రచయిత:
ఇందులోని భవిష్యద్వాక్కులను పలికిన మలాకీయే దీని గ్రంథకర్త.
వ్రాసినకాలం:
మలాకీ బహుశా నెహెమ్యా సమకాలికుడై ఉండవచ్చు (క్రీ.శ. 430 ప్రాంతం). నెహెమ్యా యూదయ గవర్నరుగా ఉన్న కాలంలో యూదుల్లో ఉన్న దురాచారాలన్నిటినీ మలాకీ ఈ పుస్తకంలో ఖండించాడు. నెహెమ్యా వీటిని చాలావరకు చక్కదిద్దాడు. పాత ఒడంబడిక యుగంలో మలాకీ ఆఖరు ప్రవక్త.
ముఖ్యాంశము:
దురాచార ఖండన, బాప్తిసమిచ్చే యోహాను రాకనూ యుగాంతంలో ఏలీయా రాకనూ గురించిన భవిష్యద్వాక్కులు.
విషయసూచిక:
దేవుని ప్రేమను యూదులు ప్రశ్నించడం. 1:1-2
ఎదోంవారి పై దేవుని తీర్పు 1:3-5
యూదులు దేవుని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించిన విధం 1:6-9
యూదుల అపవిత్రమైన ఆరాధనా విధానం 1:10-14
యాజులు దేవునికి చేసిన ద్రోహం 2:1-9
ప్రజలు దేవుని ఒడంబడికను, ఆలయాన్ని అపవిత్రం చేయడం 2:10-12
ప్రజలు తమ వివాహ బంధాల విషయంలో చేస్తున్న ద్రోహం 2:13-16
ప్రజలు తమ మాటలచేత దేవునికి తాపం కలిగించడం 2:17
బాప్తిసమిచ్చే యోహాను, అభిషిక్తుడు వచ్చి చేసేపని 3:1-4
దేవుని న్యాయనిరతి 3:5-7
దేవునినుండి ప్రజలు దొంగిలించడంవల్ల ఫలితాలు 3:8-12
ప్రజల మాటల్లో కనిపిస్తున్న గర్వం 3:13-15
భయభక్తులున్న వారి మాటలు 3:16-18
యెహోవా దినం గురించిన వర్ణన 4:1-3
యెహోవా దినానికి ముందు ఏలీయా రాక 4:4-6
No comments:
Post a Comment