![]() |
Click on image |
వేనోళ్ళ కొనియాడిన – నా ఆశయే తీరదే
నిన్నెంత ఘనపరచినా – నా హృదయమే నిండదే
నజరేయుడా యేసయ్యా – నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగానా స్థితి మార్చినది స్తోత్ర నిధియేగదా ||వేనోళ్ల||
1.ఎన్నికలేని నను ప్రేమించి లోకము నుండి నను వేరుపరచి
నీ సన్నిధిలో నీ కౌగిలిలో – నిత్యము నిలువగ పిలిచావు
మలిన బ్రతుకును నూతన పరచి – పరిమళ సువాసనగ |
నను మార్చినావు
హల్లెలూయా యేసయ్యా – పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా
మది గెలిచావు (జతకలిశావు) లోకాన్ని మరిచేంతలా||వేనోళ్ల॥
2. ఊహకు మించిన కార్యము చేసి – ఉన్నత కృపలో నను దాచినావు
గమ్యమే తెలియని ఈ పయనములో – నా గురి నీవై నిలిచావు
సర్వోన్నతుడా నీ సముఖములో – నను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు
హల్లెలూయా యేసయ్యా – కురిపించావు నీ చూపులో వెన్నెల
పలికించావు నీ ప్రేమరాగాలిలా||వేనోళ్ల||
3. తేజోవాసుల స్వాస్వములోన – నన్ను చేర్చగ కోరిక కలిగి |
దూతలగణముతో మేఘముపైన – త్వరలో రానైయున్నావు,
రాజుల రాజా నీ రాకడనే – స్మరియించి తపియించి నే కాచుకొంటిని
హల్లెలూయా యేసయ్యా – నిన్ను చేరాలి నేనెరిగి ఆ గువ్వలా
నీకై వెలగాలి ఆ నింగిలో తారలా…
||వేనోళ్ల

No comments:
Post a Comment