ప్రియులారా
దేవుడు ఈ లోకానికి వెలుగై యున్నాడు ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు చీకటి పాపానికి సాదృశ్యం
పాపము చేయువాడు పరలోకానికి పాత్రుడు కాదు
మనం నిత్య రాజ్యములో ప్రవేశించాలంటే ఆయన మార్గములో నడువవలసిన వారమై యున్నాము
దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది
వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించు వాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు అని
ప్రియులారా
దేవుడు మనము చేసిన తప్పులను పాపాలను క్షమించి ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అలాగే మనం మన పొరుగువారిని కూడా క్షమించి వారి మారు మనస్సు నిమిత్తం ప్రార్ధించు వారమై యున్నాము
అప్పుడే మనము దేవుణ్ణి వెంబడించిన వారమై యుంటాము
ఈ వాక్యం మనము పాపము జీవితాన్ని విసర్జించి
పరిశుద్ధమైన దేవుని ప్రేమగల వారమై యుండాలని మనకు తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా
ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వెలుగు కలిగి జీవిద్దాం
దేవుని కృప మనకు తోడై ఉండును గాక ఆమెన్
మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.
యోహాను 8: 12
No comments:
Post a Comment