Breaking

Friday, 29 November 2019

Bible story of barak | bible stories in telugu | బారాకు



ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆయన చేసిన మేళ్లను మరచారు. ఆయనకు యిష్టం లేని పనులు చేయసాగారు. ఆయనకు కోపం తెప్పించారు. అందుచేత ఆయన వారిని కనాను రాజైన యాబీను చేతికి అప్పగించాడు. అతని సేనాపతి పేరు “సీసెరా". అతనికి 900 యినుప రథములు ఉన్నవి. అతని పేరు వింటేనే శత్రువులు భయంతో వణికిపోయేవారు. అతడు 20 సం||ల పాటు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నో బాధలకు గురి చేశాడు. అందువల్ల ఇశ్రాయేలీయులు యెహోవాకు దీనంగా మొర పెట్టారు. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు “దెబోరా" అను ప్రవక్తి న్యాయాధిపతిగ వుండేది. ఆమె రామాకు, బేతేలుకు మధ్య వున్న దెబోరాసరళవృక్షం క్రింద ప్రజలకు న్యాయం చెప్తూ ఉండేది. ఆమె కెదెషులో వుంటున్నఅ బీనోయము కుమారుడైన బారాకును పిలిపించింది. “నీవు 10 వేలమంది సైనికులతో వెళ్ళి సీసెరాతో యుద్ధం చెయ్యి. యెహోవా నీకు తప్పక విజయం లభింపచేస్తాడు” అని చెప్పింది. అందుకు బారాకు "నేను సీసెరాతో యుద్ధం చేయడానికి సిద్ధమే. అయితే నీవు కూడ నావెంబడి రావాలి” అన్నాడు. దెబోరా అంగీకారం తెలిపి యిలా అన్నది. "నేను నీ వెంట రావడానికి సిద్ధంగా వున్నాను. జరుగబోయే యుద్ధంలో నీవు గెలుస్తావు. కాని యెహోవా సీసెరాను ఒక స్త్రీకి అప్పగించబోతున్నాడు. అతనిని చంపిన ఘనత నీకు దక్కదు.” బారాకు 10 వేల మంది సైనికులతో యుద్ధానికి వెళ్లాడు. అతని వెంట దెబోరా కూడ వెళ్లింది. బారాకు తాబోరు కొండ మీద తన సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా వున్నాడు. ఈ సంగతి తెలిసిన సీసీసెరా అక్కడికి వెళ్లాడు. అతడు బారాకును చాలా సునాయాసంగా ఓడిస్తాను అనుకొన్నాడు. కాని మన
సిసెరా సైన్యాన్ని కలవరపరచాడు. కనుక అతని సైనికులందరు చంపబడ్డారు. అతడు కాలినడకన పారిపోయాడు. పారిపోయి హెబెరు భార్య అయిన
యాయేలు గుడారంలో దాక్కొన్నాడు. యాయేలు అతన్ని ఆదరించింది. అతనితో మంచిగా మాట్లాడింది. అతని ఆకలి తీర్చడానికై ఒక పాల బుడ్డిని యిచ్చింది. ఎవరైనా శతృవులు వస్తే నీకు తెలియజేస్తాను, అని చెప్పి గుడారపు ద్వారం దగ్గర నిలబడింది. సీసెరా యాయేలును, ఆమె మోసపు మాటలను నమ్మాడు. పాలు తాగి హాయిగా నిద్రపోయాడు. ఆమె చేతిలోనే తన చావువుందని ఊహించలేకపోయాడు. యిదే మంచి అవకాశం అనుకొన్న యాయేలు ఒక పెద్ద మేకును సీసెరా కణతలో నుండి నేలకు దిగునట్లుగా కొట్టింది. సీసెరా గాఢ నిద్రలోనే శాశ్వత నిద్రలోనికి వెళ్లాడు. ఈ విధంగా దెబోరా ద్వారా దేవుడు పలికించిన మాటలు నెరవేరాయి. బారాకు సీసెరా కోసం వెదకుతున్నాడు. యాయేలు అతనికి ఎదురు వెళ్ళి “నీవు వెదకుతున్న మనిషి నా గుడారంలో వున్నాడు. చూపిస్తాను రా” అని చెప్పింది. బారాకు ఆమె గుడారంలోకి వెళ్ళి చూశాడు. సీసెరా రక్తపు మడుగులో చచ్చి పడివున్నాడు. దెబోరా, బారాకు చాల సంతోషించారు. యెహోవాకు స్తుతికీర్తనలు పాడారు. కొన్ని సం||ల తర్వాత ఇశ్రాయేలీయులు కనాను రాజైన యాబీనును కూడ ఓడించి, సంహరించారు. 40 సం||ల పాటు దేశం సుఖశాంతులతో తులతూగింది.

ధ్యానాంశములు

1. దేవుడు తన బిడ్డల ప్రార్థన ఆలకిస్తాడు. వారి కష్టాలు తొలగిస్తాడు అనే సత్యం ఈ కథ ద్వారా తెలిసికొనగలరు.

2. దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రకటించిన మాటలు తప్పకుండా నెరవేరుతాయి.

3. దేవుడు కొందరిని తన సాధనములుగా వాడుకొంటాడు. ఈ కథలో ఆయన బారాకును తన సాధనంగా వాడుకొన్నాడు.

4. దేవుని నమ్మిన వారికి విజయము, సుఖ సంతోషాలు తప్పక లభిస్తాయి.


బంగారు వాక్యము :

యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. కీర్తనలు 147:1






No comments:

Post a Comment