1.యేసయ్య జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఎవరు ఆయన యొద్దకు వచ్చిరి?
శిష్యులు
శాస్త్రులు
పరిసయ్యులు
సద్దూకయ్యులు
2.ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; ----- వారిది?
భూలోకరాజ్యము
పరలోకరాజ్యము
పరలోకసైన్యము
భూలోకసైన్యము
3.దుఃఖపడువారు ధన్యులు; వారు ------?
దీవించబడుదురు
క్షమించబడుదురు
ఓదార్చబడుదురు
ప్రేమించబడుదురు
4.సాత్వికులు ధన్యులు ; వారు ----- ను స్వతంత్రించుకొందురు?
భూలోకమును
బంగారమును
వజ్రములను
వస్త్రములను
5.నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు ------?
తృప్తిపరచబడుదురు
బాధపరచబడుదురు
బలపరచబడుదురు
సిగ్గుపరచబడుదురు
6.కనికరముగల వారు ధన్యులు; వారు ------- పొందుదురు?
కష్టాలు
కానుకలు
కన్నీరు
కనికరము
7.హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు ----- చూచెదరు?
దేవుని
దేవదూతలను
దెయ్యములను
ధనవంతులను
8.సమాధానపరచువారు ధన్యులు ; వారు ------- అనబడుదురు?
దేవుని సేవకులనబడుదురు
దేవుని సాక్ష్యులనబడుదురు
దేవుని దూతలనబడుదురు
దేవుని కుమారులనబడుదురు
9.నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; ----- వారిది?
భూలోక రాజ్యము
పరలోక రాజ్యము
పరలోక సైన్యము
భూలోక సైన్యము
10.మీరు లోకమునకు ------ అయి యున్నారు?
మట్టయి
ఉప్పయి
నిప్పయి
బంగారమై
11.మీరు లోకమునకు ------- అయి యున్నారు?
వెలుగై
చీకటై
ముఖ్యమై
సౌక్యమై
12.కొండమీదనుండు పట్టణము ------- అయి యుండనేరదు?
మంచిదై
గొప్పదై
మరుగై
చిన్నదై
13.మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై ------- మీదనే పెట్టుదురు?
మంచము మీదనే
ప్రాకారము మీదనే
దీపస్తంభము మీదనే
దేవాలయము మీదనే
14.మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ ------- ప్రకాశింప నియ్యుడి?
ముఖము
వెలుగు
కండ్లు
చెవులు
15.ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.అని అన్నది ఎవరు?
యోహాను
యేసుక్రీస్తు
పౌలు
పేతురు
16.ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల -------- అనబడును?
అల్పుడనబడును
గొప్పవాడనబడును
చిన్నవాడనబడును
చెడ్డవాడనబడును
17.శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని అన్నది ఎవరు?
యోహాను
యేసుక్రీస్తు
పౌలు
పేతురు
18.తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు -------- కి లోనగును?
నిరాశకి
నిస్పృహకి
నరకాగ్నికి
బలహీనతకి
19.నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో ------?
గొడవ పడుము
సమాధానపడుము
సంతోష పడుము
కష్టపడుము
20.ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో ----- చేసినవాడగును?
సహవాసం
స్నేహము
వ్యభిచారము
వ్యాపారము
21.మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది ----- నుండి పుట్టునది?
దేవుని నుండి
లోకము నుండి
మనుషుల నుండి
దుష్టుని నుండి
22.దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ---- కూడ త్రిప్పుము?
ఎడమచెంప కూడ త్రిప్పుము
ఎడమ చేతిని కూడ త్రిప్పుము
ఎడమ కాలిని కూడ త్రిప్పుము
ఎడమ కంటిని కూడ త్రిప్పుము
23.ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ ----- కూడా ఇచ్చివేయుము?
పైవస్త్రము కూడా
వస్తువులు కూడా
ఆయుధములు కూడా
ఆభరణములు కూడా
24.ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ ---- మైళ్లు వెళ్లుము?
రెండు మైళ్లు
మూడు మైళ్లు
నాలుగు మైళ్లు
ఐదు మైళ్లు
25.నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ----- త్రిప్పుకొనవద్దు?
చూపును త్రిప్పుకొనవద్దు
మనసు త్రిప్పుకొనవద్దు
ముఖము త్రిప్పుకొనవద్దు
చేతిని త్రిప్పుకొనవద్దు
26.మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ ------ లను ప్రేమించుడి?
సన్నిహితులను
స్నేహితులను
శ్రేయాభిలాషులను
శత్రువులను
27.మిమ్మును హింసించు వారికొరకు ----- చేయుడి?
ప్రార్థన
ఉపవాసం
ప్రమాణము
ప్రయాణము
28.దేవుడు చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను ----- కురిపించుచున్నాడు?
వర్షము
వడగండ్లు
మంచు
మన్నా
29.మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును ----- గా ఉండెదరు?
అపవిత్రులుగా
అవిధేయులుగా
పరిపూర్ణులుగా
అపరిపూర్ణులుగా
Click here :
Bible Quiz On Matthew 6th Chapter
No comments:
Post a Comment