రచయిత:
హగ్గయి సమకాలికుడు జెకర్యా ప్రవక్త. ఇతడు ఇద్దో అనే యాజికి మనుమడు.
వ్రాసిన కాలం:
జెకర్యా పరిచర్య హగ్గయి పరిచర్య కాలంలో మొదలై (జెకర్యా 1:1; హగ్గయి 1:1 పోల్చి చూడండి) చాలాకాలం కొనసాగింది. అది క్రీ.పూ. 520లో ఆ తరువాత ఎప్పుడో ఈ గ్రంథం వ్రాశాడు.
ముఖ్యాంశాలు:
హగ్గయి గ్రంథంలో కనిపించే సందర్భమే ఈ గ్రంథం సందర్భం, ఉద్దేశమూ. ప్రజలను మందలించి ఆలయ నిర్మాణానికి పురిగొల్పడం, దేవాలయ నిర్మాణాన్ని ప్రోత్సహించడం, లోకజనాలపై దేవుని తీర్పు, భవిష్యత్తులో ఇస్రాయేల్‌కు కష్టం, ఆ తరువాత దీవెన, క్రీస్తు రెండు రాకడలు (3:8; 6:12-13; 9:9; 14:3-4).
విషయసూచిక:
తేది, పరిచయం, ప్రారంభ హెచ్చరికలు 1:1-6
ఎనిమిది స్వాప్నిక దర్శనాలు 1:7—6:8
గొంజిచెట్లమధ్య గుర్రాల మందలో కనిపించిన వ్యక్తి 1:8-17
నాలుగు కొమ్ముల దర్శనం 1:18-21
కొలనూలు చేతపట్టుకుని ఉన్నవ్యక్తి 2:1-13
ప్రముఖయాజి యెహోషువను అలంకరించడం, అతనికి అప్పగించిన అధికారాలు,
అభిషిక్తుణ్ణి (“చిగురు”) గురించిన భవిష్యద్వాక్కు 3:1-10
బంగారు దీపస్తంభం, ఆలీవ్ చెట్లదర్శనం 4:1-14
ఎగిరిపోతున్న పత్రం దర్శనం 5:1-4
కొలతబుట్టలో కూర్చుని ఉన్న స్త్రీ 5:5-11
నాలుగు రథాల దర్శనం 6:1-8
ప్రముఖయాజికి కిరీటం పెట్టడం, అభిషిక్తుని రాక విషయాలు 6:9-15
నిజమైన మార్గం, వట్టి మతాచారాలు 7:1-7
ప్రజలు దేవుని మాట విననందువల్ల ఆయన కోపానికి గురి కావడం 7:8-14
తిరిగి క్షేమస్థితి కలిగించాలని దేవుని నిర్ణయం, వారు ప్రవర్తించవలసిన తీరు 8:1-17
ఉపవాసాలు ఉత్సవాలుగా మారడం, ఇతర ప్రజలు కూడి రావడం 8:18-23
ఇతర జనాల వినాశనం, అభిషిక్తుని రాక 9:1-9
అభిషిక్తుడు, శాంతి ప్రదాత 9:10
ఇస్రాయేల్‌వారి విజయాలు, ప్రభావం 9:11-17
కపట దేవతలు, కపట నాయకుల బారి నుండి
దేవుడు తన ప్రజను విడిపించి వారికి సంతోషాన్నిస్తాడు 10:1-8
చెదిరిపోయిన తన ప్రజలను దేవుడు సమకూరుస్తాడు 10:9-12
మంద క్షేమం పట్టించుకోని కాపరులు 11:1-11
ముప్ఫయి వెండి నాణేల గురించిన భవిష్యద్వాక్కు 11:12-14
మందను హింసించే కాపరి 11:15-17
చివరి రోజుల్లో కష్టాలకు కేంద్రంగా ఉన్న జెరుసలం విడుదల, విజయం 12:1-9
అభిషిక్తుని విషయంలో యూదుల పశ్చాత్తాపం, విలాపం 12:10-13
యూదులను పవిత్రపరచడం 13:1-5
చేతుల్లో గాయాలు 13:6-7
శేషించినవారి పవిత్రత 13:8-9
యెహోవా దినం చిత్రీకరణ, భూమిపై దేవుని రాజ్య స్థాపన 14:1-11
యుగాంతంలో జరిగే యుద్ధ వర్ణన 14:12-15
జెరుసలం భావికాల వైభవం 14:20-21
No comments:
Post a Comment