రచయిత:
ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన పౌలు.
వ్రాసిన కాలం:
క్రీస్తు శకం 58 ప్రాంతంలో.
ముఖ్యాంశం:
దీని ముఖ్యాంశం క్రీస్తు శుభవార్త. ఈ ముఖ్యాంశాన్ని 1:16-17లో ఇస్తూ మిగతా లేఖ అంతటిలో క్రీస్తు శుభవార్తను గురించి రాశాడు. శుభవార్త అంటే ఏమిటి? శుభవార్తను నమ్మినవారికి ఏమి జరుగుతుంది మొదలయిన వాటిని గురించి వ్రాశాడు. ఇందులోని కొన్ని ముఖ్యమైన మాటలు: “పాపం”, “విముక్తి”, “రక్షణ”, “నిర్దోషుల లెక్క”, “న్యాయవంతులు”, “నిర్దోషత్వం”, “దేవుని న్యాయం”, “కృప”, “నమ్మకం”.
విషయసూచిక
పౌలు ఇచ్చిన పరిచయం
ముఖ్యాంశం 1:16-17
మనిషికి శుభవార్త అవసరత 1:18—3:20
పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపం 1:18-20
మానవ జాతి పాపంలో ఉంది 1:21-32
దేవుని రాబోయే తీర్పు 2:1-16
యూదులు కూడా పాపంలో ఉన్నారు 2:17-29
ప్రతి మనిషి పాపి 3:1-19
మనిషికి అవసరమైన శుభవార్త 3:21—5:21
విశ్వాసం ద్వారానే న్యాయవంతులు కావడం 3:21-31
అబ్రాహాము ఉదాహరణ 4:1-25
శుభవార్త వల్లే కలిగే దీవెనలు 5:1-11
ఆదామువల్ల పాపం, చావు వచ్చాయి,
క్రీస్తువల్ల నిర్దోషత్వం, జీవం వచ్చాయి 5:12-19
క్రీస్తు ద్వారా కృప కలుగుతుంది 5:20-21
పవిత్ర జీవితానికి మార్గం 6:1—8:39
క్రీస్తులో ఐక్యత 6:1-10
మనకు మనం దేవునికి అర్పించుకోవడం 6:11-14
ప్రతి వ్యక్తీ దేవునికి గాని, పాపానికి గాని దాసుడు 6:15-23
పెళ్ళి ఉదాహరణ 7:1-6
పౌలు తన భ్రష్ట స్వభావాన్ని తెలుసుకోవడం 7:7-13
విశ్వాసిలో భ్రష్ట స్వభావం శక్తి 7:14-25
దేవుని ఆత్మద్వారా జీవం, శక్తి 8:1-16
విశ్వాసికి ముందు కలుగబోయే ధన్యత 8:17-25
విశ్వాసికున్న ప్రస్తుత ధన్యత 8:26-39
దేవుడు, ఇస్రాయేల్ జనం 9:1—11:32
ఇస్రాయేల్‌వారి లాభాలు, విశేషావకాశాలు 9:1-5
దేవుని సర్వాధిపత్యం 9:6-29
ఇస్రాయేల్‌వారి అపనమ్మకం 9:30-33
ఇస్రాయేల్‌వారి తప్పుడు మార్గం 10:1-21
దేవుడు ఇస్రాయేల్‌వారిని ఎప్పటికీ వదిలివేశాడా? 11:1-16
ఆలీవ్ చెట్టు 11:17-24
ఇస్రాయేల్ జనం విముక్తి అవుతుంది 11:25-32
దేవుని అగోచరమైన జ్ఞానం 11:33-36
శుభవార్త వెలుగులో విశ్వాసులు ఎలా జీవించాలి 12:1—15:13
మంచి అర్పణలు ఇవ్వడం 12:1-2
సామర్థ్యాలను ఉపయోగించడం 12:3-8
ప్రేమ, సంతోషం, ఐక్యత, విధేయత, శాంతితో కూడిన జీవితం 12:9-21
అధికారంలో ఉన్నవారికి లోబడడం 13:1-7
ప్రేమ నియమం 13:8-10
యేసు క్రీస్తును ధరించుకొని ఆయన కోసం చూడడం 13:8-14
బలమైన, బలహీనమైన విశ్వాసం 14:1—15:6
క్రీస్తు ఇచ్చిన ఆదర్శం 15:7-12
చివరి ప్రార్థన 15:13
పౌలు చేసిన పని, రోమ్ దర్శించాలనే అతని కోరిక 15:14-33
వ్యక్తిగత అభివందనాలు 16:1-16
తప్పుడు ఉపదేశకులను గురించి హెచ్చరికలు 16:17-19
చివరి మాటలు 16:20-27.
No comments:
Post a Comment