1.యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చిరి?
యెరూషలేమునకు
నజరేతునకు
కపెర్నహూమునకు
సమరయాకు
2.యేసు ఎక్కడ జన్మించెను?
యెరూషలేములో
బెత్లహేములో
నజరేతులో
కపెర్నహూములో
3.యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని అని అన్నది ఎవరు?
జ్ఞానులు
గొల్లలు
పిల్లలు
స్త్రీలు
4.హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును ----------?
కలవరపడిరి
భయపడిరి
దిగులుపడిరి
తొందరపడిరి
5.క్రీస్తు ఎక్కడ పుట్టునని హేరోదు రాజు ఎరినడిగెను?
ప్రధానయాజకులను
శాస్త్రులను
పరిసయ్యులును
ప్రధానయాజకులను,శాస్త్రులను
6.హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి,
----- కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొనెను?
శిశువు కనబడిన కాలము
నక్షత్రము కనబడిన కాలము
సూచన కనబడిన కాలము
లేఖనము కనబడిన కాలము
7.హేరోదు జ్ఞానులతో మీరు వెళ్లి, ------ విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనుమనెను?
శిశువు విషయమై
నక్షత్రము విషయమై
లేఖనము విషయమై
జనుల విషయమై
8.హేరోదు జ్ఞానులతో నేనును వచ్చి,ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని ఎక్కడికి పంపెను?
యెరూషలేమునకు
బేత్లెహేమునకు
నజరేతునకు
ఐగుప్తునకు
9.జ్ఞానులు రాజు మాటవిని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ----- ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను?
శిశువు ఉండిన చోటికి మీదుగా
జనుల ఉండిన చోటికి మీదుగా
సైనికులు ఉండిన చోటికి మీదుగా
గొఱ్ఱెల కాపరులు ఉండిన చోటికి మీదుగా
10.జ్ఞానులు నక్షత్రమును చూచి, ---- అయిరి?
ఆనందభరితులైరి
అత్యానందభరితులైరి
భయకంపితులైరి
ధన్యులైరి
11.జ్ఞానులు తల్లియైన మరియను శిశువును చూచి, సాగిలపడి, ఎవరిని పూజించిరి?
మరియను
యోసేపును
హేరోదును
యేసును
12.జ్ఞానులు తమ పెట్టెలు విప్పి, ------ కానుకలుగా సమర్పించిరి?
బంగారమును
సాంబ్రాణిని
బోళమును
బంగారమును, సాంబ్రాణిని, బోళమును
13.జ్ఞానులు హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై ---- మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి?
మరియొక మార్గమున
నిత్య మార్గమున
ఇరుకు మార్గమున
విశాల మార్గమున
14.ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ----- నకు పారిపోమ్మననెను?
ఐగుప్తునకు
మోయాబునకు
కనానుకు
బబులోనుకు
15.యోసేపు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఎక్కడికి వెళ్లెను ?
యెరూషలేముకు
నజరేతునకు
ఐగుప్తునకు
మోయాబునకు
16.జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి ------ తెచ్చుకొనెను?
బలము తెచ్చుకొనెను
జ్ఞానము తెచ్చుకొనెను
ధైర్యము తెచ్చుకొనెను
ఆగ్రహముతెచ్చుకొనెను
17.బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల --- నందరిని హేరోదు వధించెను?
మగ పిల్లలనందరిని
ఆడ పిల్లలనందరిని
చిన్న పిల్లలనందరిని
పుట్టిన పిల్లలనందరిని
18.రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా ----- యు కలిగెను?
భయమును
భూకంపమును
రోదనధ్వనియు
ఆశ్చర్యమును
19.రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ఏ ప్రవక్త ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను?
యెషయా
యిర్మీయా
మీకా
దానియేలు
20.హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై
నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ----- దేశమునకు వెళ్లుమనెను?
ఐగుప్తు దేశమునకు
ఇశ్రాయేలుదేశమునకు
మోయాబు దేశమునకు
కనాను దేశమునకు
21.శిశువు ప్రాణము తీయజూచుచుండినవారు చనిపోయిరని యోసేపుకు చెప్పింది ఎవరు?
దూత
మరియ
జనులు
జ్ఞానులు
22.అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై యోసేపు ఏ ప్రాంతములకు వెళ్లెను?
గలిలయ ప్రాంతములకు
సిరియా ప్రాంతములకు
ఐగుప్తు ప్రాంతములకు
మోయాబు ప్రాంతములకు
23.యోసేపు స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, ----- అను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను?
కానా అను ఊరికి
కపెర్నహూము అను ఊరికి
నజరేతను అను ఊరికి
సీదోను అను ఊరికి
24.ఆయన నజరేయుడనబడునని ఎవరు చెప్పినమాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను?
దూతలుచెప్పినమాట నెరవేరునట్లు
ప్రవక్తలుచెప్పినమాట నెరవేరునట్లు
జనులు చెప్పినమాట నెరవేరునట్లు
యాజకులు చెప్పినమాట నెరవేరునట్లు
Click here :
Bible Quiz On Matthew 3rd Chapter
No comments:
Post a Comment