మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.
యోహాను 12: 36
ప్రియులారా
ఇక్కడ వెలుగు అనగా యేసుక్రీస్తు
ఎవరైతే యేసుక్రీస్తు నందు విస్వాసముంచు తారో
వారు దేవుని సంబంధులై దేవుని కుమారులుగా ఉండుటకు అధికారాన్ని పొందుకుంటారు
దేవుడు వెలుగైయున్నాడు ఆయన యందు చీకటి ఎంతమాత్రము లేదు
వెలుగై యున్న యేసుక్రీస్తును అంగీకరించి ఆయన నామమందు విశ్వాసముంచడం ద్వారా మాత్రమే మనము దేవుని పిల్లలము కాగలము
భక్తుడు ఈ విధంగా అంటున్నాడు
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.
ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పుతీర్చబడెను.
ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.
సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్ష పరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.అని
ప్రియులారా
ఒకప్పుడు మనము మన ఇష్టానుసారంగా జీవించాము ఏది చూడాలి అనిపిస్తే అది చూసాం ఏది వినాలనిపిస్తే అది విన్నాం ఎటు వెళ్ళాలన్పిస్తే అటు వెళ్ళాం చీకటిలో నడుస్తూ చీకటి క్రియలు చేస్తూ చీకటి సంబంధాలుగా ఉన్నాం అయితే ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చామో అప్పుడే మనలో ఉన్న చీకటి తొలగించబడి చీకటి సంబంధించిన క్రియలు తొలగించబడి వెలుగు సంబందులుగా మార్చబడ్డాము
గనుక మనము ఇక చీకటికి తావివ్వక దేవుని వెలుగులో నడుచుకొనవలసిన వారమై యున్నాము
అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు
మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.
వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.
గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి అని
సహోదరి సహోదరులారా
వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు.
తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు.
తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు.
ప్రియులారా
మనమందరము వెలుగు సంబంధులమును పగటి సంబంధులమునైయున్నాము మనము రాత్రివారము కాము, చీకటివారము కాము.
కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.
నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు.
మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.
ఈ వాక్యము మనము వెలుగు నందు విస్వాసముంచి
వెలుగులో నడుచుకుంటూ వెలుగు సంబంధులముగా
ఉండాలని తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మనము చీకటికి చీకటి క్రియలకు తావివ్వక ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడుచు వారమై యుందాం
వెలుగై యున్న యేసుక్రీస్తు ఆయన వెలుగులో మనలను నడిపించును గాక ఆమెన్
No comments:
Post a Comment