కార్యారంభముకంటె కార్యాంతము మేలు
ప్రసంగి 7: 8
ప్రియులారా దేవుని మాటలు మనకు జ్ఞానాన్ని ఇస్తాయి. ఈ లోకం లో శ్రేష్టమైన వారముగా ఎలా జీవించాలో తెలియస్థాయి
చాలా మంది పనులను ఆరంబించుటకు ఆతుర పడుతారు కానీ చివరి వరకు దానిని కొనసాగించలేరు అందుకే దేవుడు పని ప్రారంభించడం కన్నా దానిని ముగించడం మేలైనదిగా మనకు తెలియజేస్తున్నాడు
యేసయ్య ఈ విందంగా అంటున్నాడు
నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపడుదురు అంత వరకు సహించినవాడే రక్షణ పొందును. అని.
ప్రియులారా దేవుణ్ణి తెలుసుకోవడం గొప్ప విషయం కాదు కానీ ఆయన చెప్పిన మార్గములో జీవిస్తూ అంతము వరకు దానిని కొనసాగించడం గొప్ప విషయం అప్పుడే మనం రక్షణ పొందగలం మనము శ్రేష్టమైన దేవుని మార్గాన్ని తెలుసుకున్నాము గనుక ఎన్ని శ్రమలు వచ్చిన ఓపికతో పరిగెత్తి ఆయన మన కొరకు నిర్మించిన ఆ గొప్ప పట్టణమునకు వారసులమౌదాము ఈ వాక్యం ఏ పని మొదలు పెట్టిన దానిని చివరివరకు కొనసాగించాలని తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా వాక్యాన్ని ధ్యానిస్తూ పనిని ముగించువారమై జీవిద్దాం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక ఆమెన్
No comments:
Post a Comment