Breaking

Wednesday, 29 March 2023

Arunakanthi kiranamai song lyrics | అరుణ కాంతి కిరణమై

 



అరుణ కాంతి కిరణమై

కరుణ చూప ధరణిపై

నరుని రూపు దాల్చెను

పరమ దేవ తనయుడు

అదే అదే క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్

ఇదే ఇదే క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్     ||అరుణ||


1.యజ్ఞ యాగాదులు – బలి కర్మకాండలు (2)

దోషంబులు కడుగలేవు

దోషుల రక్షింప లేవు (2)

పరిశుద్ధుని రక్తమునందే

పాపులకిల ముక్తి కలుగును

అందుకే.. అందుకే         ||అరుణ||


2.పుణ్య కార్యములు – మరి తీర్థయాత్రలు (2)

దోషంబులు కడుగలేవు

దోషుల రక్షింప లేవు (2)

పరిశుద్ధుని రక్తమునందే

పాపులకిల ముక్తి కలుగును

అందుకే.. అందుకే      ||అరుణ||



No comments:

Post a Comment