Breaking

Friday, 31 March 2023

March 31, 2023

Ankitham prabu song lyrics | అంకితం ప్రభూ

 



అంకితం ప్రభూ నా జీవితం 

నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)

నీ సేవకై ఈ సమర్పణా 

అంగీకరించుము నాదు రక్షకా (2)


1.మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా

నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా

నీ కృపలో బహుగా ఫలించుటకు

ఫలింపని వారికి ప్రకటించుటకు (2)

అంగీకరించుము నా సమర్పణ            ||అంకితం||


2.కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా

చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువా

నీ సన్నిధిలో ప్రకాశించుటకు

అంధకార ఛాయలను తొలగించుటకు (2)

అంగీకరించుము నా సమర్పణ             ||అంకితం||








March 31, 2023

Asadhyamainadhi lene ledhu | అసాధ్యమైనది లేనే లేదు



అసాధ్యమైనది లేనే లేదు

నన్ను బలపరచువాడు నాతో ఉండగా (2)

ఊహించలేని ఆశ్చర్యక్రియలలో

నా దేవుడు నన్ను నడిపించును (2)

సాధ్యమే అన్ని సాధ్యమే

నా యేసు తోడైయుండగా (2)


1.శోధన శ్రమలు వచ్చినను

ఏ మాత్రము నేను వెనుతిరిగినను (2)

సత్య స్వరూపి సర్వోన్నతుడైన

గొప్ప దేవుడు నన్ను బలపరచును (2)   ||సాధ్యమే||


2.సాతాను శక్తులు ఎదిరించిన

వాక్యమనే ఖడ్గముతో జయించెదను (2)

సర్వశక్తుడు తన శక్తితో నింపి

సాతానుపై నాకు జయమిచ్చును (2)     ||సాధ్యమే||








Thursday, 30 March 2023

March 30, 2023

నా మనస్సా ఆయన | naa manassa aayana

 



నా మనస్సా ఆయన మరచునా

దేవుడు నిన్ను మరచిపోవునా (2)

ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే

ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2)

స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే

కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)


1.నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో

సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే (2)

తరిగిపోను నేను – అణగార్చబడను నేను (2)     ||స్తుతింపజేయునే||


2.సరిచేయు వాడే – ఓ ….స్థిరపరచినాడే

బలపరచినాడే – పూర్ణుణ్ణి చేయునే

సరి చేసి నిన్ను – హెచ్చించిన ప్రభువు

ఈ నూతనవత్సరములో – అలంకరించునే…


3.విచారించే వారు లేక – ఒంటరైయున్న నీకు

ఆరోగ్యము దయచేసి – పరిపాలన నిచ్చునే (2)

కూలిన కోటను – రాజగృహముగా మార్చును (2)     ||స్తుతింపజేయునే||    ||నా మనస్సా||








March 30, 2023

Alfa omegayaina song lyrics | అల్ఫా ఒమేగయైన



అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా

అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా (2)

రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా

ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా

నాతో స్నేహమై నా సౌఖ్యమై

నను నడిపించే నా యేసయ్యా (2)       ||అల్ఫా||


1.కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే

ఉన్నతముగా నిను ఆరాధించుటకు

అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి

నూతన వసంతములు చేర్చెను (2)

జీవించెద నీ కొరకే

హర్షించెద నీలోనే (2)       ||అల్ఫా||


2.తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే

ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు

ఆశ నిరాశల వలయాలు తప్పించి

అగ్ని జ్వాలగా నను చేసెను (2)

నా స్తుతి కీర్తన నీవే

స్తుతి ఆరాధన నీకే (2)       ||అల్ఫా||


3.నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే

శుభ సూచనగా నను నిలుపుటకు

అంతులేని అగాధాలు దాటించి

అందని శిఖరాలు ఎక్కించెను (2)

నా చెలిమి నీతోనే

నా కలిమి నీలోనే (2)       ||అల్ఫా||









Wednesday, 29 March 2023

March 29, 2023

Arunakanthi kiranamai song lyrics | అరుణ కాంతి కిరణమై

 



అరుణ కాంతి కిరణమై

కరుణ చూప ధరణిపై

నరుని రూపు దాల్చెను

పరమ దేవ తనయుడు

అదే అదే క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్

ఇదే ఇదే క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్     ||అరుణ||


1.యజ్ఞ యాగాదులు – బలి కర్మకాండలు (2)

