Breaking

Saturday, 30 November 2019

November 30, 2019

Bible story of Gideon | bible stories in telugu | గిద్యోను


ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టిలో చెడిపోయారు. వారు దేవున్ని ఆయన చేసిన ఉపకారాలను మరచిపోయి అన్యదేవతలను పూజింపసాగారు.
వారితో వివాహసంబంధాలు ఏర్పరచుకొన్నారు. అందువల్ల దేవుడు వారిని 7 సం|లపాటు మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు మిడుతల దండువలె దండెత్తి ఇశ్రాయేలు వారి పంటలు నాశనం చేస్తున్నారు. పశువులను
చంపుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు పారిపోయి కొండలను, వాగులను, గుహలను, పాత దుర్గములకు తమ ఆవాసాలుగా చేసికొన్నారు. వారు చాల
కష్టాలలోవున్నారు. తమ కష్టాలు పొగొట్టమని యెహోవాకు దీనంగా మొరపెట్టుకొన్నారు. ఆయన వాళ్ల మొర విన్నాడు. యెహోవా (దూత) యోవాషు కుమారుడైన గిద్యోనుకు గానుక చాటున, మస్తకి వృక్షం క్రింద ప్రత్యక్షమయ్యాడు. "నీవు బలము తెచ్చుకొనుము. ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయుల చేతిలోనుండి విడిపించుము. యెహోవా నీకు తోడై వుంటాడు" అని చెప్పాడు. గిద్యోను మొదట సందేహించాడు. శతృవులు బలవంతులు. వాళ్ళను ఎదిరించడానికి తన బలము, ఇశ్రాయేలీయుల బలము చాలవన్నాడు. అయితే ఆ దూత - "నేను నీకు తోడుగా వుంటాను. ఒక మనిషిని చంపినంత సులభంగా నీవు మిద్యాను సైన్యాన్ని సంహరిస్తావు" అన్నాడు. యెహోవా (దూత) గిద్యోను అర్పించిన మేక పిల్ల మాంసమును పొంగని భక్ష్యములను స్వీకరించాడు. యెహోవా ఆదేశం ప్రకారం గిద్యోను రాత్రివేళ బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టి, దేవతా స్తంభాన్ని విరుగ గొట్టాడు. ఉదయాన్నే ఊరి
వారందరు గుమికూడారు. గిద్యోను బయలు దేవతను అవమానించాడు కనుక అతన్ని చంపి తీరాలని పట్టుపట్టాడు. కాని యోవాసు "గిద్యోను సంగతి'
బయలు దేవత చూసుకొంటుంది" అన్నాడు. యోవామ గిద్యోనుకు యేరుబ్బయలు" అని పేరు పెట్టాడు.

ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి మిద్యనీయులు అమాలేకియులు ఏకమయ్యారు. మీవో వా అత్మగిద్యోనులో ప్రవేశించింది. అతడు బూరను ఊదగానే ఇతాయేలు ప్రజలంతా గుమికూడారు. యుద్దం చేయబోయేముందు గిద్యోను తమ పక్షానికి విజయం లభిస్తుందో లేదో తెలిసికోవాలని అనుకొన్నాడు. అతడు యెహోవాను ఈ విధంగా ప్రార్ధించాడు. దేవా, నేను కళ్లంలో ఒక చోట గొరెజొచ్చు ఉంచుతాను. నేలంతా పొడిగా ఉండి గొర్రె బొచ్చు మాత్రం మంచుతో తడవాలి. ఆప్పుడు నీవు మాకు విజయం చెకూరుస్తానని నమ్ముతాను.  గిద్యోను కోరిన విధంగా గొర్రెబొచ్చు మాత్రమే తడిసింది. రెండవసారి గిద్యోను చుట్టూవున్న నేలంతా తడిసి గొర్రె బొచ్చు మాత్రమే తడవకూడదు" అని ప్రార్ధించాడు. ఆ రాత్రి దేవుడు గిద్యోను కోరిన విదంగానే చేశాడు. ఈ రెండు సూచక క్రియలు చూసిన గిద్యోనుకు, ఆతని సైన్యానికి తమకే విజయం లభిస్తుందనే గట్టి నమ్మకం ఏర్పడింది. గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆప్పుడు యెహోవా " నీ సైనికులు ఎక్కువ మంది వున్నారు. మీరు గనక గెలిప్తే
మీ పైనిక బలం చేత గెలిచామని గర్విస్తారు. కాబట్టి  యుద్ధమంటే భయపడేవారిని యిండ్లకు పంపివేయి"
గిద్యోను ఈ సంగతి తెలియజేయగానే యిరవై వేలమంది వెళ్లిపోయారు. పదివేలమంది మిగిలారు. యెహోవా ఆదేశం మేరకు గిద్యోను వాళ్లందరిని నీళ్ల దగ్గరికి తీసికొని వెళ్లాడు. కుక్క గతికి నట్లు నీటిని గతికిన (తాగిన) మూడు వందల మందిని మాత్రం ఎంపిక చేశాడు. తక్కిన వారిని అన్నాడు ఇండ్లకు పంపివేశాడు గిద్యోను రహస్యంగా శతృసవుల శిభిరం దగ్గరికి వెళ్లాడు. అక్కడ యిద్దరు సైనికులు మాట్లాడుకోవడం విన్నాడు. "నిన్న రాత్రి నేనొక కలగన్నాను. ఒక యవలరొట్టె మిద్యానీయుల దండులోనికి దొర్లివచ్చింది. ఆది గుడారాన్ని పడగొట్టి
తలక్రిందులు చేసేంది" అని ఒక సైనికుడు అన్నాడు. "ఆ రొట్టె మరొకటి కాదు. గిద్యోను ఖడ్గమే. దేవుడు మన సైన్యాన్ని అతని చేతికి అప్పగించబోతున్నాడు" అని రెండవ సైనికుడు అన్నాడు. చాటున వుండి వారి మాటలు వినిన గిద్యోను మనసులోనే యెహోవాకు ధన్యవాదములు అర్పించాడు.

గిద్యోను తాను ఎన్నిక చేసికొని సిద్ధంగా వుంచిన 300 మంది సైనికులను మూడు భాగాలుగా విభజించాడు. వారిలో ప్రతి ఒక్కరికి ఒక బూరను, ఒక దివిటీని, ఒక ఖాళీ కుండను యిచ్చాడు. వారిని శత్రుసైన్యానికి
మూడు వైపుల వుండమన్నాడు. ఎప్పుడు ఏమి చేయాలో వివరించాడు. గిద్యోను చెప్పిన విధంగానే అతని సైనికులు చేశారు. వారు పెద్దగా బూరలు ఊదుచూ కేకలు వేసి కుండలు పగులగొట్టారు. తమ కుడి చేతుల్లో బూరలను, ఎడమ చేతిలో దివిటీలను పట్టుకొన్నారు. పెద్దగా బూరలు ఊదుచు యెహోవాకు గిద్యోనుకు జయము అని కేకలు వేశారు. ఇశ్రాయేలు సైన్యము తమ శిబిరాన్ని చుట్టుముట్టిందనుకొని శతృవులు భయపడి పారిపోయారు. వారు కలవరపాటుతో తమను తామే చంపుకొన్నారు. ఎఫ్రాయీము వారు మిద్యానీయులను తరిమివేసి, వారి రాజులైన ఓరేబు, జెయేబు అనువారిని చంపి, వారి తలలను గిద్యోను దగ్గరికి తీసికొని ప్రతీకారము వచ్చారు. గిద్యోను, అతని 300 మంది సైనికులు పారిపోతున్న మిద్యాను సైనికులను తరుముతున్నారు. వారు అలసిపోయి బాగా ఆకలిగొన్నారు. గిద్యోను తమ సైనికులకు అహారం పెట్టమని నుక్కోతు వారిని, పెనూయేలు వారిని
అడిగాడు, వారు అతని అభ్యర్థనను తిరస్కరించారు. గిద్యోను 17వేల సైనికులను చంపాడు. తన కోరికను తిరస్కరించినందుకు సుక్కోతులోని మంది పెద్దలకు బొమ్మజెముడుతో, నూర్చుకొయ్యులతో బుద్ధి చెప్పాడు. పెనూయేలులో రాజులైన బెరహు, సల్మన్నాలు గిద్యోను సహోదరులను చంపియుండిరి. దానికి ప్రతీకారంగా గిద్యోను వారిద్దరిని సంహరించాడు. ఇశ్రాయేలు ప్రజలు గిద్యోనును తమకు రాజుగా వుండమని కోరారు. కాని గిద్యోను "నేనుగాని, నా కుమారులు గాని మిమ్ములను పరిపాలింపము యెహోవాయే మిమ్ములను పరిపాలిస్తాడు" అన్నాడు. ఇత్రాయేలు సైన్యము
దోచుకొని తెచ్చిన ఆభరణములలో చెవిపోగులను మాత్రం స్వీకరించాడు. వాటి బరువు 1700 తులములు. ఆ బంగారంతో గిద్యోను ఒక ఎఫోదును చేయించుకొని, దానిని తన స్వంత పట్టణమైన ఒఫ్రాలో వుంచాడు. మిద్యానీయులు చాలా కాలం ఇశ్రాయేలీయులకు అణగి వున్నారు. 40సం|| లు దేశంలో శాంతి వ్యాపించి వుంది. గిద్యోనుకు చాలా మంది భార్యలు డెబ్బదిమంది కుమారులు ఉన్నారు. అతడు చాల వృద్దుడై, మరణించాడు


ధ్యానాంశములు

1.గిద్యోను ఒక సాధారణ వ్యక్తి, దేవుడు అతనిని ఏర్పరచుకొన్నాడు. అతని చేత గొప్ప కార్యాలు చేయించాడు

2.గిద్యోను దేవునికీ విధేయుడై పున్నాడు. ఆయన చెప్పిన విధంగా చేశాడు కనుకనే శత్రువులపై విజయం సాధించాడు.

3.దేవుడు ఏర్పరచుకొన్నవారు గొప్ప పనులు చేస్తారు. నూతన బలము పొందుతారు.

