Breaking

Wednesday, 27 October 2021

Daily bible verse 28.10.2021

 




సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు తప్పి పోలేదు.

1సమూయేలు 3: 19


ప్రియులారా చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన సమూయేలు భక్తుడు దేవుని దృష్టికి నీతిమంతుడై  ఉండెను అతను పెద్దవాడు అయినను  దేవుని నీతి కలిగి దేవుని మాటకు లోబడి జీవించెను అందుకే అతడు పెద్ద వాడు కాగా యెహోవా అతనికీ తోడై యున్నందున 

అతని మాటలలో ఏదియు తప్పి పోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను 

ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప రాజుగా నుండిన దావీదును ఈ సమూయేలు ప్రవక్త అభిషేకించెను. సమూయేలు ప్రజలను గురించి ప్రార్ధించుటకు వారిని హెచ్చరించి దేవుని మార్గంలో నడిపించుటకును ఇష్టముగలవాడై ఉన్నాడని అతని మాటలను బట్టి మనం చెప్పగలం ఒక సంధర్బములో అంతట సమూయేలు జనులతో ఇట్లనెను-భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి. 

ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. 

యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగియున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. 

నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును. 

ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. 

మీరు కీడుచేయువారైతే తప్పకుండ మీరును మీ రాజును నాశనమగుదురు.

అని వారికి సెలవిచ్చి వారందరి హృదయాలను దేవుని తట్టుకు త్రిప్పెను. 

ప్రియులారా చిన్ననాటి నుండే దేవునితో సహవాసం చేసిన వారు ఏ విధంగా జీవిస్తారో సమూయేలు సమూయేలు జీవితమును బట్టి మనకు అర్దమవుతుంది.అతను జీవించినంత కాలము ఎంతో ధైర్యముగా ఉండెను. ఈ దైర్యం దేవుని యందు భయభక్తులు నిలుపుట వలననే కలిగెనని  మనం 

గ్రహించాలి 

దేవుడు మనలను కూడా ఇష్టపడే ధైర్యము గలవారీగా చేయాలనీ ఇష్టపడుతున్నాడు అందుకే నీతి మంతుడు సింహము వలే ధైర్యముగా ఉండును అనే దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ఎవరైతే ఆ వ్యాఖ్యనుసారముగా  జీవిస్తారో 

వారు  దేవుని వాక్యమును గ్రహించి  ఎన్నడూ భయపడరు ఈ లోకంలో అనేక భయాలు కలిగి మనముంటం. అయితే మన భయాన్ని ధైర్యముగా మార్చేది దేవుని వాక్యమే నని మనం గ్రహించి ఆ వాక్యాన్ని చదువుటకును దాని ప్రకారముగా  జీవించుటకు ఇష్టపడుదాం. 

ఈ వాక్యం సమూయేలు వలె దేవునితో సహవాసము చేయు వారీగా మనముండాలని  మనకు తెలియచేస్తుంది. గనుక ఈ రోజంతా ఈవాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని నీతిగలవారమై జీవిద్దాం.. దేవుని ఆత్మ మనలో ఉండి మనలను ఆయన నీతి మార్గములో నడిపించును గాక ఆమెన్

No comments:

Post a Comment