దోషంబులు కడుగలేవు

దోషుల రక్షింప లేవు (2)

పరిశుద్ధుని రక్తమునందే

పాపులకిల ముక్తి కలుగును

అందుకే.. అందుకే         ||అరుణ||


2.పుణ్య కార్యములు – మరి తీర్థయాత్రలు (2)

దోషంబులు కడుగలేవు

దోషుల రక్షింప లేవు (2)

పరిశుద్ధుని రక్తమునందే

పాపులకిల ముక్తి కలుగును

అందుకే.. అందుకే      ||అరుణ||



March 29, 2023

Arpinchuchuntini yesayya song lyrics | అర్పించుచుంటిని యేసయ్యా

 



అర్పించుచుంటిని యేసయ్యా

నన్ను నీ చేతికి (2)

దీనుడను నన్ను నీ బిడ్డగా

ప్రేమతో స్వీకరించు (2)        ||అర్పించుచుంటిని||


1.ఈ లోక జీవితం అల్పకాలమే

నీవే నా గమ్యస్థానము (2)

నిజ సంతోషం నీవు నాకిచ్చి (2)

నా హృదయం వెలిగించు (2)

నా ప్రభువా యేసయ్యా           ||అర్పించుచుంటిని||


2.దప్పిగొన్న జింకవలెనే

ఆశతో చేరితి నీ దరి దేవా (2)

సేదతీర్చి జలము నిన్ను (2)

వాడిన బ్రతుకులో (2)

నింపుము జీవము              ||అర్పించుచుంటిని||










Tuesday, 28 March 2023

March 28, 2023

deva nee aradhana song lyrics | దేవ నీ ఆరాధన

Click on image 





దేవ నీ ఆరాధన అదియే మా దీవెన

కృపతో కావుమా(2)

నీప్రేమతో మము నింపుమా (1)

దేవా నీ ఆరాధన అదియే మాకు దీవెన (2)


1.దేవాది దేవుడవు సత్యస్వరూపుడవు

మలోన నివసించు దేవా (2)

నీ సన్నిధి కాంతిని మాపై ఉదయింపజేసీ(2)

ఆశీర్వాదించుమయ దేవ ఆశీర్వదించుమయ  (దేవ)


2.నీ జీవ మర్గమందు నిత్యము నడిపించు

నీ వాక్యమే మాకు తోడు (2

నీ చేయి నందించి మమ్ము దరి చేర్చి (2)

మామ్మా అధరించుమయా దేవా మామ్మా

అధరించుమయా    (దేవ)








Saturday, 25 March 2023

Friday, 24 March 2023

March 24, 2023

Venolla koniyadina - వేనోళ్ళ కొనియాడిన

Click on image


వేనోళ్ళ కొనియాడిన – నా ఆశయే తీరదే

నిన్నెంత ఘనపరచినా – నా హృదయమే నిండదే

నజరేయుడా యేసయ్యా – నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా
నా స్థితి మార్చినది స్తోత్ర నిధియేగదా ||వేనోళ్ల||

1.ఎన్నికలేని నను ప్రేమించి లోకము నుండి నను వేరుపరచి
నీ సన్నిధిలో నీ కౌగిలిలో – నిత్యము నిలువగ పిలిచావు
మలిన బ్రతుకును నూతన పరచి – పరిమళ సువాసనగ |
నను మార్చినావు
హల్లెలూయా యేసయ్యా – పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా
మది గెలిచావు (జతకలిశావు) లోకాన్ని మరిచేంతలా||వేనోళ్ల॥

2. ఊహకు మించిన కార్యము చేసి – ఉన్నత కృపలో నను దాచినావు
గమ్యమే తెలియని ఈ పయనములో – నా గురి నీవై నిలిచావు
సర్వోన్నతుడా నీ సముఖములో – నను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు
హల్లెలూయా యేసయ్యా – కురిపించావు నీ చూపులో వెన్నెల
పలికించావు నీ ప్రేమరాగాలిలా||వేనోళ్ల||

3. తేజోవాసుల స్వాస్వములోన – నన్ను చేర్చగ కోరిక కలిగి |
దూతలగణముతో మేఘముపైన – త్వరలో రానైయున్నావు,
రాజుల రాజా నీ రాకడనే – స్మరియించి తపియించి నే కాచుకొంటిని
హల్లెలూయా యేసయ్యా – నిన్ను చేరాలి నేనెరిగి ఆ గువ్వలా
నీకై వెలగాలి ఆ నింగిలో తారలా…
||వేనోళ్ల
March 24, 2023

