Breaking

Thursday, 24 February 2022

Daily bible verse in trlugu

 



మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొ నెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.
లూకా 10: 42

ప్రియులారా
యేసయ్య మరియ మార్థల ఇంటీకి వెళ్ళినప్పుడు
మార్త వంట పనిలో busy గా ఉంది మరియ అయితే
యేసయ్య పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటుంది
పైగా మార్థ యేసయ్య దగ్గరికి వచ్చి
నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమని
యేసయ్యతో అంటుంది
అప్పుడు  యేసయ్య మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే
మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొ నెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.
ప్రియులారా
వంట పని చేయడం కష్టపడటం తప్పని యేసయ్య చెప్పట్లేదు గానీ ఏది ప్రాముక్యమైనదో ఏది ఉత్తమమైనదో యేసయ్య తెలియజేస్తున్నాడు
మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొన్నది
మన  జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదో ఏది ఉత్తమైనదో ఏది
విలువైనదో గ్రహించినప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం
ఒకరోజు ఒక యవ్వనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి
సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి అని అడిగాడు
అందుకు యేసయ్య
వ్యభిచరింప వద్దు, నరహత్యచేయ వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో అన్నాడు
అందుకతడుబాల్యమునుండి వీటినన్నిటిని అనుసరించుచునే యున్నాను నాకింకా కొదువయేమని ఆయన నడిగాడు
అందుకు యేసయ్య నీకింక ఒకటి కొదువగా ఉన్నది; నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను.
అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఆ మాటలు విని మిక్కిలి వ్యసనపడెను
యేసయ్య  అతని చూచి ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము.
ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను.
ప్రియులారా
ఆ యవ్వనస్తుడు దేవుని కంటే ఎక్కువగా ధనమునే ప్రేమించాడు అతడు కలిగి యున్న ధనము కంటే  నిత్యజీవము ఎంత విలువైనదో గ్రహించలేకపోయాడు
సహోదరి సహోదరులారా
మన జీవితంలో  ఏది విలువైనదో ఏది విలువలేనిదో
గ్రహించినప్పుడే మనము సరియైన నిర్ణయాలు తీసుగలం
మార్త యేసయ్య పాదాల చెంత కూర్చొని
ఆయన మాటలు వినడం ఎంత భాగ్యమో గ్రహించలేకపోయింది కానీ మరియ యేసయ్య పాదాల చెంత కూర్చొని ఆయన చెప్పే శ్రేష్ఠమైన మాటలు వింటు ఎంతో గొప్ప ధన్యతను పొందుకుంది
ఆ యవ్వనస్తుడు తాను కలిగి యున్న ధనమును ప్రేమించి దేవుడిచ్చె నిత్యజీవము ఎంత విలువైనదో గ్రహించలేక పోయాడు
ఈ వాక్యం మనము ఏది విలువైనదో ఏది
ఉత్తమమైనదో గ్రహించి విలువైనదే ఉత్తమైనదే ఏర్పరచుకోవాలని తెలియజేస్తుంది
గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ
దేవుడిచ్చె శ్రేష్ఠమైన వాటిని పొందుకొనేవారముగా ఉందాం
అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక


1 comment:

  1. WinStar World Casino & Resort - Yogonet.com
    Get exclusive 바카라 총판 모집 casino offers & bonuses online and choose from 오늘 뭐 먹지 룰렛 25+ of our Casino Rewards® promotions, 맥스 88 including bet365 new and Slots, Roulette, Blackjack, Video 윈조이포커시세 Poker,

    ReplyDelete