4.తనను ప్రేమించి, తనయందు భయభక్తులు గల వారికి దేవుడు తోడుగా వుంటాడు.

5.మనం కూడ దేవుని యందు భయభక్తులు గలిగి వుండాలి.


బంగారు వాక్యము

అపత్యాలమున నీవు వన్ను గూర్చి మొర సెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నీవు నిన్ను మహిమపరచెదవు.
 కీర్తనలు 5015

Friday, 29 November 2019

November 29, 2019

Bible story of naaman | bible stories in telugu | నయమాను



సీరియా దేశపు రాజు దగ్గర నయమాను అను ఒక సైన్యాధిపతి ఉండేవాడు. అతడు మహా పరాక్రమశాలి. ఎన్నో యుద్ధాలు చేసి రాజుకు
దేశానికి జయము కలుగజేశాడు. రాజ్యాన్ని విస్తరింపచేశాడు. అందువలన రాజు నయమానును ఎక్కువగా గౌరవించేవాడు నయమానుకు చాల మంచి లక్షణాలు వున్నాయి. కాని అతడు కుష్టురోగి, అందువలన ఎప్పుడూ తన వ్యాధిని గురించి బాధపడుతుండేవాడు. అతని భార్య దగ్గర ఇశ్రాయేలు దేశమునుండి బానిసగాతెచ్చిన ఒక బాలిక వుంది. ఆ బాలిక నయమాను భార్యకు ఒక సలహా యిచ్చింది. "అమ్మగారూ! షామ్రోను దగ్గర ఎలీషా అను ఒక దైవజనుడు వున్నాడు. నా యజమాని ఆయన దగ్గరికి వెళ్ళితే తప్పకుండా స్వస్థత పొందుతాడు" అని చెప్పింది. నయమాను వెళ్ళి సిరియా రాజుకు ఈ సంగతి చెప్పాడు. సిరియా రాజు ఇశ్రాయేలు రాజు
దగ్గరికి ఒక దూతను పంపాడు. ఆ దూత ద్వారా యిరువది మణుగుల వెండి, లక్షయిరువది వేల రూపాయల బంగారు, పది దుస్తుల బట్టలు కానుకగా
పంపాడు. నా సైన్యాధిపతియైన నయమానుయొక్క కుష్ఠురోగాన్ని ఎలాగైనా బాగు చేయించమని” లేఖ వ్రాసి పంపాడు. ఆ లేఖ చదివిన ఇశ్రాయేలు రాజు
దుఃఖముతో తన బట్టలు చింపుకొన్నాడు. "ఒకరిని చంపడానికి, బ్రతికించడానికి నేనేమైనా దేవుడినా? నయమానుకు వున్న కుష్టురోగం బాగు చేయించమని
రాజు నాకు పత్రిక పంపించాడు. సిరియారాజు నాతో కలహము పెటుకోవడానికే ఈ పని చేశాడు" అని ఎంతో బాధపడ్డాడు. ఈ విషయం తన అధికారులకు
చెప్పాడు. రాజు చాల దుఃఖంలో వున్నాడని ఎలిషా ప్రవక్తకు తెలిసింది. "రాజా నీవు నీ వస్త్రములు చింపుకొనడం ఎందుకు? ఇశ్రాయేలులో ఒక ప్రవక్త వున్నాడని సిరియా రాజుకు తెలియునట్లుగా, ఆ కుష్టురోగిని నాదగ్గరికి పంపించు" చెప్పి పంపాడు

నయమాను గుర్రములతో, రధములతో, పరివారముతో, కానుకలతో ఎలీషా యింటిముందు నిలిచాడు. అప్పుడు ఎలీషా "నీవు వెళ్ళి యోర్దాను
నదిలో ఏడుసార్లు స్నానం చెయ్యి, నీ కుష్టురోగం బాగవుతుంది" అని ఒక దూత ద్వారా చెప్పి పంపించాడు. దూత మాటలు వినిన నయమాను కోపంతో వెనక్కు తిరిగి వెళ్లాడు. "ఆ ప్రవక్త నా దగ్గరికి వచ్చి, నా శరీరాన్ని తాకి, నా రోగం బాగుచేస్తాడనుకొన్నాను. కాని యోర్దాను నదీలో ఏడు సార్లు స్నానం చేయమని చెప్పి పంపించాడు. మా దేశంలో వున్న అబానాయును, ఫర్పరును
ఇశ్రాయేలు దేశపు నదులకంటె మంచివి కావా?" అని అన్నాడు. అప్పుడు నయమాను దాసుడొకడు "అయ్యా! ఆ ప్రవక్త యింతకంటె గొప్ప పని ఏదైనా
చేయమని ఆదేశిస్తే చేయవా?" అన్నాడు. ఈ సలహా నయమానుకు నచ్చింది అతడు వెళ్ళి యెర్దాను నదిలో ఏడుసార్లు మునగగానే అతని శరీరం పసిపిల్లల శరీరం వలె మారిపోయింది. అతడు పూర్తిగా స్వస్థత పొందాడు. నయమానుకు పట్టరాని సంతోషం కలిగింది. వెంటనే ఎలీషా దగ్గరికి తిరిగి వెళ్లాడు. తాను తెచ్చిన కానుకలు యివ్వబోయాడు. కాని ఎలీషా తీసికొనలేదు. అప్పుడు నయమాను ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని స్తుతించాడు. ఎలీషా దగ్గర సెలవు తీసికొని తన దేశానికి తిరిగి వెళ్ళాడు జరిగిన విషయమంతా ఎలీషా శిష్యుడు గెహాజీ గమనిస్తున్నాడు అతనికి తన యజమాని చేసిన పని బొత్తిగా నచ్చలేదు. సులభంగా లభిస్తున్న వెండి, బంగారు, ప్రశస్త వస్త్రములు ఎలీషా తిరస్కరించినందుకు ఎంతో బాధపడ్డాడు. వెంటనే నయమాను దగ్గరికి పరుగు తీశాడు. దారిలో అతనిని
కలుసుకొని "అయ్యా! ఇప్పుడే మా యజమాని దగ్గరికి ఎప్రాయీము నుండి యిద్దరు శిష్యులు వచ్చారు. వారికోసం రెండు 'మణుగుల వెండి, రెండు మీ వద్ద యిప్పించుకొని రమ్మని మా యజమాని చెప్పి పంపాడు“ అని అబద్దం చెప్పాడు. నయమాను గెహాజీ మాటలు నమ్మాడు. నీకు యిష్టమైతే రెట్టింపు తీసికొని వెళ్లు అని చెప్పి, సేవకుల ద్వారా నాలుగు మణుగుల వెండి రెండు జతల బట్టలు సేవకుల ద్వారా యిచ్చి పంపించాడు గేహాజీ వాటిని దాచిపెట్టి ఏమీ ఎరుగని వానివలె ఎలీషా ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా అతనితో "గెహాజీ, నీవు ఎక్కడినుండి వచ్చావు?" అని అడిగాడు. అందుకు గెహాజీ నేను ఎక్కడికీ వెళ్ళలేదు, ఇక్కడే వున్నాను అన్నాడు. అందుకు ఎలీషా "ఆ మనుష్యుడు రథము దిగి, నిన్ను ఎదుర్కొనుటకు వచ్చినప్పుడు నామనసు నీతో కూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్షతోటలను ఎడ్లను, గొర్రెలను, దాస దాసీలను సంపాదించుకొనుటకు యిది సమయమా? నీవు నాకే కాదు యెహోవాకు యిష్టంలేని పని చేశావు. కనుక నయమానుకు వున్నకుష్టురోగము నీకు, నీ సంతతికి సదాకాలము వుండుగాక" అన్నాడు. వెంటనే గెహాజీ శరీరము కుష్టువలన తెల్లగా మారిపోయింది. అతడు ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడు



ధ్యానాంశములు :

1.ఎలీషా చేసిన అద్భుత కార్యం వలన యెహాో వా దేవునికి మహిమ, ఘనత కలిగాయి. అన్యుడైన నయమాను యెహోవా దేవుని స్తుతించాడు
ఆయననుపూజించాలని నిర్ణయించుకొన్నాడు. ప్రవక్త దగ్గర వుంటూ, యెహోవా దేవుని స్తుతిస్తూ జీవితం గడుపుతున్న గెహాజీ ధనాశవలన శపింపబడి తరతరాల కుష్ఠురోగాన్ని సంపాదించుకొన్నాడు

2.దేవుని నమ్ముకున్నవారు స్వస్థత పొందుతారనీ, కష్టాలను అధిగమిస్తారనీ ఆయన చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారు శాపానికి గురి అవుతారని
మనము గ్రహించాలి

3.దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు

4.నయమాను యింట్లో వుంటున్న ఇశ్రాయేలు బాలిక తన యజమానురాలికి మంచి సలహా ఇచ్చింది. దేవుని బిడ్డలు కూడ యితరులకు మేలు చేయాలి మంచి మార్గము చూపించాలి


బంగారు వాక్యము

ఇశ్రాయేలులో వున్న దేవుడు తప్ప లోకమంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగుదును.
2 రాజులు 5:15


