1.యేసయ్య అపవాది చేత శోధింపబడుటకు ----- వలన అరణ్యమునకు కొనిపోబడెను?
ఆత్మ వలన
అభిషేకం వలన
బలము వలన
భయం వలన
2.యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసమున్నాడు?
30 రోజులు
40 రోజులు
50 రోజులు
60 రోజులు
3.శోధకుడు యేసు నొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు ------- అగునట్లు ఆజ్ఞాపించుమనెను?
రొట్టెలగునట్లు
చాపలగునట్లు
పాములగునట్లు
కఱ్ఱలగునట్లు
4.మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని ----- నుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించుననెను?
దేవుని నోట నుండి
దేవుని ప్రజల నుండి
దేవుని చేతి నుండి
దేవుని మనస్సు నుండి
5.నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుముఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును,నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు
అని యేసయ్యతో అన్నది ఎవరు ఎవరితో అనెను?
పేతురు
అంద్రెయ
అపవాది
యోహాను
6.ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని యేసయ్య ఎవరితో చెప్పెను?
పేతురుతో
యోహానుతో
యాకోబుతో
అపవాదితో
7.అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి యేసయ్యను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి ------ ఆయనకు చూపెను?
అవినీతిని
అవసరతలు
క్రమమును
మహిమను
8.అపవాది యేసయ్యకు యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను చూపి నీవు ----- చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని చెప్పెను?
సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల
సాగిలపడి నాకు సత్కార్యములు చేసినయెడల
సాగిలపడి నాకు పరిచర్య చేసినయెడల
సాగిలపడి నాకు ప్రమాణం చేసినయెడల
9.అపవాది యేసయ్యను విడిచిపోగా, ఎవరు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి?
దేవదూతలు
శిష్యులు
శాస్త్రులు
పరిసయ్యులు
10.యోహాను చెరపట్టబడెనని యేసు విని ఎక్కడికి తిరిగి వెళ్లెను?
గలిలయకు
సమరయకు
యూదయకు
సీదోనుకు
11.యేసయ్య నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి యను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి ------ నకు వచ్చి కాపురముండెను?.
నజరేతునకు
బెత్లహేమునకు
కపెర్న హూమునకు
సీదోనునకు
12.చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి ----- ఉదయించెను?
సూర్యుడు
నక్షత్రం
చంద్రుడు
వెలుగు
13.పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక ----- పొందుడని చెప్పుచు యేసయ్య ప్రకటింప మొదలు పెట్టెను?
బాప్తిస్మము
స్వస్థత
మారుమనస్సు
అభిషేకం
14.యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో ---- వేయుట చూచెను;
బట్టలువేయుట
దోనెలు వేయుట
వలలు వేయుట
చాపలు వేయుట
15.నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని అన్నది ఎవరు?
యోహాను
యేసుక్రీస్తు
పౌలు
పేతురు
16.యాకోబు,యోహానుల తండ్రి పేరు ఏమిటీ?
తద్దయి
లెబ్బయి
జెబెదయి
బర్తలోమయి
17.యాకోబు,యోహానులు తమ తండ్రియైన జెబెదయి యొద్ద వేటిని బాగు చేసి కొనుచుండిరి?
దోనెలను
వస్త్రములను
వలలను
కర్రలను
18.యాకోబు,యోహానులు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఎవరిని వెంబడించిరి?
యోహానును
యేసుక్రీస్తును
పౌలును
పేతురును
19.యేసయ్య సమాజమందిరములలో బోధించుచు,----- ను గూర్చిన సువార్తను ప్రకటించెను?
రాజ్యమును గూర్చిన సువార్తను
రాకడను గూర్చిన సువార్తను
రాజులను గూర్చిన సువార్తను
దూతలను గూర్చిన సువార్తను
20.యేసయ్య ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు ----- యందంతట సంచరించెను?
సిరియయందంతట
గలిలయయందంతట
సమరయయందంతట
బెత్లహేముయందంతట
21.యేసయ్య కీర్తి ---- దేశమంతట వ్యాపించెను?
ఐగుప్తు దేశమంతట
మోయాబు దేశమంతట
కనాను దేశమంతట
సిరియ దేశమంతట
22.నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, యేసయ్య యొద్దకు తీసికొని రాగా ఆయన వారిని -------?
స్వస్థపరచెను
బలపరచెను
గాయపరచెను
దుఃఖపరచెను
Click here :
Bible Quiz On Matthew 5th Chapter
No comments:
Post a Comment