భారతదేశం బ్రిటిషువారి పరిపాలనలో ఉన్న కాలంలో దేశంలోని అనేక క్రైస్తవ సంఘాలలో ఆంగ్ల పాటలనే పాడేవారు. ఆ రోజులలో తమిళ క్రైస్తవులలో సువార్త పట్ల ఆసక్తిని కలిగించుటకై శంతియాగు ఎంతో కృషిచేశారు. వారి మతమును వ్యాపింపచేయుటకే ఆంగ్లేయుల ఆధిపత్యమును అంగీకరించారని క్రైస్తవులు నిందింపబడుతున్న రోజులు పరిస్థితులలో శంతియాగు మాత్రం, దేవుని రాజ్యము మరియు ఆయన సార్వభౌమ్య అధికారము ఈ లోకములోని ఏ రాజ్యాధికారాలకన్నా అత్యున్నతమైనవని ధైర్యముగా బోధించారు. అతని పాటలు ప్రజలందరి మీద దేవునికి ఉన్న అధికారాన్ని ప్రకటించడమే కాకుండా ప్రజలకు వారి సామాజిక బాధ్యతలను గురించి కూడా గుర్తుచేసేవి. ప్రసిద్ధిగాంచిన "దాసరే ఇత్తరణియై అన్బాయ్ యేసువుక్కు
సొంతమాక్కువోష్" (దాసులారా ధరణిని యేసుకు ప్రేమతో సొంతము చేయుడి)
అను పాటయు మరియు "యేసువుక్కు నమదు దేశ." (యేసుకు మన
దేశమును) అనే దేవుని సర్వోన్నత అధికారాన్ని గురించి తెలియజెప్పే పాటయు ప్రజల మనసులలో చెరగని ముద్ర వేసాయి.
హైందవ కుటుంబం నుండి వచ్చిన శంతియాగు, తన జీవితమంతా దేవుని సేవ చేయుటకే అంకితం చేశారు. గణిత ఉపాధ్యాయునిగా పనిచేసిన అతను, తరువాతి కాలంలో తన పూర్తి సమయాన్ని ఒక పాదిరిగా క్రైస్తవ సంఘానికి సేవలనందించుటకు తీర్మానించుకున్నారు. క్రైస్తవ సంఘముల ఐక్యత కొరకు అతను ఎంతో పాటుపడ్డారు. ఆకలితోను, అనారోగ్యంతోను బాధపడుతున్న వారు మరియు అణగారిన వారి యొక్క అవసరతలను గుర్తించి వాటికి స్పందించేవారు. అతని పరిచర్య ద్వారా వారి పాపముల గురించి, వ్యసనముల గురించి మరియు వాటి వలన కలిగే పర్యవసానములను గురించి ప్రజలకు గ్రహింపు కలిగేలా చేశారు. దేవుని వాక్యం ద్వారా నామకార్ధ భక్తి జీవితాన్ని అతను కఠినంగా ఖండించారు. అతని
యొక్క క్రైస్తవ ఉజ్జీవ పాటలు ఎంతో మంది హృదయాలను నూతనపరచి, వారు క్రీస్తు
కొరకు సాక్షులుగా జీవించునట్లు చేశాయి.
"ప్రభువా, నేను నివసిస్తున్న ఈ దేశాన్ని మీ స్వాస్థ్యముగా చేయుటకు నన్ను వాడుకొనుము. ఆమేన్!"
No comments:
Post a Comment