రచయిత:
యేసు క్రీస్తు మొదటి శిష్యులలో మత్తయి ఒకడు. అతని ఇంకో పేరు లేవి. మత్తయి 9:9-13; మార్కు 2:13-17; లూకా 5:27-32 చూడండి.
వ్రాసిన కాలం:
యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తరువాత కొన్ని సంవత్సరాలకు, అంటే ఈ శకంలోని మొదటి శతాబ్దంలో.
ముఖ్యాంశం:
యేసు క్రీస్తు పుట్టుకను, జీవితాన్ని, మరణాన్ని, పునర్జీవితాన్ని రాస్తూ మత్తయి ఆయనను పాత ఒడంబడికలో వాగ్దానం చేయబడిన దేవుని అభిషిక్తుడుగానూ దేవుని రాజ్యాన్ని తీసుకువచ్చే గొప్ప రాజుగానూ ప్రకటిస్తున్నాడు. ఈ శుభవార్తలో పాత ఒడంబడికలోని భవిష్యత్ వాక్కులు సుమారు 60, యథార్థమైన వచనాలు (ఉన్నవి ఉన్నట్టుగా) సుమారు 40 ఉన్నాయి. చాలా సార్లు ఉపయోగించిన కొన్ని ముఖ్యమైన మాటలు “రాజు”, “దేవుని రాజ్యం”, “నెరవేరేలా”. 1:1 నోట్స్ చూడండి.
విషయసూచిక
రాజైన క్రీస్తు వంశావళి 1:1-17
రాజు పుట్టుక 1:18-25
రాజును జ్ఞానులు దర్శించారు 2:1-12
రాజు ఈజిప్ట్‌లో, నజరేతులో 2:13-23
రాజు రాకను బాప్తిసమిచ్చే యోహాను ప్రకటించాడు 3:1-12
రాజుకు బాప్తిసమిచ్చాడు 3:13-17
రాజుకు అరణ్యంలో విషమ పరీక్షలు 4:1-11
రాజు ప్రజాసేవ ప్రారంభించాడు 4:12-25
రాజు కొండమీద ప్రసంగం ఇచ్చాడు 5—7 అధ్యాయాలు
రాజు “ధన్యులు” ఎవరో చెప్పాడు 5:3-12
రాజు మనకు ప్రార్థన నేర్పాడు 6:9-13; 7:7-11
రాజు ఇచ్చిన “శ్రేష్ఠమైన నియమం” 7:12
రాజు చెప్పిన రెండు మార్గాలు 7:13-27
రాజు అద్భుతాలతో తన అధికారాన్ని నిరూపించుకొన్నాడు 8వ అధ్యాయం
రాజు కుష్ఠురోగిని బాగు చేసిన వివరణ 8:2-4
రాజు శతాధిపతి దాసుణ్ణి బాగు చేసిన వివరణ 8:5-13
రాజు పేతురు అత్తగారిని స్వస్థపరచిన వివరణ 8:14-15
రాజు దయ్యాలను పారద్రోలిన వివరణ 8:16-17,28-33
రాజు శిష్యత్వాన్ని గురించి ఇచ్చిన అర్హతలు 8:18-22
రాజు తుఫానును అణచివేసిన వివరణ 8:23-27
రాజు పక్షవాత రోగిని స్వస్థపరచి అతని పాపాలు క్షమించాడు 9:1-8
రాజు మత్తయిని శిష్యరికానికి పిలిచాడు 9:9-13
రాజు తన గురించి బాప్తిసమిచ్చే యోహాను గురించి మాట్లాడాడు 9:14-17
రాజు యాయీరు కూతురిని బ్రతికించి ఒక స్త్రీ రుతుస్రావాన్ని బాగు చేశాడు 9:18-26
రాజు గ్రుడ్డివాళ్ళ కళ్ళు తెరిచాడు 9:27-31
రాజు శిష్యులను ఎన్నుకొని వారికి పనులు అప్పగించాడు,
ఇంకా వారు ఎలా ప్రవర్తించాలో నేర్పించాడు 10:1-42
రాజు మళ్ళీ తన గురించి బాప్తిసమిచ్చే యోహాను గురించి మాట్లాడాడు 11:2-19
రాజు కొన్ని పట్టణాలపై తీర్పును ప్రకటించాడు 11:20-24
రాజు తన దైవత్వాన్ని బయల్పరిచాడు 11:27
రాజు విశ్వాసులకు విశ్రాంతి ఇస్తాననే వాగ్దానం ఇచ్చాడు 11:28-29
రాజు అనేక అద్భుతాలు చేసి పరిసయ్యుల విరోధాన్ని ఎదుర్కొన్నాడు 12:1-45
రాజు తన తల్లి, తోబుట్టువుల గురించి మాట్లాడాడు 12:46-50
రాజు దేవుని రాజ్యాన్ని గురించి చెప్పిన ఉదాహరణలు 13:1-54
రాజు తన స్వగ్రామంలోనే అవిశ్వాసానికి, తిరస్కారానికి గురయ్యాడు 13:55-58
