1.మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి ----- తీర్చబడదు?
న్యాయము
తీర్పు
అప్పు
ఋణము
2.పరిశుద్ధమైనది ------ లకు పెట్టకుడి?
కుక్కలకు
నక్కలకు
పందులకు
మేకలకు
3. మీ ముత్యములను ----- యెదుట వేయకుడి?
కుక్కల యెదుట
పందులయెదుట
మేకల యెదుట
గొఱ్ఱెల యెదుట
4.అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు -------?
ఇయ్యబడును
తీయబడును
కొలువబడును
విడువబడును
5.మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ----- నైయున్నది?
సమాచారమునై
సహాయమునై
ఉపదేశమునై
కనికరమునై
6.ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము -----?
పొడవు
వెడల్పు
ఇరుకు
సంకుచితము
7.జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు ------?
చిన్నవారే
మంచివారే
గొప్పవారే
కొందరే
8.అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు -----?
క్రూరమైన తోడేళ్లు
క్రూరమైన పొట్టేళ్లు
క్రూరమైన సర్పములు
క్రూరమైన మృగములు
9.మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి ------ లో వేయబడును?
అగ్నిలో
అడవిలో
నీటిలో
మట్టిలో
10.ప్రభువా, ప్రభువా, అని పిలుచు ప్రతివాడును ---- లో ప్రవేశింపడు?
మందిరములో
అరణ్యములో
భూలోక రాజ్యములో
పరలోకరాజ్యములో
11.పరలోకమందున్న ----- ప్రకారము చేయువాడే పరలోకరాజ్యములో ప్రవేశించును?
తండ్రి చిత్త ప్రకారము
దూతల చిత్త ప్రకారము
పెద్దల చిత్త ప్రకారము
భక్తుల చిత్త ప్రకారము
12.దేవుని మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును ----- మీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును?
భూమి మీద
ఇసుక మీద
బండమీద
నీటి మీద
13.దేవుని మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ---- మీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును?
బండమీద
ఇసుకమీద
భూమి మీద
నీటి మీద
14.జనసమూహములు యేసయ్య బోధకు -------?
బయపడుచుండిరి
ఆశ్చర్యపడుచుండిరి
సంతోషపడుచుండిరి
లోబడుచుండిరి
15.యేసయ్య వారి శాస్త్రులవలె కాక ------ గలవానివలె వారికి బోధించెను?
జ్ఞానము గలవానివలె
వివేకము గలవానివలె
అధికారము గలవానివలె
అభిషేకం గలవానివలె
No comments:
Post a Comment