November 29, 2019

Bible story of barak | bible stories in telugu | బారాకు



ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆయన చేసిన మేళ్లను మరచారు. ఆయనకు యిష్టం లేని పనులు చేయసాగారు. ఆయనకు కోపం తెప్పించారు. అందుచేత ఆయన వారిని కనాను రాజైన యాబీను చేతికి అప్పగించాడు. అతని సేనాపతి పేరు “సీసెరా". అతనికి 900 యినుప రథములు ఉన్నవి. అతని పేరు వింటేనే శత్రువులు భయంతో వణికిపోయేవారు. అతడు 20 సం||ల పాటు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నో బాధలకు గురి చేశాడు. అందువల్ల ఇశ్రాయేలీయులు యెహోవాకు దీనంగా మొర పెట్టారు. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు “దెబోరా" అను ప్రవక్తి న్యాయాధిపతిగ వుండేది. ఆమె రామాకు, బేతేలుకు మధ్య వున్న దెబోరాసరళవృక్షం క్రింద ప్రజలకు న్యాయం చెప్తూ ఉండేది. ఆమె కెదెషులో వుంటున్నఅ బీనోయము కుమారుడైన బారాకును పిలిపించింది. “నీవు 10 వేలమంది సైనికులతో వెళ్ళి సీసెరాతో యుద్ధం చెయ్యి. యెహోవా నీకు తప్పక విజయం లభింపచేస్తాడు” అని చెప్పింది. అందుకు బారాకు "నేను సీసెరాతో యుద్ధం చేయడానికి సిద్ధమే. అయితే నీవు కూడ నావెంబడి రావాలి” అన్నాడు. దెబోరా అంగీకారం తెలిపి యిలా అన్నది. "నేను నీ వెంట రావడానికి సిద్ధంగా వున్నాను. జరుగబోయే యుద్ధంలో నీవు గెలుస్తావు. కాని యెహోవా సీసెరాను ఒక స్త్రీకి అప్పగించబోతున్నాడు. అతనిని చంపిన ఘనత నీకు దక్కదు.” బారాకు 10 వేల మంది సైనికులతో యుద్ధానికి వెళ్లాడు. అతని వెంట దెబోరా కూడ వెళ్లింది. బారాకు తాబోరు కొండ మీద తన సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా వున్నాడు. ఈ సంగతి తెలిసిన సీసీసెరా అక్కడికి వెళ్లాడు. అతడు బారాకును చాలా సునాయాసంగా ఓడిస్తాను అనుకొన్నాడు. కాని మన
సిసెరా సైన్యాన్ని కలవరపరచాడు. కనుక అతని సైనికులందరు చంపబడ్డారు. అతడు కాలినడకన పారిపోయాడు. పారిపోయి హెబెరు భార్య అయిన
యాయేలు గుడారంలో దాక్కొన్నాడు. యాయేలు అతన్ని ఆదరించింది. అతనితో మంచిగా మాట్లాడింది. అతని ఆకలి తీర్చడానికై ఒక పాల బుడ్డిని యిచ్చింది. ఎవరైనా శతృవులు వస్తే నీకు తెలియజేస్తాను, అని చెప్పి గుడారపు ద్వారం దగ్గర నిలబడింది. సీసెరా యాయేలును, ఆమె మోసపు మాటలను నమ్మాడు. పాలు తాగి హాయిగా నిద్రపోయాడు. ఆమె చేతిలోనే తన చావువుందని ఊహించలేకపోయాడు. యిదే మంచి అవకాశం అనుకొన్న యాయేలు ఒక పెద్ద మేకును సీసెరా కణతలో నుండి నేలకు దిగునట్లుగా కొట్టింది. సీసెరా గాఢ నిద్రలోనే శాశ్వత నిద్రలోనికి వెళ్లాడు. ఈ విధంగా దెబోరా ద్వారా దేవుడు పలికించిన మాటలు నెరవేరాయి. బారాకు సీసెరా కోసం వెదకుతున్నాడు. యాయేలు అతనికి ఎదురు వెళ్ళి “నీవు వెదకుతున్న మనిషి నా గుడారంలో వున్నాడు. చూపిస్తాను రా” అని చెప్పింది. బారాకు ఆమె గుడారంలోకి వెళ్ళి చూశాడు. సీసెరా రక్తపు మడుగులో చచ్చి పడివున్నాడు. దెబోరా, బారాకు చాల సంతోషించారు. యెహోవాకు స్తుతికీర్తనలు పాడారు. కొన్ని సం||ల తర్వాత ఇశ్రాయేలీయులు కనాను రాజైన యాబీనును కూడ ఓడించి, సంహరించారు. 40 సం||ల పాటు దేశం సుఖశాంతులతో తులతూగింది.

ధ్యానాంశములు

1. దేవుడు తన బిడ్డల ప్రార్థన ఆలకిస్తాడు. వారి కష్టాలు తొలగిస్తాడు అనే సత్యం ఈ కథ ద్వారా తెలిసికొనగలరు.

2. దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రకటించిన మాటలు తప్పకుండా నెరవేరుతాయి.

3. దేవుడు కొందరిని తన సాధనములుగా వాడుకొంటాడు. ఈ కథలో ఆయన బారాకును తన సాధనంగా వాడుకొన్నాడు.

4. దేవుని నమ్మిన వారికి విజయము, సుఖ సంతోషాలు తప్పక లభిస్తాయి.


బంగారు వాక్యము :

యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. కీర్తనలు 147:1






November 29, 2019

Bible story of rahab | bible stories in telugu | రాహాబు


రాహాబు ఒక అన్యురాలు ఆమె యెహోవా దేవుణ్ణి విశ్వసించి తన ప్రాణాలను కాపాడుకొనడమేకాక తన యింటివారి ప్రాణాలు కూడ కాపాడింది. రాహాబు ఒక వేశ్య. ఆమె యిల్లు మెరికో పట్టణపు ప్రాకారం పై వుంది. ఆ రోజుల్లో వేశ్యావృత్తి రాజుల ద్వారా, మత పెద్దల ద్వారా ఆమోదం పొంది వుండేది.
యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదికి ఇవతలి గట్టున వున్నారు. యోర్దానుకు అవతలి వైపు యెరికో పట్టణం వుంది. యెరికో శపించబడిన నగరము. అక్కడి ప్రజలు దుష్టులు. దేవుని భయం లేని వారు. విచ్చలవిడిగా జీవితం గడిపేవారు. యెహోవా దేవుడు నూను కుమారుడైన యెహోషువతో యిలా అన్నాడు. - “నేను నా సేవకుడైన మోషేకు తోడెవున్నట్లుగా, నీకుకూడ తోడై ఉంటాను.నిన్ను విడువను, ఎడబాయను. నీవు
ధైర్యంగా ముందుకు సాగిపో. యోర్దాను అవతల వున్న అన్ని రాజ్యాలను మీరు జయిస్తారు. నేను మీకు యిస్తానని వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే (సుసంపన్నమైన)కానాను దేశము మీ వశం చేస్తాను. నీవు నిర్భయంగా ముందుకు సాగిపొమ్ము."

యెహోషువ యెరికో పట్టణ రహస్యాలు ముందుగా తెలసికోవడం మంచిదనుకొన్నాడు. ఆ పనికి యిద్దరు వేగుల వారిని పంపించాడు. వారు వ్యాపారస్థుల వలె మారువేషం వేసికొని, ప్రవేశించి రాహాబు యింట్లో బస చేశారు. ఈ విషయం రాజుకు తెలిసింది. రాజు వెంటనే భటులను పంపాడు. రాహాబు భటులతో ఇలా
చెప్పింది.

“నా యింటికి యిద్దరు మనుష్యులు వచ్చిన మాట నిజమే. వాళ్లెవరో నాకు తెలియదు. వాళ్ళిద్దరు పట్టణపు గవిని (ముఖద్వారము) మూయక ముందే
బయటికి వెళ్ళిపోయారు. మీరు వెంటనే వెళ్ళితే వారిని పట్టుకోగలరు.” ఆమె మాటలు నమ్మిన భటులు వెంటనే బయలుదేరి ఆ వేగుల వారిని పట్టుకొనుటకై వెళ్ళిపోయారు. వారు గవిని దాటగానే గవిని ద్వారం మూసివేయబడింది. రాహాబు యిద్దరు వేగుల వారిని తన మిద్దెపై వున్న జనపకట్టెలో దాచి పెట్టింది.

వారు పండుకొనక ముందు రాహాబు వేగులవారి దగ్గరికి వెళ్ళింది. ఆమె వారితో యిలా అన్నది. "అయ్యాలారా! యెహోవా దేవుడు మహాశక్తిమంతుడనీ, ఆయన ఈ దేశాన్ని మీకు యివ్వబోతున్నాడనీ మేము ఎరుగుదుము. అందువల్ల మా దేశ నివాసులందరు మిగుల భయపడుతున్నారు. మీ దేవుడు మీకు తోడుగా వుంటాడని మాకు తెలియును. ఆయన ఎర్ర
సముద్రమును ఏలాగు ఆరిపోవునట్లు చేసెనో, యోర్దాను తీరాన వున్న అమోరీయుల రాజులైన సీహోనును, ఓగును మీరేలాగు సంహరించారో మాకు తెలిసినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మేము చాల భయపడ్డాము. మీ దేవుడు పైన ఆకాశానికి, క్రింది భూమికి దేవుడే. మీ ఎదుట ఎంతటి పరాక్రమ వంతులైనా ధైర్యాన్ని కోల్పోతారు. నేను మిమ్ములను ప్రాణాపాయం నుండి కాపాడాను. కనుక మీరు యెరికో పట్టణాన్ని స్వాధీనము చేసికొనే సమయంలో నన్ను, నా తల్లిదండ్రులను, అక్క చెల్లెండ్రను కాపాడండి. ఆ విధంగా చేస్తామని నాతో ప్రమాణం చేయండి”.

వేగుల వారికి రాహాబు కోరిక న్యాయమైనదిగా తోచింది. వారు ఆమె కోరిన విధంగా చేస్తామని ప్రమాణం చేశారు. అయితే ఒక సలహా యిచ్చారు.
“నీవు నీ యింటి కిటికీకి ఒక తొగరు (ఎర్ర) దారం కట్టి వుంచాలి. యింటి వారందరు యింట్లోనే వుండాలి. ఎవరైనా యింటిలో నుండి బయటికి వెళ్ళినా, యింటి కిటికీకి తొగరు దారం లేకున్నా, మీ యింటి వారి మరణానికి మేము బాధ్యులము కాదు". అందుకు రాహాబు అంగీకరించింది. మరునాడు రాహాబు తన యింటి కిటికీకి ఒక తాడు కట్టి దాని ద్వారా ఆ యిద్దరు వేగులను కోట బయట దించింది. రాహాబు సలహా ప్రకారం వేగుల వారు తమను వెడుకబోయిన భటులు తిరిగి వచ్చేంత వరకు మూడు రోజులు కొండల్లో దాగి వున్నారు. ఆ తర్వాత వారు వెళ్ళి యెహోషువాతో “ఆ
దేశమంతా యెహోవా మన చేతికి అప్పగించబోతున్నాడు. అక్కడి ప్రజలు మన భయం చేత ధైర్యము కోల్పోయి వున్నారు" అని చెప్పారు. రాహాబు వారికి చేసిన సహాయం గురించి వివరించారు. ఇశ్రాయేలీయులు చాలా సులభంగా యేరికో పట్టణాన్ని తమ వశం వారు రాహాబును, ఆమె కుటుంబ సభ్యులను మాత్రం సంహరింపలేదు కాలం గడిచిన తర్వాత ఆ యిద్దరు వేగులలో ఒకడైన శల్మాను రాహాబును పెండ్లి చేసికొన్నాడు. ఆ శల్మాను కుమారుడే బోయజు. బోయజు కుమారుడే ఓబేదు. ఓబేదు కుమారుడే యెష్షయి. యెష్షయి కుమారుడే దావీదు మహారాజు

ఈ విధంగా శపించబడిన పట్టణంలో నివసిస్తూ
రాహాబు దేవుని నమ్మడం వలన ఆమె కుటుంబము
రక్షించబడింది. ఆమె ఇశ్రాయేలు జనాంగములో ప్రముఖ స్థానం పొందింది.