Elugethi nenu mora pettuchunnanu song lyrics telugu

 




 ఎలిగెత్తి నేను మోర పెట్టుచున్నాను 


ఏలిన వాని దేహం నే కోరుచున్నాను (2)




నిందతో నా హృదయం బ్రద్దలై పోవఁగ 


నీ సన్నిధిలో నిలిచి కన్నీరు కార్చగా (2)


నా హృదయ ఆశలన్నీ చెడిపోవగా (2)


నీ వాక్కు బాగుచేసే ప్రార్ధించుచుండగా 2


   


నీదు సహవాసంలో వెనుకంజ వేయగా 


నా దినములు ఊపిరిగా వ్యర్థమై పోయెను (2)


నీ ప్రేమ ప్రోత్సహమును రుచి చూడగా (2)


నీ పాదముల చెంత దిన దినము గడిపెదను (2)




గమనించని ప్రేమలు గాయములు చేయగా 


గాలులచే కొట్టబడి గమ్యమును మరచితిని (2)


గంబీరమైన స్వరముతో బలపరచగా 


గుండె చెదరి నా జీవితము గౌరవముగా మారెను

Wednesday, 22 March 2023

March 22, 2023

Nammakamaina devudavaina - నమ్మకమైన దేవుడవైన

 

Click on image 

నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)
ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన||

1.ఆప్తులైన వారే హాని చేయచూసినా
మిత్రులే నిలువకుండినా (2)
న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||

2.జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
నష్టమే మిగులుచుండినా (2)
శాపము బాపే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||

3.కష్ట కాలమందు గుండె జారిపోయినా
గమ్యమే తెలియకుండినా (2)
సాయము చేసే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||





March 22, 2023

లెక్కించలేని స్తోత్రముల్ - Lekkinchaleni sthotramul

Click on image 




      దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
      దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ } 2
      ఇంత వరకు నా బ్రతుకులో } 2
      నువ్వు చేసిన మేళ్ళకై|| లెక్కించలేని ||

    1. ఆకాశ మహాకాశముల్
      వాటియందున్న సర్వంబును } 2
      భూమిలో కనబడునవన్ని } 2
      ప్రభువా నిన్నే కీర్తించున్|| లెక్కించలేని ||

    2. అడవిలో నివసించువన్ని
      సుడిగాలియు మంచును } 2
      భూమిపైనున్నవన్ని } 2
      దేవా నిన్నే పొగడును|| లెక్కించలేని ||

    3. నీటిలో నివసించు ప్రాణుల్
      ఈ భువిలోన జీవ రాసులు } 2
      ఆకాశామున ఎగురునవన్ని } 2
      ప్రభువా నిన్నే కీర్తించున్|| లెక్కించలేని ||

Tuesday, 21 March 2023

March 21, 2023

Athiparishuddhuda song lyrics | అతి పరిశుద్ధుడా

 





Athiparishuddhuda song lyrics :


అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతును (2)

నీవు నా పక్షమై నను దీవించగా

నీవు నా తోడువై నను నడిపించగా

జీవింతును నీకోసమే ఆశ్రయమైన

నా యేసయ్యా   (అతి పరిశుద్ధుడా)


1.సర్వోన్నతమైన స్థలములయందు

నీ మహిమ వివరింపగా – ఉన్నతమైన

నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2)

ముందెన్నడూ చవిచూడని

సరిక్రొత్తదైన ప్రేమామృతం  (2)

నీలోనే దాచావు ఈనాటికై

నీ ఋణం తీరదు ఏనాటికి (2)   (అతి పరిశుద్ధుడా)


2.సద్గుణరాశి నీ జాడలను

నా యెదుట నుంచుకొని గడిచిన కాలం

సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)

కృపవెంబడి కృపపొందగా

మారాను మధురముగా నే పొందగా  (2)

నాలోన ఏ మంచి చూసావయ్యా

నీప్రేమ చూపితివి నా యేసయ్యా (2)  (అతి పరిశుద్ధుడా)


3. సారెపైనున్న పాత్రగ నన్ను

చేజారిపోనివ్వక

శోధనలెన్నో ఎదిరించినను

నను సోలిపోనివ్వక (2)

ఉన్నావులె ప్రతిక్షణమునా

కలిసి ఉన్నావులె ప్రతి అడుగున (2)

