నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు.
కీర్తన 5:11
ప్రియులారా..
దేవున్ని ఆశ్రయించువారికి ఏ మేలు కూడా కొదువైయుండదు. ఆయన మహోన్నతుడు, మహా ఘనుడు. సర్వము చేయగల సామర్థ్యం గలవాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీయులేదు.
అలాంటి దేవున్ని ఆశ్రయించినట్లైతే ఆయనే మనలను కాపాడి తన క్షేమముతో మనలను సంతోష పరుస్తాడు. కాబట్టి మనం నిత్యము ఆనందధ్వని చేయుదుము.
ఈ లోకంలో మనం మన అవసరాలను బట్టి చాలా సార్లు మనుష్యులను ఆశ్రయించువాడముగా ఉంటాము. వారిచ్చు ఆశ్రయం కొంతకాలం వరకే ఉండగలదు. కానీ ప్రతీ చిన్న విషయంలో కూడా మనం దేవున్ని ఆశ్రయించినట్లైతే మనం మనం గొప్పమేలులచే నింపబడుతాము. దైవజనుడైన భక్తసింగ్ గారు తన ప్రతీ అవసరాన్ని దేవుని దగ్గర అడిగి తీసుకునేవాడు. అలాంటి దైవజనులు చాలా మంది మనకు కనిపిస్తుంటారు. వారు ఇహలోక సంబంధమైన దేదియు అడిగే వారు కాదు కానీ దేవునితో సహవాసం చేసి నిత్యము ఆయనతో సంతోషించువారై యున్నారు. మనం కూడా దేవున్ని ఆశ్రయించి నప్పుడు మాత్రమే నిజమైన సంతోషాన్ని పొందుకోగలము
ఈ వాక్యం మనం ఎటువంటి సమయములో నైనా దేవున్ని ఆశ్రయించువారమై యుండి ఆయన ఇచ్చు సంతోషాన్ని పొందుకోవాలని తెలియజేస్తుంది. కనుక రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం.
దేవుడు నిత్యము మనకు ఆశ్రయముగా ఉండునుగాక.
ఆమెన్
No comments:
Post a Comment