ధ్యానాంశములు:

1. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు పస్కా గొర్రెపిల్లను వధించి, దాని రక్తము ద్వార బంధములకు పూయడం వలన మృత్యుదేవత బారినుండి రక్షించబడ్డారు.

2. రాహాబు తొగరు దారం కట్టినందున ఆమె కుటుంబమంతా మరణం నుండి కాపాడబడింది.

3. పస్కా గొర్రెపిల్ల యేసు క్రీస్తుకు సూచనగా వున్నది.

4. యేసు ప్రభువు సిలువపై కార్చిన రక్తము మానవజాతిని రెండవ మరణము - అనగా నిత్యనరకము నుండి కాపాడుతుంది.

బంగారు వాక్యము :

విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున, అవిధేయులతో పాటు నశింపకపోయెను. (హెబ్రీ 11:31)

Thursday, 28 November 2019

November 28, 2019

Bible story of jacob | bible stories in telugu | యాకోబు



ఇస్సాకు భార్య రిబ్కా, ఆమె బహు సౌందర్యవతి. వినయ సంపన్ను రాలు. ఆ దంపతులకు ఏళావు, యాకోబు అను యిద్దరు కుమారులు కలిగారు
వారిలో యాకోబు చిన్నవాడు, యాకోబు అను మాటకు మోసగాడు అని అర్థము రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలోని శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడుకోసాగారు. ఈ సంగతి గమనించిన రిబ్కా దేవుణ్ణి ప్రార్ధించింది దేవుడు ఆమెతో యిలా అన్నాడు. "నీ గర్భంలో రెండు జన పదాలున్నాయి ఒకదాని కంటే మరి యొకటి బలిష్టమైనదై ఎక్కువ వృద్ధి చెందుతుంది. పెద్దవాడు
చిన్నవానికి దాసుడౌతాడు. యాకోబు ఏశావు యొక్క మడమ పట్టుకొని పుట్టాడు. ఏశావు ఎర్రనివాడు. శరీరం అంతా రోమములు గలవాడు. అతడు అడవిలో సంచరిస్తూ జంతువులను వేటాడి జీవితం గడిపేవాడు. యాకోబు పశువులు మేపుతూ గుడారంలో నివసిస్తుండేవాడు. ఒకసారి ఏశావు బాగా ఆకలిగొని వచ్చాడు యింట్లో కలగూర వంటకం చేస్తున్న యాకోబును కొంత ఆహారం యిమ్మన్నాడు
ఆహారానికి బదులుగా యాకోబు తన అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని అడిగి తీసుకొన్నాడు యాకోబును తండ్రి దీవించుట ఇస్సాకు ముసలివాడయ్యాడు. అతనికి ఏళావుపై ప్రేమ ఎక్కువ అతడొక దినం ఏశావును పిలిచి, "నీవు ఒక జంతువును వేటాడి దాని మాంసం
వండి నాకొరకు తీసికొనిరా నేను నిన్ను ఆశీర్వదిస్తాను" అన్నాడు. ఈ సంగతి తెలిసిన రిబ్కా కూర తయారు చేసి యాకోబుకు యిచ్చి పంపింది. అతని చేతులకు, మెడపైన మేక చర్మము కప్పింది. ఆమెకు యాకోబు అంటే ఎక్కువ ప్రేమ

యాకోబు కూరతో తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నేను ఏశావును. నీకు మాంసం వండి తెచ్చాను. దేవుని దయవల్ల నాకు వెంటనే ఒక జంతువు దొరికింది అని చెప్పాడు. అతని మాటలు విన్న ఇస్సాకు యాకోబును తడిమి చూశాడు. "శరీరం ఏశావుది కాని స్వరం యాకోబుది" అన్నాడు. ఇస్సాకు యాకోబుు ఇలా దీవించాడు. "నా కుమారునిసునాసన యెహోవా చేని సునాసన వలె వున్నది దేవుడు నీకు ఆధికమైన ధాన్యమును ద్రాక్షారసమును యిస్తాడు. జనులు నీకు దాసులుగా వుంటారు. నీ బంధువులకు నివు రాజువై
వుంటావు. నిన్ను శపించే వాళ్ళు శపించబడతారు. నిన్నసు దీవించేవాళ్ళు దీవెనలు పాందుతారు"

యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఏశావు వచ్చాడు. యాకోబు తండ్రిని మోసం చేసి తాను పాందవలసిన దీవెనలన్సీ పొందాడని తెలిసికొన్నాడు. మనసులో చాలా బాధపడ్డాడు. ఒక్క దీవెన అయినా యివ్వమని తండ్రిని బ్రతిమిలాడాడు. అప్పుడు ఇస్సాకు "నీవు కత్తిచేత బ్రతుకుతావు. నీ నివాసము సారము లేనిదై వుంటుంది. నీవు నీ తమ్మునికి దాసుడుగ అవుతావు" అన్నాడు ఏశావు యాకోబుపై చాల కోపంగా వున్నాడు. ఈ సంగతి గ్రహించిన రిబ్కా యాకోబును పద్దనరాములో వుంటున్న తన సహోదరుడైన లాబాను వద్దకు పంపింది

యాకోబు తన మేనమామల వూరికి పారిపోతున్నాడు. ప్రొద్దు గ్రుంకింది. ఒకచోట ఆగాడు. ఒక రాతిని తలదిండుగా చేసికొని నిద్రపోయాడు
నిద్రలో ఒక కలగన్నాడు. ఆకలలో ఒక నిచ్చెన కనిపిస్తోంది. దాని కొన భూమిమీద వుంది. రెండవ కొన ఆకాశాన్ని తాకుతోంది. దేవదూతలు ఆ నిచ్చెన ఎక్కుతూ, దిగుతూ వున్నారు. నిచ్చెన పై భాగంలో దేవుడు వున్నాడు. ఆయన యాకోబుతో యిలా అన్నాడు. "నిన్ను విడువను ఎడబాయను, నీ సంతానాన్ని భూమి మీది యిసుక రేణువుల వలె
విస్తరింపచేస్తాను. భూమి మీద వంశములన్నీ నీ మూలంగా ఆశీర్వదింపబడతాయి. నేను నీకు తోడై వుంటాను. నీవు వెళ్ళే ప్రతి స్థలంలో ఆశీర్వదిస్తాను
విన్ను ఈ దేశానికి మరల రస్పిస్తాను" యాకోబుకు మెళకువ వచ్చింది. కలను గుర్తు చేసికొని చాల భయపడ్డాడు. ఈ స్థలము దేవుని మందిరము తప్ప వేరొకటి కాదు. యిది విజంగా పరలోకపు గవిని (ప్రవేశ ద్వారము) ఆనుకొన్నాడు. తాము తలగడగా చేసికొన్న రాతిని విలబెట్టి దానిపై నూనె పోశాడు ఆ
ప్లమునకు జేతేలు" (దేవుని మందిరము) అని పేరు పెట్టాడు. నేను క్షేమంగా నా తండ్రి యింటికి తిరగి వస్తే యెహోవాయే వాకు దేవుడుగా వుంటాడు,. ఈ
రాయి దేవుని మందిరం అవుతుంది. దేవుడు నాకిచ్చే సంపదలో దశమ భాగం దేవునికి అర్పిస్తాను. అని ప్రమాణం చేసి హారాను దేశంపైపు సాగిపోయాడు

హారాను దేశంలో లాబాను యింటిలో యాకోబు
యాకోబు తన మేనమామ లాబాను యింటికి వెళ్లాడు. అతని యింట్లో అన్ని పనులు చేస్తున్నాడు. లాబాను యాకోబుకు జీతం ఇస్తానన్నాడు. నాదగ్గర
ఏడు సరి॥లు పనిచేస్తే నా కుమార్తెను నీకుభార్యగా చేస్తానన్నాడు. లాబాను పెద్ద కుమార్తె లేయా, ఆమె జబ్బు కండ్లు కలది. చిన్న కుమార్తె రాహేలు చాలా
అందమైంది. యాకోబు రాహేలును ప్రేమించాడు. ఆమెను భార్యగా పొందడానికై మామ దగ్గర 7 సం॥లు పనిచేయడానికి సిద్ధదపడ్డాడు ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి లాబాను పెద్ద విందు చేయించాడు, రాత్రి సమయంలో తన పెద్దకుమార్తె అయిన లేయాను యాకోబు దగ్గరకు పంపాడు. ఉదయాన్నే మామచేసిన మోసం తెలిసికొన్నాడు. ఇలా ఎందుకు చేశావని మామను నిలదీశాడు. "పెద్ద అన్మాయికి వివాహం
చేయకుండా చిన్నమ్మాయికి చేయడం మాదేశపు మర్యాద కాదు, నీవు చిన్నమ్మాయి కావాలంటే మరో ఏడేండ్లు నా దగ్గర కొలువు చెయ్యి" అన్నాడు యాకోబు చాల దిగులుపడ్డాడు. అతను రాహేలును ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి మరో 7 సం॥లు మామయింట్లో కొలువు చేసి రాహేలును పెండ్లి
చేసికొన్నాడు. యాకోబు లేయాను ద్వేషించాడు, రాహేలును ప్రేమించాడు అయితే దేవుడు లేయాకు మొదట సంతానాన్ని యిచ్చాడు. ఆమెకు ఆరుగురు
కుమారులు, ఒక కుమార్తె పుట్టారు. వారి పేర్లు రూబేను, షిమ్యోను, లేవి యూదా, ఇళ్ాకారు, జెబులూను, కుమార్తె పేరు దీనా, లాభాను లేయాదాసి
అయిన జిల్పాను, రాహెలు దాసి అయిన బిల్హాను కూడా యాకోబుకు యిచ్చివేశాడు. జీల్పా కుమారులు గాదు, ఆషేరు, బిల్హా కుమారులు: దాను నప్తాలి