నీవేగా యేసయ్యా నా ఊపిరి

నీవేగా యేసయ్యా నా కాపరి (2)     || అతి పరిశుద్ధుడా ||














March 21, 2023

Nenematramu song lyrics | నేనేమాత్రము

 

Click on image 


Inthavaraku nevu nannu song lyrics :


ఇంతవరకు నీవు - నన్ను నడిపించుటకు

నేనేమాత్రము నా జీవితం ఏమాత్రము

ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు

నేనేమాత్రము మేము ఏమాత్రము


నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే

నే చూచు ఘనకార్యములు నీ దయ వలెనే


1.ఎన్నుకొంటివే నన్ను ఎందుకని

హెచ్చించితివే నన్ను ఎందుకని

మందను వెంటాడి తిరుగుచుంటినే

సింహాసనం ఎక్కించి మైమరచితివే


2.నా ఆలోచనలన్ని చిన్నవని

నీ ఆలోచనల వలనే తెలుసుకొంటిని

తాత్కాలిక సహాయము నే అడిగితిని

యుగయుగాల ప్రణాళికలతో నన్ను నింపితివె






Friday, 17 March 2023

Thursday, 16 March 2023

March 16, 2023

Ee bashakandhani song lyrics | ఏ భాషకందని భావం నీవు



Ee bashakandhani song lyrics in telugu :


ఏ భాషకందని భావం నీవు

వెలకట్టలేని ముత్యం నీవు

దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ ఋణం

ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపం

అమ్మా నిను మించిన బంధం ఏదియు లేదే

లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే


1.నవ మాసాలు నీలో నన్ను దాచావు

నా ఊపిరికి ప్రాణం పణంగా పెట్టావు

రేయి పగలంతా నాకై శ్రమపడినా

తీరని అనురాగం నీలో దాచావే

నీ సుఖ సంతోషం వదిలిన నాకై

తరగని మమకారం నీలో చూసానే

యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే

అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే

లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే


2.భయ భక్తులే ఉగ్గి పాలుగా పోసావు

దేవుని మాటలే గోరు ముద్దగా చేసావు

తప్పటడుగులే నాలో సరి చేసి

ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగా నిలిపావు

ప్రతి వేకువలో నాకై నీవు

చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే

నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే

అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే

లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే         







Wednesday, 15 March 2023

March 15, 2023

Amma kanna minna song lyrics | అమ్మ కన్న మిన్న


Amma kanna minna song lyrics : 

అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా

నాన్న కన్న మిన్న ఓ యేసయ్యా (2)

నీ ప్రేమ కొదువ లేనిది

ఆ.. ఆ.. నీ కృప అంతము కానిది (2)


ఓ తల్లి తన బిడ్డను మరచునా

వారైనా మరచినా నేను మరువను

అని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా – (2)        ||నీ ప్రేమ||





March 15, 2023

Abrahamu issaku yakobu song lyrics | అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు

 



Abrahamu issaku yakobu song lyrics :


అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు

(యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – (2)       ||అబ్రాహాము||


1.అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని

ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2)

యాకోబును ఇశ్రాయేలని దీవించి

ఈ పాపిని నీవు విడువక ప్రేమించి

నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా

నీ చేతి నీడలో జీవింతునయ్యా (2)       ||అబ్రాహాము||


2.జీవాహారము నేనే అని పలికితివి

జీవ జలముల ఓరన నను నాటితివి (2)

నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి

హృదయము నుండి జీవ జలములు పుట్టించి

నీ జీవాహారము – నీ జీవజలమును

నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును (2) ||అబ్రాహాము||




Monday, 13 March 2023

March 13, 2023

Appagimpabadina ratri song lyrics | అప్పగింపబడిన రాత్రి

 


Appagimpabadina ratri song lyrics in telugu :


అప్పగింపబడిన రాత్రి

చెప్ప సాగే శిష్యులతో (2)

చెప్పరాని దుఃఖముతో

తప్పదు నాకీ మరణమనెను (2)       ||అప్పగింప||


1.రొట్టె విరచి ప్రార్ధించి

నిట్టూర్పు విడచి ఇది నా దేహం (2)

పట్టుదలతో నేనొచ్చుఁ వరకు

ఇట్టులనే భుజించుడనెను (2)          ||అప్పగింప||


2.ద్రాక్షా రస గిన్నెను చాపి

వీక్షించుడిదియే నా రక్తం (2)

