Breaking

Wednesday, 14 October 2020

Daily bible verse in telugu

 


యెహోవా, నీ ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది.
కీర్తనలు 108: 4
ప్రియులారా దేవుడు కృపామయుడు. ఆయన కృప నిరంతరం నిలిచియుండును. కృప అంటే అర్హత లేని వారికి విలువ లేని వారికి ఇవ్వబడిన దేవుని ఆశీర్వాదం ఈ కృప పాపులమైన మనకు పరిశుద్దుడైన దేవునితో ఉండే గొప్ప  దన్యతను ఇచ్చింది అందుకే దావీదు భక్తుడు నీ కృప ఆకాశము కంటే ఎతైనది అని వర్ణించాడు ఆయన కృప వలననే అద్వితీయుడైన దేవునికి వారసులమైనాము
పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు
నా కృప నీకు చాలును బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును మరియు నేనేమైయున్నానో అది దేవుని కృప వలెనే అయియున్నాను. అని
ప్రియులారా దేవుని కృప ఎంతో విలువైనది అది మనల్ని  దేవునికి దగ్గరగా చేస్తుంది. మన ప్రతి బలహీనతలను తీసి వేసి ఆయన పోలికగా మారుస్తుంది కనుక  ఆయన కృపలో స్థిరులమై ఆ కృపను మన జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చుకుందాము.
ఆ కృపను పొందుకొని పౌలు భక్తుణ్ణి పోలీ జీవిద్దాం  జీవిద్దాం 
ఈ వాక్యం ఆయన నిరంతరము కృప చూపువాడని మనకు తెలియజేస్తుంది కనుక ఈ ఈరోజంత ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని కృపలో నిలిచియుందాం
దేవుని కృప పౌలు భక్తునికి తోడుగా ఉన్నట్లు మనకును తోడై యుండును గాక ఆమెన్

No comments:

Post a Comment