రాహేలుకు చాలా కాలం వరకు సంతానం లేదు, తర్వాత ఆమెకు యోసేపు అను కుమారుడు పుట్టాడు, మామ  కోరికపై యాకోబు యింకా
ఆరు నెలలు కొలువు చేశాడు. ఈ సమయంలో పొడలు, చారలు వున్నమేకలను, నల్లని గొర్రెలను తన జీతంగా తీసికొంటానన్నాడు. ఆందుకు
లాబాను సమ్మతించాడు

యాకోబు పశువులు నీళ్లు తాగు చోట్లలో చారలున్న చీనారు జంగిసాలు చెట్ల చువ్వలను నాటాడు, ఆందువల్ల యాకోబు పశువులు అత్యధికంగా వృద్ధి చెందాయి. అతడు మిక్కిలి ధనవంతుడయ్యాడు. ఈ
విషయం తెలిసికొన్న లాబాను కొడుకులు అసూయపడ్డారు. లాభాను కూడ ముఖం చిన్నబుచ్చుకొన్నాడు. ఈ సంగతి గమనించిన యాకోబు తన యావదాస్తిని, భార్యలను, దాపదాసీలను పశువులను గొర్రెలను వెంటబెట్టుకొని
తన తండ్రి వుంటున్న కనాను దేశానికి బయలుదేరాడు.

యాకోబు తన అన్న ఏశావు వుంటున్న శేయీరు ప్రాంతం చేరాడు. ఏశావు తనను, తన భార్యాపిల్లలను చంపు తాడేమో అని మనసులో భయపడుతున్నాడు. అందుకని తన గుంపును రెండు భాగాలు చేశాడు.
మొదటి గుంపులోని సేవకులకు బహుమతులిచ్చి పంపాడు. తాను కొంతమందితో వెనకవుండిపోయాడు. ఒకవేళ ఏళావు కోపంతో మొదటి గుంపును చంపితే తాను వెనక నుండి పారిపోవచ్చు అనుకొన్నాడు. తన వెంట
వున్న బార్య, బిడ్డలను, దాస, దాసీలను కూడ రేవు దాటించాడు. తాను ఒంటరిగా మిగిలిపోయాడు. యాకోబు డేవునికి దీనంగా మొర పెట్టుకున్నాడు. "దేవా నీవు ఆజాపించిన విధంగానే నేను నా దేశానికి బంధుజనుల దగ్గరికి బయలుదేరాను. నీవునన్ను బహుగా ఆశీర్వదించి నా సంలానాన్ని యిసుక రేణువులవలె విస్తరింప చేస్తానని వాగ్దానాలు చేసి వుంటివి. నేను వట్టి చేతులతో హారానుదేశం వెళ్లాను. యిప్పుడు ఎంతో ఆశీర్వదింపబడి అపారమైన సంపదలతో భార్య బిడ్డలతో, దాసి డాసీలతో తిరిగి వస్తున్నాను. అయినను మా అన్న ఏశావుకు
భయపడుతున్నాను. నీవే నాకు దిక్కు" అని ప్రార్థించాడు. ఆ రాత్రంతా ఒంటరిగా వున్న యాకోటుతో ఒక నరుడు (నరుని రూపంలో వున్న దేవదూత) పెనగులాడాడు. యాకోబు అతన్ని గట్టిగా పట్టుకొని -"నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నేను నిన్ను పోనివ్వను" అన్నాడు అప్పుడు దేవదూత "నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి
గెలిచావు. కాబట్టి యిక నుండి నీ పేరు ఇశ్రాయేలు" (దేవునితో పోరాడువాడు)
అని అన్నాడు. యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన స్థలం గనుక ఆ చోటికి పెనూయేలు(దేవుని ముఖం) అని పేరు పెట్టాడు. అప్పుడు సూర్యోదయమైంది. దేవుడు యాకోబుతో పెనుగులాడుతున్న సమయంలో అతని తొడగూటిమీద కొట్టాడు. కనుక ఉదయం యాకోబు కుంటుతూ నడిచాడు. అతడు పెనూయేలు నుండి ముందుకు సాగిపోయాడు. దూరం నుండి వస్తున్న ఏశావును చూశాడు. అయినా ధైర్యంగా అందరికంటె ముందు నడుస్తున్నాడు. తన వెనుక భార్య, పిల్లలను, సేవకులను వుంచాడు ఏశావు తమ్ముణ్ణి సంతోషంగా ఎదుర్కొన్నాడు. ప్రేమతో కౌగిలించుకొన్నాడు. వీళ్ళంతా ఎవరు అని ఆడిగాడు. నాభార్య బిడ్డలు, దాస దాసీలు అని చెప్పాడు. యాకోబు తన భార్యల దగ్గర ఫున్న అన్యదేవతల విగ్రహాలను షెకెము దగ్గర వున్న మస్తకి వృక్షము క్రింద పాతిపెట్టాడు. తర్వాత
బేతేలుకు వెళ్లాడు. అక్కడ నుండి బెల్లెహేము (ఎప్రాతా) వెళ్లు మార్గంలో రాహేలు తన రెండవ కుమారుడు బెన్యామీమను ప్రసవించి మరణించింది
తర్వాత యాకోబు హెబ్రోను వెళ్ళి తన తండ్రియైన ఇప్పాకుతో కలిసి వుండసాగాడు

యాకోబుకు మొత్తం 12 మంది కుమారులు కలిగారు. వారిలో రాహేలుకు పుట్టిన యోసేపు, బెన్యామీను అంటే అతనికి చాల యిష్టము తక్కిన కుమారులు యోసేపును కొట్టి, ఐగుప్తు వెళ్లే ఇష్మాయేలీయులకు
అమ్మివేశారు. ఐగుప్తులో యోసేపు రాజు దయపొంది గొప్ప అధికారి అయ్యాడు కనానులో కరవు ఏర్పడిన సమయంలో యాకోబు తన కుమారులు, యితర
కుటుంబ సభ్యులందరితో ఐగుప్తుకు వెళ్లాడు. అక్కడ 17 సం॥లు వున్నాడు 14సం బ్రతికాడు. యాకోబు కోరిక మేరకు అతని మృత దేహాన్ని కనాను
దేశంలో మక్బేలా పొలంలోని గుహలో, అతని పితరుల సమాధుల దగ్గర పాతిపెట్టారు. ఆ పొలము అబ్రాహాము శమశానము కొరకై కొని వుంచినది

ధ్యానాంశములు :

1.యాకోబు క్రేస్తవ విశ్వాసికి సూచనగా వున్నాడు. మొదట మోసగాడుగా వున్నాడు. అయితే పెనూయేలు అనుభవం తర్వాత ఇశ్రాయేలుగా
మారిపోయాడు. అతనిలో యదార్థత, ధైర్యము, మంచి తనం వచ్చేశాయి

2.యాకోబు 12మంది కుమారులతో బహుగా ఆశీర్వదింపబడ్డాడు
యాకోబు కుమారుల పేర్లను బట్టియే ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రములుగా విభజింపబడ్డారు. ఉదా:- రూబెను గోత్రం, యూదా గోత్రం, గాదు గోత్రం

3.యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. అతని పేరును బట్టియే ఇశ్రాయేలు జనాంగము ఏర్పడింది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎక్కువగా
ప్రేమించాడు

4.యాకోబు యెహోవా దేవుని పట్ల అధికభక్తి విశ్వాసాలు కలిగి వున్నాడు దేవుడు కూడ యాకోబును ఎక్కువ ప్రేమించి, ఆశీర్వదించాడు. కనుకనే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి "యాకోబు దేవా" అని పిలిచేవారు