రక్షణార్థం దీని త్రాగి

మోక్ష రాజ్యం చేరుడనెను (2)          ||అప్పగింప||


3.రాతివేత దూరాన

చేతులెత్తి ప్రభు మోకరించి (2)

నా తండ్రి నీ చిత్తమైతే

ఈ పాత్రన్ తీసి వేయుమనెను (2)    ||అప్పగింప||


4.ఇదిగో వచ్చె తుది ఘడియ

హృదయ బాధ హెచ్చెను (2)

పదిలపరచు-నట్లు తండ్రిన్

మదిలో వదలక ప్రార్ధించుడనెను (2)    ||అప్పగింప||










March 13, 2023

Anudinamu aa prabuni song lyrics | అనుదినం ఆ ప్రభుని



Anudinamu aa prabuni song lyrics in telugu : 


అనుదినం ఆ ప్రభుని వరమే

అనుక్షణం ఆశ్చర్య కార్యమే

ఆనందం-తో స్వీకరించుము

అబ్బురం-తో ఆనందించుము

పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు (2)

నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును            

1.అనుదినం ఆ ప్రభుని వరమే

అనుక్షణం ఆశ్చర్య కార్యమే

ఆనందం-తో స్వీకరించుము

అబ్బురం-తో ఆనందించుము

తల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ (2)

ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును          


2.అనుదినం ఆ ప్రభుని వరమే

అనుక్షణం ఆశ్చర్య కార్యమే

ఆనందం-తో స్వీకరించుము

అబ్బురం-తో ఆనందించుము

నాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు (2)

సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు         






Sunday, 12 March 2023

Friday, 10 March 2023

Wednesday, 8 March 2023

Tuesday, 7 March 2023

March 07, 2023

సైన్స్ vs బైబిల్

👉క్రీ.శ 1978లో భూగర్భ శాస్త్రవేత్తలు భూమియొక్క అంతర్భాగములోనికి వెళ్ళే కొలది విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుందని
తెలిపారు.
👇
సుమారు క్రీ॥పూ॥ 1800, యోబు 28:5లో భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపల భాగము
అగ్నిమయమైనట్లుండును అని, భూగర్భములోని ఉష్ణతీవ్రత గురించి బైబిల్ ముందే తెలియజేసింది


👉సముద్ర జలములు సూర్యవేడిమి చేత ఆవిరిగా మారి, మేఘములుగా మారి వర్షం కురిసి నదులు, సముద్రాలు నిండుతున్నాయి అని ఇది ఒక జల చక్రం అని క్రీ.శ. 17వ శతాబ్దములో మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
👇
ఈ విషయాన్ని బైబిలు క్రీస్తు పూర్వమే తెలియజేసింది. (కీర్తనలు 135:7; ప్రసంగి 1:7; యిర్మియా 10:13; యోబు 36:28).
నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును (ప్రసంగి 1:7).
భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును. (కీర్తనలు 135:7)


👉క్రి.శ.1543లో నికోలస్ కోపర్నికస్ -భూమి కదులుతుందని అ౦తే కాదు ఇలా సూర్యుడు చుట్టూ తిరగటం వలనే కాలములు మారుతున్నాయని చెప్పాడు.
👇
సుమారు క్రి.పు.1800లో బైబిల్ లో యోబు 9.6.లో భూమిని దాని స్థలములో నుండి కదలించువాడు నేనె అన్ని వ్రాయబడింది,అంటే భూమి కదులుతుందని 3343 సంల క్రితమే దేవుడు పై విషయమును బైబిల్ లో వ్రాయబడింది. అంటే నికోలస్ కోపర్నికస్ కన్నా 2343 సంల క్రితమే దేవుడు పై విషయమును బైబిల్ లో వ్రాయి౦చాడు


👉విలియం హార్వే క్రీ.శ. 1628 లో ప్రాణం రక్తములో ఉన్నదని చెప్పాడు.
👇
క్రీ.పూ. 14వ శతాబ్ధములోనే ఈ విషయాన్ని దేవుడు మోషే ద్వారా తన గ్రంధములో వ్రాయించాడు. (ఆదికాండము 9:4,5; లేవికాండము 17:11)
లేవీయకాండము 17:11 రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.

ఆదికాండము 9:4 అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.
ఆదికాండము 9:5 మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.


