దక్షిణ అమెరికాలో ఉన్న ఈక్వడార్ అనే దేశం యొక్క వైవిధ్యభరితమైన ప్రకృతి, అమెజానును పోలిన దట్టమైన అరణ్యాలు మరియు గలాపగోస్ దీవులలోని అద్భుతమైన వన్యప్రాణుల సంపదల కలయికల అద్భుత సౌందర్య దృశ్యం. అక్కడి స్థానిక గిరిజనులలోని ఆకా అమరిండియన్స్ అనే తెగవారు కూరత్వంతో నిండిన అనాగరికులుగాను, బాహ్య ప్రపంచమును శతృత్వ దృష్టితో చూసేవారుగాను ప్రసిద్ధి. ఆ ప్రాంతం కొరకు, మరి ముఖ్యంగా ఆ తెగవారి కొరకు అనేక మిషనరీలు మిక్కిలి భారాన్ని కలిగినవారై వారికి ఏవిధముగానైనా క్రీస్తు ప్రేమను గురించి ప్రకటించాలని కోరుకున్నారు. అయితే, ఎన్నో సంవత్సరాలుగా అది ఒక సవాలుగానే మిగిలిపోయింది.
ఒక గొప్ప విమాన చోదకుడు (పైలట్) అయిన నేట్, అమెరికాలోని 'మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్'లో (వైమానిక సహవాస మిషస్) సభ్యుడు. ఆకా తెగవారిని చేరుకొని వారికి సువార్తను అందించాలని అతను కూడా బలమైన కోరికను కలిగియున్నారు. తద్వారా అతను తన తోటి మిషనరీ స్నేహితులైన జిప్ ఎలియట్, ఎడ్ మెక్ కల్లీ, పీట్ ఫ్లెమింగ్ మరియు రోజర్ యుడేరియస్ అను వారితో కలిసి ఈక్వడార్ లోని షెల్ మేరా అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ దట్టమైన అడవులలో విమానంలో ఎగురుతూ, చివరకు ఆకా గిరిజనుల స్థావరాన్ని వారు కనుగొన్నారు. అయితే "వారిని కలుసుకొనుట ఎలా?" అనునది దాని వెనువెంట తలెత్తే పెద్ద ప్రశ్న. నేట్ తన సహచరులతో ఈ విషయమును గురించి చర్చించి, ఎంతో భారంతో ప్రార్థన చేశారు.
వారు సంకల్పించిన ఈ మిషనుకు దేవుడు ఒక క్రొత్త ప్రేరణను కలిగించాడు. ఆ తెగవారికి తాము స్నేహితులమే అనే భావన వారిలో కల్పించుటకుగాను నేట్ మరియు అతని బృందం ఒక బకెట్టులో బహుమతులను ఉంచి దానిని విమానంలో నుండి క్రిందికి దించారు. బహుమతులను పొందుటతో ఉత్సాహభరితులైన ఆ ప్రజలు కూడా వారికి తిరిగి కొన్ని బహుమతులను ఆ బకెట్టులో ఉంచి పంపించారు. దానితో ప్రోత్సాహపరచబడిన నేట్ బృందం ఎటువంటి హానీ లేదని నిశ్చయించుకొని చివరికి ఒక రోజు ఆ ప్రజలను కలుసుకొనుటకు ఎంతో
ఉత్సాహంతో క్రిందికి దిగారు.
1956, జనవరి 8న ఆ బృందంలోని మిషనరీలు ఆకా ప్రజలను చేరుకొనుటలో వారు పొందిన గొప్ప ఆనందాన్ని గురించి వారి కుటుంబ సభ్యులకు వర్తమానములను పంపారు. అయితే, అదే వారి నుండి వచ్చే చివరి వర్తమానం అవుతుందని ఎవరూ ఊహించలేదు. క్రిందికి దిగిన తరువాత ఆ ఐదుగురు మిషినరీలు ఆకావారి చేతులలో కూరంగా చంపబడి, అక్కడి నదిలో విసిరివేయబడ్డారు.
హతసాక్షులుగా మరణించిన నేట్ మరియు అతని బృందం యొక్క ప్రయత్నాలు వ్యర్థం కాలేదు. ఆ సంఘటనల తరువాత నేట్ యొక్క సోదరి రేచెల్ సెయింట్ ఇతర మిషనరీలతో కలిసి తన సోదరుడు ఆకా వారికి సువార్త చేరవేయుటకు ఆరంభించిన ఆ ప్రయత్నాలను కొనసాగించారు. ఏదేమైతేనేమి, చివరకు దేవుని ప్రేమ ఆకా ప్రజలను చేరుకొనగా, ఆ తెగలోని ఎంతోమంది క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించారు.
"ప్రభువా, మీ నడిపింపుతో మీ పని చేయుటకు నన్ను నేను సమర్పించుకొంటున్నాను. ఆమేన్ !"
No comments:
Post a Comment