
ఫలము
స్థలము
2.మీరు ప్రార్థనచేయునప్పుడు ----- వలె ఉండవద్దు?
అధికారులవలె
వేషధారులవలె
ధనవంతులవలె
దరిద్రులవలె
3.నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ------ ఇచ్చును?
బహుమానము
బాహు బలము
ప్రతిఫలము
పరిహారము
4.మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె ----- మాటలు వచింపవద్దు?
మంచిమాటలు
చెడ్డ మాటలు
గొప్ప మాటలు
వ్యర్థమైనమాటలు
5.మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ ------ లను క్షమించును?
అలవాట్లను
అపరాధములను
అభిప్రాయములను
ఆలోచనలను
6.మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ ------ లను క్షమింపడు?
అపరాధములను
అభిప్రాయములను
అలవాట్లను
ఆలోచనలను
7.మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె ------ లై యుండకుడి?
పాపముఖులై
దోషముఖులై
శాపముఖులై
దుఃఖముఖులై
8.పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి
అని అన్నది ఎవరు?
యోహాను
యేసుక్రీస్తు
పేతురు
ఆంద్రెయా
9.నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ ------ ఉండును?
ప్రాణము
శరీరము
నివాసము
హృదయము
10.దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు ----- మయమైయుండును?
పాపమయమై
శాపమయమై
చీకటిమయమై
వెలుగుమయమై
11.నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో --------?
మంచిది
చెడ్డది
గొప్పది
చిన్నది
12.మీరు దేవునికిని సిరికిని ----- గా నుండనేరరు?
దాసులుగా
సాక్ష్యులుగా
ప్రియులుగా
శత్రువులుగా
13.మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? అని అన్నది ఎవరు?
యోహాను
యేసుక్రీస్తు
పౌలు
పేతురు
14.ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై -----?
విచారింతురు
ప్రకాశింతురు
ప్రశ్నింతురు
ప్రచురించుతురు
Click here :
Bible Quiz On Matthew 7th Chapter
No comments:
Post a Comment