Breaking

Friday, 29 November 2019

Bible story of rahab | bible stories in telugu | రాహాబు


రాహాబు ఒక అన్యురాలు ఆమె యెహోవా దేవుణ్ణి విశ్వసించి తన ప్రాణాలను కాపాడుకొనడమేకాక తన యింటివారి ప్రాణాలు కూడ కాపాడింది. రాహాబు ఒక వేశ్య. ఆమె యిల్లు మెరికో పట్టణపు ప్రాకారం పై వుంది. ఆ రోజుల్లో వేశ్యావృత్తి రాజుల ద్వారా, మత పెద్దల ద్వారా ఆమోదం పొంది వుండేది.
యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదికి ఇవతలి గట్టున వున్నారు. యోర్దానుకు అవతలి వైపు యెరికో పట్టణం వుంది. యెరికో శపించబడిన నగరము. అక్కడి ప్రజలు దుష్టులు. దేవుని భయం లేని వారు. విచ్చలవిడిగా జీవితం గడిపేవారు. యెహోవా దేవుడు నూను కుమారుడైన యెహోషువతో యిలా అన్నాడు. - “నేను నా సేవకుడైన మోషేకు తోడెవున్నట్లుగా, నీకుకూడ తోడై ఉంటాను.నిన్ను విడువను, ఎడబాయను. నీవు
ధైర్యంగా ముందుకు సాగిపో. యోర్దాను అవతల వున్న అన్ని రాజ్యాలను మీరు జయిస్తారు. నేను మీకు యిస్తానని వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే (సుసంపన్నమైన)కానాను దేశము మీ వశం చేస్తాను. నీవు నిర్భయంగా ముందుకు సాగిపొమ్ము."

యెహోషువ యెరికో పట్టణ రహస్యాలు ముందుగా తెలసికోవడం మంచిదనుకొన్నాడు. ఆ పనికి యిద్దరు వేగుల వారిని పంపించాడు. వారు వ్యాపారస్థుల వలె మారువేషం వేసికొని, ప్రవేశించి రాహాబు యింట్లో బస చేశారు. ఈ విషయం రాజుకు తెలిసింది. రాజు వెంటనే భటులను పంపాడు. రాహాబు భటులతో ఇలా
చెప్పింది.

“నా యింటికి యిద్దరు మనుష్యులు వచ్చిన మాట నిజమే. వాళ్లెవరో నాకు తెలియదు. వాళ్ళిద్దరు పట్టణపు గవిని (ముఖద్వారము) మూయక ముందే
బయటికి వెళ్ళిపోయారు. మీరు వెంటనే వెళ్ళితే వారిని పట్టుకోగలరు.” ఆమె మాటలు నమ్మిన భటులు వెంటనే బయలుదేరి ఆ వేగుల వారిని పట్టుకొనుటకై వెళ్ళిపోయారు. వారు గవిని దాటగానే గవిని ద్వారం మూసివేయబడింది. రాహాబు యిద్దరు వేగుల వారిని తన మిద్దెపై వున్న జనపకట్టెలో దాచి పెట్టింది.

వారు పండుకొనక ముందు రాహాబు వేగులవారి దగ్గరికి వెళ్ళింది. ఆమె వారితో యిలా అన్నది. "అయ్యాలారా! యెహోవా దేవుడు మహాశక్తిమంతుడనీ, ఆయన ఈ దేశాన్ని మీకు యివ్వబోతున్నాడనీ మేము ఎరుగుదుము. అందువల్ల మా దేశ నివాసులందరు మిగుల భయపడుతున్నారు. మీ దేవుడు మీకు తోడుగా వుంటాడని మాకు తెలియును. ఆయన ఎర్ర
సముద్రమును ఏలాగు ఆరిపోవునట్లు చేసెనో, యోర్దాను తీరాన వున్న అమోరీయుల రాజులైన సీహోనును, ఓగును మీరేలాగు సంహరించారో మాకు తెలిసినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మేము చాల భయపడ్డాము. మీ దేవుడు పైన ఆకాశానికి, క్రింది భూమికి దేవుడే. మీ ఎదుట ఎంతటి పరాక్రమ వంతులైనా ధైర్యాన్ని కోల్పోతారు. నేను మిమ్ములను ప్రాణాపాయం నుండి కాపాడాను. కనుక మీరు యెరికో పట్టణాన్ని స్వాధీనము చేసికొనే సమయంలో నన్ను, నా తల్లిదండ్రులను, అక్క చెల్లెండ్రను కాపాడండి. ఆ విధంగా చేస్తామని నాతో ప్రమాణం చేయండి”.