👉క్రి.శ 1648లో sir Issac Newton-భూమి శూన్యములో వ్రేలడుతున్నదని చెప్పాడు.
👇
సుమారు క్రి.పూ 1800లో బైబిల్ లో యోబు:26:7లో దేవుడు శూన్యమ౦డలముపైన భూమిని వ్రేలాడచేసెను అని వ్రాయబడ౦ది.అనగా Sir Issac Newton కన్నా 3448 సంవత్సరాల క్రితమే దేవుడు పై విషయమును బైబిల్ లో వ్రాయి౦చాడు.

👉క్రీ.శ॥ 1862లో రాబర్ట్ బాయిల్ గాలికి ద్రవ్యరాశి (బరువు) ఉందని తెలిపాడు.
👇
సుమారు క్రీ.పూ॥ 1800,
యోబు28-25లో గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు అనగా, వాయువులకు ద్రవ్యరాశి ఉందని బైబిల్ ముందేతెలియజేసింది.

యోబు 28:25 గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి నప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు

👉క్రీ. శ 1522, ఫెర్డినాండ్ మాజిలాన్ - భూమి గోళాకారంగా ఉందని తెలియజేసాడు (అంతవరకు అందరూ బల్లపరుపుగాఉందనుకొనేవారు )
👇
సుమారు క్రీ.పూ. 1800 సం॥లు, యోబు 37:12లో నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద.. అనగా భూమి గోళాకారంగా ఉందని శాస్రం కన్నా ముందే బైబిల్ ఏనాడో తెలియజేసింది.

👉ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ 1901 వ సంవత్సరములో మొక్కలకు జీవం ఉంటుంది అని శాస్త్రపూర్వకంగా రుజువు చేసాడు
👇
కానీ బైబిల్ లో ముందుగానే ఈ విషయం గురుంచి ప్రస్తావించబడింది 
1కోరింథీయులకు 15:37 నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు.
1కోరింథీయులకు 15:38 అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు.
1కోరింథీయులకు 15:39 మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసమువేరు, చేప మాంసము వేరు.

👉క్రీ.శ. 1910లో మిలుటేన్, కోవిచ్ (యుగోస్లోవియా) 1990లో జాక్వెన్ లస్కర్ (అమెరికా) వీరు భూ వాతావరణములో చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పారు.
👇
క్రీ.పూ 800 సం॥ కీర్తన 104:19 లో ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించెను అని వ్రాయబడింది..

👉క్రి.శ.1905లో Thomas graham-గాలి అన్ని వైపులా వ్యాపించే గుణాన్ని కలిగి ఉన్నాదని తెలియజేసాడు
👇
బైబిల్ లో సుమారు క్రి.పూ.935లో వ్రాయబడిన ప్రసంగి.1.6లో-గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును.మరలా తిరుగుతూ తన సంచర మార్గమును వచ్చును అని వ్రాయబడింది.అంటే Thomas graham కన్నా 2840 సంవత్సరాల క్రితమే దేవుడు పై విషయమును బైబిల్ లో వ్రాయి౦చాడు..........

ప్రసంగి 1:6 గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును.

👉క్రీ.శ. 1610లో గెలీలియో టెలిస్కోపును కనుగొన్న తరువాత చంద్రునికి స్వయం ప్రకాశక శక్తి లేదని, చంద్రుడు ప్రకాశించాలంటే సూర్యకాంతి అవసరమని తెలుసుకున్నారు
👇
క్రీ॥పూ॥ 1800 సం॥ యోబు 25:5లో ఆయన దృష్టికి చంద్రుడు
కాంతిగలవాడుకాడు అనగా, స్వయం ప్రకాశక శక్తిలేదని
క్రీ॥పూ॥ 740 లో యెషయా 13:10లో - సూర్యున్ని చీకటి కమ్మును చంద్రుడు.
ప్రకాశింపడు అని వ్రాయబడింది.

👉ఈ మధ్యకాలంలో నక్షత్రములన్నీ ఒకే రకమైనవి కావు. అని బ్లూస్టార్స్, డార్క్ స్టార్స్, మ్యాగ్నెటార్స్, క్రాస్ట్యులాలు. సూపర్ నోవాలు, క్వాజార్లు, న్యూట్రాన్ స్టార్స్ గా ఇలా వివిధ రకాలుగా ఉన్నాయని తెలుసుకున్నారు.
👇
సుమారు క్రీ॥శ॥ 50, 1కొరింథ 15:41లో సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు ఇంకొక నక్షత్రమునకు భేదము కలదు. అని నక్షత్రాలు వివిధ రకాలుగా ఉన్నాయనే ఖగోళ రహస్యాన్ని బైబిల్ ఏనాడో తెలియజేసింది.



