ఎలిగెత్తి నేను మోర పెట్టుచున్నాను
ఏలిన వాని దేహం నే కోరుచున్నాను (2)
నిందతో నా హృదయం బ్రద్దలై పోవఁగ
నీ సన్నిధిలో నిలిచి కన్నీరు కార్చగా (2)
నా హృదయ ఆశలన్నీ చెడిపోవగా (2)
నీ వాక్కు బాగుచేసే ప్రార్ధించుచుండగా 2
నీదు సహవాసంలో వెనుకంజ వేయగా
నా దినములు ఊపిరిగా వ్యర్థమై పోయెను (2)
నీ ప్రేమ ప్రోత్సహమును రుచి చూడగా (2)
నీ పాదముల చెంత దిన దినము గడిపెదను (2)
గమనించని ప్రేమలు గాయములు చేయగా
గాలులచే కొట్టబడి గమ్యమును మరచితిని (2)
గంబీరమైన స్వరముతో బలపరచగా
గుండె చెదరి నా జీవితము గౌరవముగా మారెను
No comments:
Post a Comment