బంగారు వాక్యము

ఇశ్రాయేలు వంశము సైన్యముల కథిపతియగు యెహోవా ద్రాక్షతోట
యెషయా 5:7








Tuesday, 26 November 2019

November 26, 2019

Bible story of adam and eve | bible stories in telugu | ఆదాము - అవ్వ


దేవుడు ఈ భూమిపై సృష్టించిన మొట్టమొదటి మానవుడు ఆదాము. అతడే మానవ జాతికి మూల పురుషుడు. దేవుడు ఆరు రోజుల్లో భూమ్యాకాశాలను, సూర్య చంద్రులను, పశు పక్ష్యాదులను, మనిషిని సృజించాడు.
ఆ సృష్టి క్రమం యిలా వుంది.
మొదట భూమి నిరాకారంగా వుంది. అగాధజలములపై దట్టమైన చీకటి క్రమ్మి వుంది. దేవుని ఆత్మ ఆ జలముల పై అల్లాడుతూ వుంది. దేవుడు ఆజ్ఞ ఇయ్యగానే వెలుగు ఏర్పడింది. ఆయన మొదటి రోజు వెలుగును, చీకటిని వేరుపరచి వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. రెండవ రోజు దేవుడు అగాధ జలములను రెండు భాగములుగా చేశాడు. పై జలములకు
ఆకాశమని పేరు పెట్టాడు. మూడవ రోజు ఆకాశము క్రింద వున్న జలములన్ని ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనిపించుగాక అని ఆజ్ఞాపించాడు. జలములు,
భూమి విడిపోయాయి. దేవుడు జలములకు సముద్రమని, ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. భూమిపై పలురకాల మొక్కలు, ఫలమిచ్చు వృక్షాలు, గడ్డి మొలచుగాక అని ఆజ్ఞ ఇచ్చాడు.
అంతా ఆయనమాట ప్రకారం జరిగింది.
నాల్గవ రోజు దేవుడు పగలును రాత్రిని వేరు చేశాడు. వాటిని సూచించుటకై రెండు గొప్ప జ్యోతులను నియమించాడు. పగలును ఏలుటకు సూర్యుణ్ణి,
రాత్రిని ఏలుటకు చంద్రుణ్ణి నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. వీటన్నిటిని కాలములు, దినములు, సంవత్సరములను సూచించడానికి యేర్పాటు చేశాడు. అయిదవ రోజు దేవుడు ఆకాశంలో ఎగిరే పకులను, నీటిలో సంచరించే జలచరాలను సృజించాడు. ఆరవరోజు భూమి పై వుండే పశువులను, పురుగులను, అడవి జంతువులను సజించాడు. ఈ ఆరు రోజుల్లో తాను శృజించిన వాటన్నింటిని చూచి సంతోషించాడు. తర్వాత దేవుడు తన పోలిక చొప్పున, నరుని (మానవుణ్ణి) చేశాడు. సృష్టిలోని తక్కిన వస్తువులను,
జీవరాశులను దేవుడు తన నోటి మాటతో సృజించాడు. కాని మనిషిని మాత్రం
స్వయంగా తన చేతులతో, నేలమట్టితో తయారు చేశాడు. అతని నాసికారంధ్రములలో జీవ వాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుడు
నరుణ్ణి భూమి మీద వుండే సమస్తమైన జంతువులు, వృక్షములు, యితర జీవరాసులకంటె శ్రేష్టమైన వానిగా సృజించాడు. అతనికి భూమిపై వుండే పక్షులు,
జంతువులు, యితర జీవరాసులు, పండ్లు, ధాన్యములు ఆహారంగా వుండుగాక అని ఆజ్ఞాపించాడు.

దేవుడు ఏడవ రోజు విశ్రాంతి తీసికొన్నాడు. ఆయన ఏడవ రోజును పరిశుద్ధ పరచి, ఆశీర్వదించాడు.
దేవుడు సృజించిన మొట్ట మొదటి నరుని పేరు ఆదాము. దేవుడు ఆదామును ఏదెను తోటలో వుంచాడు. ఆదామునకు కష్టపడి వ్యవసాయం
చేయాల్సిన అవసరం లేదు. ఆవిరి భూమిలో నుండి పైకి వచ్చి నేలను తడుపుతూ వుండేది.
ఏదెను తోట మధ్యలో 1. జీవ వృక్షము. 2. మంచి చెడ్డలు తెలిపే వృక్షము వున్నాయి. దేవుడు ఆదాముకు ఒక గట్టి హెచ్చరిక చేశాడు. “నీవు |
ఈ తోటలోని పండ్లన్నీ తినవచ్చు. అయితే మంచి చెడ్డలు తెలిపే వృక్షము యొక్క పండ్లు మాత్రం తినకూడదు. అవి తింటే తప్పకుండా చచ్చిపోతావు".
ఆదాముకు ఆకలి, దప్పిక, బాధ, చింత, సిగ్గు, బిడియం అనేవి ఏవీ తెలియవు. ప్రతిరోజు ఒక స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడుతూ, కాలం గడుపుతున్నాడు.

'ఏదెను తోటలో తడపడానికి దేవుడు నాలుగు నదులను ప్రవహింప చేశాడు. వాటి పేర్లు పీషోను, గీహోను, హిద్దికెలు, ఫరాతు (యూఫ్రటీసు). ఆదాము
భూమిపై వున్న ప్రతి జంతువుకు, పక్షికీ, కీటకానికి పేర్లు పెట్టాడు. ఆదాము పెట్టిన పేర్లే వాటికి స్థిరపడిపోయాయి. కొంతకాలం గడిచి పోయింది. సృష్టిలోని జీవరాసులన్నీ జంటలుగా వున్నవి. ఆదాము మాత్రం ఒంటరిగా ఏదెను తోటలో
సంచరిస్తూ వున్నాడు. అతనికి ఎవరూ తోడులేరు. ఈ లోటును. దేవుడు గమనించాడు. ఆయన ఒక రోజు ఆదాముకు గాఢనిద్ర కలుగజేశాడు. అతని ప్రక్కటెముకను తీసి దాని నుండి ఒక స్త్రీని తయారు చేశాడు. ఆమెను ఆదాము దగ్గరికి తీసికొని వచ్చాడు. ఆ స్త్రీని చూచి ఆదాము చాల సంతోషించాడు. “నా యెముకలలో ఒక యెముక, నా మాంసములో మాంసము. ఈమె నరునిలో నుండి తీయబడింది కనుక “నారి” అని పిలువబడుతుంది” అన్నాడు. ఆదాము తన భార్యను చాలా ప్రేమగా చూసుకొంటున్నాడు. యిద్దరూ ఏదెను తోటలో దిగంబరులుగా సంచరిస్తూ, ఆ తోటలోని పండ్లు తింటూ కాలం గడుపుతున్నారు. వారికి సిగ్గంటే ఏమిటో తెలియదు. వారు పరిశుద్ధులై,
దేవునికి ఇష్టులై వున్నారు.

దేవుడు సృజించిన భూ జంతువులలో సర్వము (సాతాను) చాల యుక్తి గలది. అది ఒక రోజు స్త్రీ (హవ్వ) దగ్గరికి వచ్చింది. ఆమెతో మాట్లాడుతూ “ఈ తోట చాలా అందంగా వుంది. తోటలోని పండ్లు చాల
బాగున్నాయి. మీరు ఈ పండ్లన్నీ తినవచ్చునా? ఏ చెట్టు పండైన తినకూడదని దేవుడు మీతో చెప్పాడా?” అని అడిగాడు.
స్త్రీ సర్పముతో తో యిలా అన్నది. “దేవుడు మాకు పూర్తి స్వేచ్చ యిచ్చాడు. ఈ తోటలోని పండ్లన్నీ తినవచ్చని చెప్పాడు. అయితే తోట మధ్యలో -
మంచి చెడు తెలిపే చెట్టు పండ్లు మాత్రం తినవద్దని చెప్పాడు. అవి తింటే చచ్చిపోతామని చెప్పాడు."
స్త్రీ మాటలు విన్న సర్పము నవ్వింది..
“అంతా అబద్దము. దేవుడు చెప్పిన మాటలు నమ్మకండి. ఆ చెట్టు పండ్లు తింటే మీరు చావనే చావరు. మీకు తెలివి వచ్చి మంచి చెడలు
తెలిసికొంటారు. మీరు దేవతలతో సమానులౌతారు. అందుకే దేవుడు మీతో ఆ పండ్లు తినవద్దని చెప్పాడు." అన్నది. స్త్రీ సర్పము మాటలు నమ్మింది. ఆ చెట్టు పండ్లు చూడటానికి చాల అందంగా, తినడానికి చాల రుచిగా వున్నాయి. గనుక ఆ స్త్రీ తాను కొన్ని పండ్లు తిని, తన భర్త అయిన ఆదాముకు కొన్ని యిచ్చింది. అవి తినిన వెంటనే వాళ్లు తాము దిగంబరంగా వున్నామని గ్రహించారు. అంజూరపు
ఆకులు కుట్టి తమ నడుములకు చుట్టుకొన్నారు.
సాయంకాలం అయింది. దేవుడు ఏదెను తోటలోనికి
వచ్చాడు. ఆదాము హవ్వలను పిలిచాడు. వాళ్ళు ఆయన స్వరం విన్నారు. ఆయన ఎదుటికి రాకుండా చెట్ల మధ్య దాక్కొన్నారు. ఏదో కీడు జరిగిందని
యెహోవా దేవుడు తెలిసికొన్నాడు. “ఆదామా! నీవు ఎక్కడ వున్నావు?” అని బిగ్గరగా పిలిచాడు. అందుకు జవాబుగా ఆదాము - నేను దిగంబరంగా వున్నాను.
కనుక చెట్ల చాటున దాక్కొన్నాను" అని చెప్పాడు..
“నీవు దిగంబరివని నీకెలా తెలిసింది? నేను తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలను తిన్నారు కదూ?” అని అడిగాడు. అందుకు ఆదాము "ఈ స్త్రీ తాను తిని నాకు కూడ తినిపించింది.
అన్నాడు. స్త్రీ "సాతాను (సర్పము) మోసపు మాటలు నమ్మి తిన్నాను". అని చెప్పింది. ఈ విధంగా ఆదాము హవ్వ మీద, హవ్వ సర్పం మీద నెపం మోపారు
దేవుడు ఆదాము హవ్వలను బయటికి పంపుట.3
వారి మాటలు విన్న దేవునికి కోపం వచ్చింది. ఆయన సర్పాన్ని శపించాడు." ఈ చెడ్డ పని చేసినందువల్ల నీవు భూమి మీద వున్న జంతువులన్నింటిలో శపించబడిన దానివయ్యావు. నీవు పొట్టతో పాకుతూ
మట్టితిని జీవిస్తావు. నీ సంతానానికి, స్త్రీ సంతానానికి యుగ యుగాలు వైరం వుంటుంది. నీవు ఆమె సంతానాన్ని మడమమీద కరుస్తావు. ఆమె సంతానం
నిన్ను తలమీద కొడుతుంది" దేవుడు స్త్రీతో యిలా అన్నాడు. "నీవెంతో ప్రయాసతో ప్రసవ వేదన
భరించి పిల్లలను కంటావు, పురుషునిపై నీకు వాంఛ కలుగుతుంది. దేవుడు ఆదాముతో యిలా అన్నాడు. "నీవు నా ఆజ్ఞను అతిక్రమించావు. చేయరాని పాపం చేశావు. నీ మూలంగా ఈ భూపి శపించబడింది. నీవెంతో కష్టపడి, చెమటకార్చి ఆహారం పండించుకొ
తింటావు. నీవు నేలమట్టి నుండి తీయబడ్డావు కనుక నేలమట్టిలో" కలిసిపోతావు ఆదాము తన భార్యకు హవ్య (జీవముగల ప్రతి వానికి తల్లి) అని
పేరు పెట్టాడు. దేవుడు ఆదాము హమ్యలను ఏదెను తోట నుండి బయటికి పంపి వేశాడు. వాళ్లు తిరిగి రాకుండా తన దూతలైన కెరూబులను, జీవ వృక్షానికి
పోవు మార్గంలో అగ్ని జ్వాలలను కావలిగా పెట్టాడు