👉టెలీస్కోప్ ను కనిపెట్టకముందు మరియు కనిపెట్టిన (క్రీ.శ. 1600) తరువాత చాలా మంది నక్షత్రాలను లెక్కపెట్టడానికి ప్రయత్నించారు. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి, ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు క్రీ.శ. 20వ శతాబ్దములో నక్షత్రాలను లెక్కించలేమని విజ్ఞాన శాస్త్రవేత్తలు తెలియజేసారు.
👇
నక్షత్రాలను లెక్కించడం వీలు కాదని బైబిలు క్రీస్తు పూర్వమే తెలియజేసింది
ఆదికాండము 15:5 మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చినీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను.

యిర్మియా 33:22 ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును.


👉క్లోరోఫాం అనే మత్తు మందును కనుగొన్న శాస్త్రజ్ఞుడి పేరు జేమ్స్ సింప్సన్, ఇతను 1811 జూన్ 7న స్కాట్లాండ్ దేశములో జన్మించాడు.
ఇతను క్లోరోఫాం కనిపెట్టక ముందు ఎవరికైనా ఆపరేషన్ చెయ్యాలంటే రోగిని నలుగురు, ఐదుగురు బలవంతముగా పట్టుకొని ఆపరేషన్ చేసేవారు. రోగికి మత్తు ఇవ్వనందున, ఎక్కువ శాతం ఆపరేషన్లు విఫలం అయ్యేవి. అయితే జేమ్స్ సింప్సన్ 1847లో క్లోరోఫాం కనిపెట్టిన తరువాత వైద్య రంగంలో ఆపరేషన్లు (శస్త్ర చికిత్స) చెయ్యడం సులభం అయింది.
ఇంత గొప్ప మందుని కనిపెట్టిన ఈయనకు సన్మానం చేస్తుండగా, కొందరు వ్యక్తులు జేమ్స్ సింప్సన్ గారు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? దీనిని మీరు ఎలా కనిపెట్టగలిగారు? అని అడిగారు. దానికి జేమ్స్ సింప్సన్ ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరచినది.
నేను బాల్యం నుండి దైవ భయం, భక్తి కలిగిన వాడను గనుక ప్రతి రోజు బైబిలు చదువుట వాడుక. బైబిలు చదువుట, ప్రార్థన లేకుండా నేను ఏ పని చెయ్యను. అదే విధముగా ఒక రోజు ఆదికాండం చదువుచుండగా దేవుడు ఆదాముకు చేసిన ఆపరేషన్ గురించి చదివాను.
అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. (ఆదికాండము 2:21)
ఈ మాటలు చదివినప్పుడు నాలో ఒక ఆలోచన పుట్టింది. దేవుడు ఆదాముకు చేసిన ఆపరేషన్లో మొదటిగా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసాడు, గనుక ఆపరేషన్ చేయవలసిన రోగికి ముందుగా గాఢ నిద్ర కలుగజేయాలి. అలా గాఢ నిద్ర కలుగజేయడానికి ఏదైనా మందు కనుగొంటే వైద్య రంగంలో ఆపరేషన్ సులభం అవుతుంది అని ఆలోచించి కొన్ని మూలికల ద్వారా క్లోరోఫాం అను మత్తు మందును కనిపెట్టాను.
నేను క్లోరోఫాంను కనిపెట్టుటకు ప్రధమ కారణం “పరిశుద్ధ గ్రంధము” చదువుటయే. బైబిలు నేను చదవకపోయి ఉంటే, క్లోరోఫాం కనిపెట్టే వాడిని కాదు అని చెప్పాడు.


