నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు.
కీర్తనలు 5: 11
ప్రియులారా
దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై యుండదు ఆయన మహోన్నతుడు మహాఘనుడు
సర్వము చేయగల సామర్థ్యం గలవాడు
ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అలాంటి
దేవుణ్ణి ఆశ్రయించినట్లైతే ఆయనే మనలను కాపాడి
తన క్షేమముతో మనలను సంతోషపరుస్తాడు
కాబట్టి మనము నిత్యము ఆనంద ధ్వని చేయుదము
ఈ లోకములో మన అవసరాలను బట్టి మనుషులను ఆశ్రయించువారముగా ఉంటాము వారిచ్చు వారిచ్చే ఆశ్రయం కొంతకాలం మాత్రమే ఉండగలదు కానీ ప్రతి చిన్న విషయములో కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించినట్లైతే మనము గొప్ప మేలుల చే నింపబడుతాము దైవజనుడైన భక్త్ సింగ్ గారు
తన ప్రతి అవసరాన్ని దేవుని దగ్గర అడిగి తీసుకునే వాడు అలాంటి దైవజనులు చాలా మందే మనకు కనిపిస్తుంటారు వారు ఇహలోక సంబంధమైన దేదియు అడిగే వారు కాదు కాని దేవునితో సహవాసం చేసి
నిత్యము ఆయనతో సంతోషించు వారై యున్నారు
మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మాత్రమే
నిజమైన సంతోషాన్ని పొందుకోగలము
ఈ వాక్యం ఎటువంటి సమయములోనైనా దేవుణ్ణి ఆశ్రయించు వారమై యుండి ఆయన ఇచ్చు సంతోషాన్ని పొందుకోవాలని తెలియజేస్తుంది
గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ
దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం
దేవుడు నిత్యము మనకు ఆశ్రయముగా ఉండును గాక ఆమెన్
No comments:
Post a Comment