నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోషకారణముగాను చేసెదను.
యెషయా 60: 15
మన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయనకు అసాధ్యమైనది ఈ లోకమందే గాని పరలోకమందే గాని ఏదియు లేదు ఆయన మాట ఇచ్చి దానిని నెరవేర్చు వాడై యున్నాడు
ఆయనను ప్రేమించి ఆయన మార్గములో నడిచే వారిని గురించి దేవుడు యెషయా భక్తుని ద్వారా ఈ మాటను పలికించాడు ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారిని
శాశ్వత శోభాతిశయముగా చేసి బహు తరములకు సంతోషకారణముగా చేస్తానని మాట ఇచ్చిన దేవుడు
ఆ మాట ప్రకారంగా చాలా మంది భక్తులను ఆశీర్వదించాడు ఉదాహరణకు
అబ్రాహామును దావీదును దానియేలును పౌలును ఇలా చాలా మంది భక్తులను మనకు సంతోషకారణముగా చేసియున్నాడు వారి విశ్వాసం
దేవుణ్ణి వారు ప్రేమించిన విధం చూడగా అది మనకు
ఆశీర్వాదకారణంగాను ఆనందముగాను ఉంది
దేవుడు మనకు కూడా ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు
మనము ఈ లోకాశాలను శరీరాశాలను విడిచి పెట్టి
దేవుని వాక్యపు వెలుగులో కూర్చొని ఆయనను ప్రేమించి ఆయన మార్గములో నడిచేవారిగా ఉన్నట్లయితే మనలను కూడా శాశ్వతమైన శోభాతిశయముగా మార్చి రాబోవు తరములకు
సంతోషకారణముగా చేస్తాడు
ఈ వాక్యము మనము శాశ్వతమైన ఆశీర్వాదంగా ఉండుటకు సహాయం చేస్తుంది
కాబట్టి ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ
దేవుడు ఇష్టపడే వ్యక్తులముగా మారుద్దాం
దేవుడు కృప మనకు తోడై ఉండును గాక ఆమెన్
No comments:
Post a Comment