👉ఈరోజు అంతర్జాతీయ మార్కెట్టులో అతి ప్రధానమైన వస్తువుగా ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలను శాసించే విలువైన వాణిజ్య సంపదగా పెట్రోలియం చెలామణి అవుతున్నది. ఇలాంటి పెట్రోలియం చమురు నిక్షేపాలు భూగర్భంలో ఎక్కడ ఎలా దొరుకుతాయో బైబిల్ లో ముందే వ్రాయబడింది.
సుమారు క్రీ॥పూ॥ 1845, ద్వితీ. శాం. 33.19 ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పిల్చుదురు. ద్వితి.కాం. 32:13 చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జురించెదను. లాటిన్ భాషలో పెట్రో అనగా బండ అని ఓలియమ్ అనగా నూనె అని అర్ధం. దీనినే ఆంగ్లములో రాక్ అయిల్ అనగా బండ నుండి తీయబడిన నూనె అందురు. వ్రాయబడి వాక్యమును విశ్లేషిస్తే ఈరోజు ఇసుకతో నిండిన ఎడారి ప్రాంతములో భూమియొక్క అంతర్భాగములో కొన్ని వందల మీటర్ల దిగువన చెకుముకి రాతి పొరల మధ్యన చమురు నిక్షేపాలు ఉన్నాయి. వీటిని పైపులు వేసి పైకి తీస్తున్నారు

ద్వితియోపదేశకాండము 33:19 వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలుల నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుదురు.

ద్వితియోపదేశకాండము 32:13 భూమియొక్క ఉన్నతస్థలములమీద వాని నెక్కిం చెను పొలముల పంట వానికి తినిపించెను కొండబండనుండి తేనెను చెకుముకి రాతిబండనుండి నూనెను అతనికి జుఱ్ఱించెను.


Thursday, 2 March 2023

March 02, 2023

Anyajanulu lechi | అన్యజనులేల లేచి


అన్యజనులేల లేచి

గల్లత్తు చేయు-చున్నారు – అన్యజనులేల

జనములేల వ్యర్థమైన

దాని తలంచుచున్నవి (2)           ||అన్యజనులేల||


1.భూలోక రాజులు లేచి

వారేకముగా ఆలోచించి – భూలోక రాజులు

వారి పాశములను తెంపి

పారవేయుద మనుచున్నారు (2)           ||అన్యజనులేల||


2.ఆకాశ వాసుండు వారిని

అపహసించుచున్నాడు నవ్వి – ఆకాశ వాసుండు

వారలతో పల్కి కోపముతో

వారిని తల్లడిల్ల చేయును (2)           ||అన్యజనులేల||


3.పరిశుద్ధమైన నాదు

పర్వతమగు సీయోను మీద – పరిశుద్ధమైన

నారాజు నాసీనునిగా జేసి

యున్నానని సెలవిచ్చెను (2)           ||అన్యజనులేల||


4.కట్టడ వివరింతు నాకు

యిట్లు చెప్పెను యెహోవాయందు – కట్టడ వివరింతు

నీవు నా కుమారుడవు

నిన్ను నేను కనియున్నాను (2)           ||అన్యజనులేల||


5.నన్ను అడుగుము నీకు

జనముల భూమిని స్వాస్థ్యముగా – నన్ను అడుగుము

దిగంతముల వరకు

స్వాస్థ్యముగా నొసంగెదను నీకు (2)           ||అన్యజనులేల||


6.ఇనుప దండముతో నీవు

వారిని నలుగగొట్టెదవు – ఇనుప దండముతో

కుండను పగులగొట్టునట్లు

వారిని పగులగొట్టెదవు (2)           ||అన్యజనులేల||


7.ఓ రాజులారా మీరు

జ్ఞానవంతులై యుండుడి – ఓ రాజులారా

ఓ భూపతులారా మీరు

నాభోద నొందుడి నేడే (2)           ||అన్యజనులేల||


 

March 02, 2023

Uruko na pranama song lyrics | ఊరుకో నా ప్రాణమా




Uruko na pranama song lyrics in telugu :


ఊరుకో నా ప్రాణమా కలత చెందకు

ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా (2)


ఎడారి దారిలోన‌‌‌ – కన్నీటి లోయలోన (2)

నా పక్ష‌మందు నిలిచే నా ముందురే నడిచే

నీ శక్తినే చాట నన్నుంచెనే చోట‌

నిన్నెరుగుటే మా ధనం

ఆరాధనే మా ఆయుధం


1.ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుచున్నా

ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా (2)

నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా

నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా (2)        ||ఊరుకో||


2.ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు

అన్యాయము చేయుట అసంభవమేగా (2)

వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు

దుష్కార్యము చేయుట అసంభవమేగా (2)    ||ఊరుకో||


3.అవరోధాలెన్నో నా చుట్టు అలుముకున్నా

అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా (2)

యెహోవా సెలవిచ్చిన ఒక్కమాటయైనను

చరిత్రలో ఎన్నటికీ తప్పియుండలేదుగా (2)     ||ఊరుకో||



















Wednesday, 1 March 2023