వేగుల వారికి రాహాబు కోరిక న్యాయమైనదిగా తోచింది. వారు ఆమె కోరిన విధంగా చేస్తామని ప్రమాణం చేశారు. అయితే ఒక సలహా యిచ్చారు.
“నీవు నీ యింటి కిటికీకి ఒక తొగరు (ఎర్ర) దారం కట్టి వుంచాలి. యింటి వారందరు యింట్లోనే వుండాలి. ఎవరైనా యింటిలో నుండి బయటికి వెళ్ళినా, యింటి కిటికీకి తొగరు దారం లేకున్నా, మీ యింటి వారి మరణానికి మేము బాధ్యులము కాదు". అందుకు రాహాబు అంగీకరించింది. మరునాడు రాహాబు తన యింటి కిటికీకి ఒక తాడు కట్టి దాని ద్వారా ఆ యిద్దరు వేగులను కోట బయట దించింది. రాహాబు సలహా ప్రకారం వేగుల వారు తమను వెడుకబోయిన భటులు తిరిగి వచ్చేంత వరకు మూడు రోజులు కొండల్లో దాగి వున్నారు. ఆ తర్వాత వారు వెళ్ళి యెహోషువాతో “ఆ
దేశమంతా యెహోవా మన చేతికి అప్పగించబోతున్నాడు. అక్కడి ప్రజలు మన భయం చేత ధైర్యము కోల్పోయి వున్నారు" అని చెప్పారు. రాహాబు వారికి చేసిన సహాయం గురించి వివరించారు. ఇశ్రాయేలీయులు చాలా సులభంగా యేరికో పట్టణాన్ని తమ వశం వారు రాహాబును, ఆమె కుటుంబ సభ్యులను మాత్రం సంహరింపలేదు కాలం గడిచిన తర్వాత ఆ యిద్దరు వేగులలో ఒకడైన శల్మాను రాహాబును పెండ్లి చేసికొన్నాడు. ఆ శల్మాను కుమారుడే బోయజు. బోయజు కుమారుడే ఓబేదు. ఓబేదు కుమారుడే యెష్షయి. యెష్షయి కుమారుడే దావీదు మహారాజు

ఈ విధంగా శపించబడిన పట్టణంలో నివసిస్తూ
రాహాబు దేవుని నమ్మడం వలన ఆమె కుటుంబము
రక్షించబడింది. ఆమె ఇశ్రాయేలు జనాంగములో ప్రముఖ స్థానం పొందింది.


ధ్యానాంశములు:

1. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు పస్కా గొర్రెపిల్లను వధించి, దాని రక్తము ద్వార బంధములకు పూయడం వలన మృత్యుదేవత బారినుండి రక్షించబడ్డారు.

2. రాహాబు తొగరు దారం కట్టినందున ఆమె కుటుంబమంతా మరణం నుండి కాపాడబడింది.

3. పస్కా గొర్రెపిల్ల యేసు క్రీస్తుకు సూచనగా వున్నది.

4. యేసు ప్రభువు సిలువపై కార్చిన రక్తము మానవజాతిని రెండవ మరణము - అనగా నిత్యనరకము నుండి కాపాడుతుంది.

బంగారు వాక్యము :

విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున, అవిధేయులతో పాటు నశింపకపోయెను. (హెబ్రీ 11:31)

No comments:

Post a Comment