ఆదాము హవ్వలకు యిద్దరు కుమారులు కలిగారు. పెద్దవాడి పేరు కయీను, చిన్నవాడి పేరు హేబెలు. కయను వ్యవసాయదారుడు, , హేచెలు
గొర్రెల కాపరి, కయీను అసూయతో తన తమ్ముడైన హేబెలును చంపాడు. దేవుడు కయీనును దేశ దిమ్మరివి కమ్మని శపించాడు.
ఆదాముకు మరియొక కుమారుడు కలిగాడు. హవ్య అతనికి "షేతు అని పేరు పెట్టింది. ఆదాము 930 సం॥|లు జీవించాడు. ఆదాము హవ్యలు
దేవుని ఆజ్ఞ మీరడం వల్లనే మనుష్యులు క్రమక్రమంగా దేవునికి దూరస్థులై  సాతాను బంధకములలో చిక్కుకొన్నారు. సాతాను యొక్క బానిసత్వం నుండి
మానవులను విమోచించడానికి దేవుడు నరరుూప ధారియై యేసుక్రీస్తుగా జన్మించాడు


ధ్యానాంశములు
మీరడం వల్లనే మనుషులు క్రమక్రమంగా దేవునికి దూరస్థులై ఆదాము పొవ్వ దేవుని సన్నిధిలో, ఏదైను వనంలో హాయిగా, పవిత్రంగా జీవితం గడుపుతున్నారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల శాపాన్ని కష్టాలను కొని తెచ్చుకొన్నారు

1.తాము చేసిన తప్పుకు యితరులు కారణం అని చెప్పారు. తమ తప్పును ఒప్పుకోలేదు
మనుషులు చిరకాలం శాపంలో, పాపంలో వుండటం దేవునికి యిష్టంలేదు ఆదాము పొవ్వలు జీవ వృక్ష ఫలాలు తింటే చిరకాలం పాపంలోనే వుండి పోవలసి వచ్చేది. అందుకే దేవుడు వాళ్ళను ఏదెను తోటలో
నుండి బయటికి పంపివేశాడు

3.దేవుడు ప్రేమా స్వరూపి, కనుకనే శరీర ధారిగా భూమిపై అవతరించాడు సాతాను చాలా యుక్తిగా మాట్లాడుతాడు. మోసం చేస్తాడు. కనుక విశ్వాసులు చాలా జాగ్రత్తగా వుండాలి


బoగారు వాక్యము
మనము మట్టినుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారము, పరలోక పంబంధి పోలికయు ధరింతుము" 1 కొరింధి 15:49


Monday, 25 November 2019

November 25, 2019

క్రిస్మస్ ట్రీ కి స్టార్స్ ఎందుకు పెడతారో తెలుసా?



ఇది క్రిస్మస్ సమయం. క్రీస్తు జన్మదిన సందేశాన్ని,
సంతోషంగా ఆయా రీతులుగా వెల్లడి చేసే సమయం. క్రొత్త బట్టలు, పిండి వంటలు, ఇంటికి సున్నాలు, క్రిస్మస్ క్యారల్స్, క్రిస్మస్ కేకులు, మినీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్టు వివిధ పేర్లతో క్రిస్మస్ జరుపుకుంటాము. క్రిస్మస్లో భాగంగా ఇంటిపై రంగురంగుల నక్షత్రం, ఇంటి లోపలక్రిస్మస్ ట్రీ ఎంతో అందంగా మనం అలంకరిస్తాము. ఆ క్రిస్మస్ ట్రీకి మనం తగిలించిన మెరుపులతో కూడిన నక్షత్రాలే అసలు అందాన్ని తెస్తాయి.

ఏళ్ళ తరబడి మనం క్రిస్మస్ ట్రీకి నక్షత్రాలను
తగిలిస్తున్నాము. కొన్నిసార్లు నక్షత్రాల్లాంటి కరెంటు బల్బులను కూడా తగిలించి ఆ చెట్టును అలంకరిస్తున్నాము. ఇంతకీ ఆ చెట్టుకు నక్షత్రాలకు ఉన్న సంబంధం ఏమిటో ఎప్పుడైనా
ఆలోచించారా? ఆ నక్షత్రాల వెనుక ఒక విచిత్రమైన కథ ఉన్నదట. అది ఏమనగా “ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమ్మీద కన్యయైన మరియ ద్వారా పశువులపాకలో జన్మించినప్పుడు ఈ సృష్టి అంతా ఆ
మహిమా స్వరూపి, సృష్టంతటికీ ఆధారసంభూతుడైన దేవుడు భూమిమీద జన్మించినప్పుడు, భూమిమీద ఉన్న చెట్లన్నీ బహుగా ఫలించి, తమ ఫలములతో తమ్మును తాము అలంకరించుకొని యేసయ్య చుట్టూ సంబరముతో తిరుగుచుండెనట. అలానే పక్షులు, పుష్పించే ప్రతి మొక్క తమతమ పుష్పాలతో చక్కగా అలంకరించుకొని క్రీస్తు చుట్టూ తిరుగుచూ బహుగా సంతోషించుచూ వుండగా ఆకాశ నక్షత్రాలు కూడా దివి నుండి భువికి దిగివచ్చి తమ తేజస్సుతో ఆ ప్రాంతమంతా వెలుగుతో నింపెనట. కానీ (Fir Tree) ఫర్ ట్రీ అనగా నేడు మనం పిలుస్తున్న క్రిస్మస్ ట్రీ మాత్రం ఎటువంటి సంతోషం, ఆనందం
లేక ఒకమూల దిగులుతో ఆ పూలచెట్లు, ఆ పండ్ల చెట్లు బహుగా ఫలించి తమ పువ్వులతో, పండ్లతో తమ్మునుతాము అలంకరించుకొని ఆనందిస్తూ వుండగా ఏ పండ్లు, ఎటువంటి పువ్వులు లేని క్రిస్మస్ ట్రీ దూరముగా నిలబడి పుష్పాలను, ఫలాలను, నక్షత్రాలతేజస్సును దిగులుతో చూస్తూ వుండెనట.
అది గమనించిన నక్షత్రాలు ఆ క్రిస్మస్ ట్రీ (Fir Tree)
దగ్గరకు వెళ్ళి ఎందుకని నీవు దిగులుగా ఉన్నావు, ఎందుకని ఈ పండుగలో నీవు పాలుపంచుకొనకుండా దీనంగా, దూరంగా నిలబడిపోయావు అని అడిగెనట. అప్పుడు ఆ ట్రీ మరీ... మరీ... ఆ చెట్లకేమో ఫలములు ఉన్నాయి, ఈ మొక్కలకేమో చక్కని పూవులున్నాయి. అవి వాటి ఫలములచేత, పువ్వులచేత చక్కగా
అలంకరించుకొని అందంగా తయారయ్యాయి. మరి నేనేమో ఏ ఫలములకు, పుష్పాలకు నోచుకోని అభాగ్యురాలిని. అందుకే దిగులుతో ఓ మూలవుండి వారి ఆనందాన్ని చూడగలుగుతున్నానే
గాని వాటితో పాలు పంచుకోలేకపోతున్నాను అని అంటుండగా, ఆ నక్షత్రాలు తమ ఆనందాన్ని సంతోషాన్ని మరచి ఎటువంటి ఫలములు, పుష్పములు లేక గుర్తింపునకు నోచుకోలేక ఉన్న ఆ
చెట్టు పట్ల జాలిపడి, ఆ నక్షత్రాలన్నీ ఏ ప్రత్యేకత లేని ఆ చెట్టును తమ అందముతో, తేజస్సుతో నింపి యేసయ్య ముందుకు తీసుకొని రాగా అక్కడ ఉన్న చెట్లు, మొక్కలు, నక్షత్రాలమధ్య ఆ క్రిస్మస్ ట్రీ ఎంతో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిందట.
ఈ కథను ఆధారం చేసుకొని అప్పటినుండి క్రిస్మస్ ట్రీని
నక్షత్రాలతో అలంకరించడం ఆచారంగా మారిందట.

కానీ ఈ కథలో ఓ గొప్ప క్రిస్మస్ సందేశం ఉంది సుమా! అదేమనగా, ఏ రీతిగా నక్షత్రములు తమ్మునుతాము తగ్గించుకొని తమ సంతోషాన్ని, ఆనందాన్ని మరచి ఫలములు, పుష్పములు లేని ఆ చెట్టును అలంకరించి ఆకర్షణను, అందాన్ని అందించినవో అలాగే పాపములచేత, అపరాధములచేత చచ్చిన మనము మన పాపములవలన శాంతి, సమాధానములు, సుఖ సంతోషములు నోచుకోక దిక్కుమాలిన వారిగా దిగులుతో జీవిస్తున్న మనలను తన నీతితో రక్షణ వస్త్రముతో అలంకరించవలెనని రెండువేల
సం||ల క్రితం మన కొరకు ఉదయించిన ఆ రక్షణ చుక్క మన ప్రభువైన యేసు. ఆయన ఏరీతిగా తన జన్మ ద్వారా దేవుని ప్రేమను పంచి పెట్టాడో, ఆ నక్షత్రములు ఏ రీతిని తమ్మును తాము మరచి సంతోషమునకు నోచుకోని ఆ ఫర్ ట్రీ ని అలంకరించినవో అదే రీతిగా ఈ క్రిస్మస్ నందు నీ ప్రేమను, నీ సంతోషాన్ని దీనులతో, పేదవారితో పంచుకొని నిజ క్రిస్మస్ ను జరుపుకోవాలి అంతేకాకుండా ఈ క్రిస్మస్ నాడైనా ఎవరో ఒక అన్యున్ని వారి కుటుంబాన్ని క్రీస్తు సంఘమునకు నడిపించి క్రీస్తు ప్రేమను వారు
తెలుసుకొనులాగున ఎందుకు ప్రయత్నించకూడదూ

బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను
పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించేదరు దాని 12:3

Thursday, 14 November 2019

November 14, 2019

Bible story of jonah | bible stories in telugu | యోనా


బైబిలులోని చిన్న ప్రవక్తలలో యోనా ఒకడు. యోనా దేవుని యందు భయభక్తులు గలవాడు.
దేవుని ఆజ్ఞలను పాటించేవాడు. దేవుని మాటలను
ప్రజలకు ఉపదేశిస్తూ వుండేవాడు. యోనా తండ్రి పేరు అమిత్తయి. ఒకసారి యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై "నినెవె పట్టణంలో వుండే ప్రజలు నన్ను మరచిపోయి, నాకు వ్యతిరేకంగా, తమ యిష్టం వచ్చిన విధంగా జీవిస్తున్నారు.
వారిపై నాకు చాల కోపం వచ్చింది. నీవు వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి రాబోతుందని ప్రకటించు” అని ఆజ్ఞాపించింది. నినెవె ఒక మహానగరము. దాని జనాభా ఒక లక్ష యిరవై వేలు దానిని చుట్టి రావాలంటే మూడు దినాలు పడుతుంది. ఆ నగరంలోని ప్రజలు చాల ధనవంతులు. చాల తెలివి గలవారు. అయితే చాల దుర్మార్గులు కాబట్టి యోనా ఆ పట్టణానికి వెళ్లడానికి జంకాడు వాళ్లు తన మాట వినరనీ, తనను చంపుతారని భయపడ్డాడు. అందువల్ల నినెవె పట్టణానికి పోకుండా, మరో చోటికి
పోవాలని తలంచాడు. యెప్పే అనే రేవు పట్టణానికి వెళ్ళి, డబ్బు చెల్లించి తర్ణీషు వెళ్లే ఓడ ఎక్కాడు. ఓడ క్రింది భాగానికి వెళ్ళి హాయిగా నిపోతున్నాడు.

యోనా చేసిన పనికి యెహోవా దేవునికి చాల కోపం వచ్చింది. ఆయన సముద్రంలో గొప్ప తుఫాను పుట్టించాడు. పెద్ద గాలి అటు ఇటు వీస్తోంది.
గాలికి పెద్ద పెద్ద అలలు లేచాయి. అలల తాకిడికి ఓడబద్దలై పోతుందేమో అనిపిస్తోంది. ప్రయాణీకులు ఎంతో భయపడసాగారు. నావికులు, ఓడను అదుపు
చేయలేకపోతున్నారు. చాల సరుకులు సముద్రంలో వేసి, ఓడను తేలిక చేశారు. అందరూ తమ తమ దేవతలను ప్రార్ధింపసాగారు. అయినా తుఫాను తగ్గలేదు. కొందరు వెళ్ళి యోనాను నిద్ర లేపారు. “నిద్రపోతా! నీకు కొంచెమైనా భయం లేదు. లేచి దేవుని ప్రార్ధించు. ఆయన దయ చూపిస్తే ఈ తుఫాను
తగ్గిపోతుంది.” అని చెప్పారు.
ఓడలో వున్నవారు ఒక పని చేయాలనుకొన్నారు. “మనం చిటిలు వేద్దాము. ఈ తుఫాను ఎవరి మూలంగా వచ్చిందో తెలిసిపోతుంది” అనుకొన్నారు. చీట్లు వేశారు. చీటి యోనా పేరుతో వచ్చింది. అందరూ అతని వైపు అనుమానంగా చూశారు. "ఓయీ! నీవెవ్వరు? ఎక్కడికి పోతున్నావు? ఏమి పనిమీద పోతున్నావు? దేవునికి కోపం తెప్పించే పని ఏమి చేశావు?" అని అడిగారు. అప్పుడు యోనా "అయ్యా! నేను హెబ్రీయుడను. ఆకాశనివాసి, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా దేవుని భక్తుడిని. కాని ఆయన నినెవె పట్టణానికి పొమ్మంటే, తన్టీషుకు పారిపోతున్నాను. నా మూలంగానే
ఈ తుఫాను వచ్చింది. కనుక నన్ను సముద్రంలో పారవేస్తే తుఫాను తగ్గిపోతుంది.” అని చెప్పాడు. వాళ్లు వెంటనే దేవుని ప్రార్థించారు. "యెహోవా
దేవా! మేము ఈ మనుష్యుణ్ణి చంపినాము, అన్న అపరాధం మా మీదికి రానియ్యవద్దు" తర్వాత వాళ్లు యోనాను సముద్రంలో పారవేశారు. వెంటనే
సముద్రం శాంతించింది. ఈ సంగతి గమనించిన ప్రయాణీకులు యెహోవా నిజమైన దేవుడని నమ్మారు. దేవునికి మిక్కిలి భయపడ్డారు. ఆయనకు బలులు అర్పించారు. ఆయనే నిజమైన దేవుడని నమ్మారు


దేవుడు పంపిన ఒక పెద్ద చేప యోనాను మ్రింగింది. యోనా చేప కడుపులో మూడు రోజులున్నాడు. తాను చేసిన తప్పుకు క్షమాపణ వేడాడు.
"దేవా! నీవు నన్ను కాపాడితే నేను నీ మందిరానికి వస్తాను. బలులు అర్పిస్తాను. మొక్కుబడులు చెల్లిస్తాను. నీవే నాకు దిక్కు, రక్షణాధారము, నీవు తప్ప నాకు దిక్కెవరూ లేరు” అని దీనంగా ప్రార్థించాడు. యెహోవా దేవుడు యోనా ప్రార్థన ఆలకించాడు. ఆయన చేపకు ఆజ్ఞ ఇవ్వగానే, అది యోనాకు నినెవె పట్టణ ప్రాంతంలో సముద్రపు ఒడ్డున కక్కివేసింది." -

దేవుని వాక్కు ననుసరించి, యోనా నినెవె మహా పట్టణానికి వెళ్లాడు. నగరంలో ఒక రోజంతా తిరిగాడు. నగరంలోని ప్రజలకు కలుగబోయే గొప్ప
ఆపదను గురించి ప్రకటించాడు. ఆ ప్రకటన విన్న నినెవె పట్టణస్థులు గడగడ వణికారు. దేవుని మాటలు విశ్వసించారు. నగరమంతా ఉపవాస దినం
ప్రకటించారు. గొప్పవారు, పేదవారు అనే బేధం లేకుండా అందరూ దీనులై గొనెపట్టలు కట్టుకొని దేవుని ప్రార్థింపసాగారు. ఈ విషయం తెలిసికొన్న
రాజు కూడ దీనుడై, గోనె పట్టా కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. రాజు, మంత్రులు ప్రకటన చేయించారు. ప్రజలందరు ఉపవాసం వున్నారు. పశువులు కూడ మేత మేయలేదు. ప్రజలందరు దీనులై దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించారు. దేవునికి ఆ నగర వాసులపై దయకలిగింది. ఆయన నినెవె పట్టణాన్ని నాశనం చేయడం మానుకొన్నాడు.

నినెవె పట్టణం నాశనం కాలేదని యోనా తెలిసికొన్నాడు. అతడు యెహోవా దేవునితో అన్నాడు - ప్రభువా ! నీవు నినెవె వాసులపై జాలి
చూపుతావనీ, వారిని క్షమిస్తావనీ నాకు తెలుసు. అందుకే నేను తరీషు పట్టణానికి పారిపోయాను” అన్నాడు.

యోనా నినెవె పట్టణానికి దూరంగా తూర్పు వైపున ఒక పందిరి వేసికొన్నాడు. దాని క్రింద వుంటున్నాడు. ఏమి జరుగుతుందో చూడాలనుకొన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు ఒక సొరచెట్టును మొలపించాడు. అది పెరిగి పెద్దదై మంచి నీడ యిచ్చింది. ఆ చెట్టును చూసి యోనా సంతోషించాడు.

మరునాడు యెహోవా ఒక పురుగును పంపాడు. అది సొరచెట్టును పూర్తిగా తినివేసింది. యోనా మీద ఎండ పడింది. అందువల్ల యోనా విసుక్కొన్నాడు. చావడం మంచిది అనుకొన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు
యోనాతో "నీవు కష్టపడకుండా, పెంచకుండా, తనకు తానే పెరిగి చచ్చిపోయిన సొర చెట్టువాడిపోయినందుకు యింతగా బాధపడుతున్నావే! లక్షా యిరవైవేల
జనాభాతో వేల పశువులతో నిండివున్న నినెవె మహా పట్టణం నాశనమైపోతే నాకు బాధ వుండదా?” అన్నాడు.
అప్పుడు యోనా దేవుని దయా గుణాన్ని,
తన తొందర పాటును తెలిసికొన్నాడు.


ధ్యానాంశములు :

1. యోనా ఒక మంచి ప్రవక్త. దేవుని యెడల భయభక్తులు వున్నవాడు.

2. యోనా భయస్తుడు. కాబట్టి నినెవె పట్టణస్థులకు భయపడి, దేవుని ఆదేశానికి వ్యతిరేకంగా తగ్గిషు ఓడ ఎక్కాడు.

3. మనం కూడ స్వంత యిష్టాలు నెరవేరాలని ప్రయత్నాలు చేస్తాము. అయితే చివరకు దేవుని చిత్తమే నెరవేరుతుంది.

4. దేవుడు తన ప్రజలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన కరుణాసంపన్నుడు

5. యోనా మూడు దినములు చేప కడుపులో వుండి బయటికి వచ్చాడు. యేసుక్రీస్తు మూడు దినములు సమాధిలో వున్నాడు. మరణాన్ని జయించి
తిరిగి లేచాడు.


బంగారు వాక్యము:

ఇదిగో, యోనా కంటె గొప్పవాడు ఇక్కడ వున్నాడు. మత్తయి 12:41