రాజు, హేరోదురాజు, బాప్తిసమిచ్చే యోహాను 14:1-12
రాజు అయిదు వేల మందికి ఆహారమిచ్చిన సంగతి 14:13-21
రాజు నీటిమీద నడిచిన సంగతి 14:22-33
రాజు యూదుల అధికారులనుంచి మరింత వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు 15:1-15
రాజు అశుద్ధమైన వాటిని వివరించాడు 15:16-20
రాజు కనాను స్త్రీ కూతురిని బాగు చేశాడు 15:21-28
రాజు నాలుగు వేల మందికి ఆహారమిచ్చాడు 15:29-38
రాజు యూదుల అధికారాల గురించి తన శిష్యులను హెచ్చరించాడు 16:1-12
రాజు తాను ఎవరో తనకు ఏమి జరగబోతుందో బయల్పరిచాడు 16:13-23
రాజు శిష్యత్వాన్ని గురించి మాట్లాడాడు 16:24-28
రాజు దివ్య రూపం 17:1-8
రాజు, ఏలీయా, బాప్తిసమిచ్చే యోహాను 17:9-13
రాజు ఒక అబ్బాయిని బాగు చేశాడు, ప్రార్థించే విధానం నేర్పించాడు,
దయ్యాలను వెళ్ళగొట్టాడు 17:14-21
రాజు పన్నుల గురించి నేర్పించాడు 17:24-27
రాజు, చిన్న పిల్లలు 18:1-14
రాజు తన సంఘాన్ని గురించి తన శిష్యులకు ఉపదేశించాడు 18:15-20
రాజు క్షమాపణ విషయం బోధిస్తూ క్షమించని చెడ్డ దాసుని ఉదాహరణ ఇచ్చాడు 18:21-35
రాజు వివాహం గురించి, విడాకుల గురించి నేర్పిన సంగతులు 19:3-12
రాజు, ఆస్తిపరుడైన యువకుడు 19:16-22
రాజు తన శిష్యుల బహుమానాల గురించి చెప్పాడు 19:23-30
రాజు ద్రాక్షతోటలో పనివారిని గురించి ఇచ్చిన ఉదాహరణ 20:1-16
రాజు మళ్ళీ తన మరణం, సజీవంగా లేవడం గురించి చెప్పిన సంగతి 20:17-19
రాజు గొప్పతనాన్ని గురించి ఉపదేశిస్తూ తాను ఈ భూమిమీదికి
ఎందుకు వచ్చాడో చెప్పిన సంగతి 20:20-28
రాజు యెరికోలో గ్రుడ్డివారిని బాగు చేసిన సంగతి 20:29-34
రాజు జెరుసలంలో ప్రవేశం 21:1-11
రాజు దేవాలయంలో వర్తకులను తరిమివేసిన సంగతి 21:12-13
రాజు వాడిపోయిన అంజూర చెట్టును శపించాడు 21:17-22
రాజు యూదుల అధికారులనుంచి మళ్ళీ వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు 21:23-27
రాజు రెండు ఉదాహరణలు ఇచ్చాడు (ఇద్దరు కొడుకులు, ద్రాక్షతోట) 21:28-46
రాజు పెండ్లి విందు ఉదాహరణ ఇచ్చాడు 22:1-14
రాజు, యూదుల అధికారుల ప్రశ్నలు 22:15-46
రాజు యూదుల అధికారుల పద్ధతులను ఖండించాడు 23:1-36
రాజు జెరుసలం గురించి ఏడ్చాడు 23:37-39
రాజు తెలియజేసిన భవిష్యత్తు 24:1-51
రాజు చెప్పిన పదిమంది కన్యల ఉదాహరణ 25:1-13
రాజు తన రెండవ రాక గురించి, జనాల తీర్పును గురించి చెప్పాడు 25:31-46
రాజును ఒక స్త్రీ అభిషేకించినది 26:6-13
రాజు ఆఖరి పస్కాపండుగ 26:17-35
రాజు చేసిన క్రొత్త ఒడంబడిక 26:26-29
రాజు గెత్‌సేమనే తోటలో 26:36-46
రాజును బంధించారు 26:47-56
రాజు ప్రముఖయాజి సమక్షంలో 26:57-75
రాజును ఎరుగనని పేతురు అన్నాడు 26:69-75
రాజు పిలాతు సమక్షంలో 27:1-26
రాజును సైనికులు వెక్కిరించారు 27:27-32
రాజును సిలువ వేశారు 27:33-56
రాజును సమాధి చేశారు 27:57-66
రాజు పునర్జీవితం 28:1-7
రాజు తన విశ్వాసులకు దర్శనమిచ్చి వారికి ఆదేశాలు ఇచ్చాడు 28:8-20
No comments:
Post a Comment