Breaking

Thursday, 2 March 2023

Anyajanulu lechi | అన్యజనులేల లేచి


అన్యజనులేల లేచి

గల్లత్తు చేయు-చున్నారు – అన్యజనులేల

జనములేల వ్యర్థమైన

దాని తలంచుచున్నవి (2)           ||అన్యజనులేల||


1.భూలోక రాజులు లేచి

వారేకముగా ఆలోచించి – భూలోక రాజులు

వారి పాశములను తెంపి

పారవేయుద మనుచున్నారు (2)           ||అన్యజనులేల||


2.ఆకాశ వాసుండు వారిని

అపహసించుచున్నాడు నవ్వి – ఆకాశ వాసుండు

వారలతో పల్కి కోపముతో

వారిని తల్లడిల్ల చేయును (2)           ||అన్యజనులేల||


3.పరిశుద్ధమైన నాదు

పర్వతమగు సీయోను మీద – పరిశుద్ధమైన

నారాజు నాసీనునిగా జేసి

యున్నానని సెలవిచ్చెను (2)           ||అన్యజనులేల||


4.కట్టడ వివరింతు నాకు

యిట్లు చెప్పెను యెహోవాయందు – కట్టడ వివరింతు

నీవు నా కుమారుడవు

నిన్ను నేను కనియున్నాను (2)           ||అన్యజనులేల||


5.నన్ను అడుగుము నీకు

జనముల భూమిని స్వాస్థ్యముగా – నన్ను అడుగుము

దిగంతముల వరకు

స్వాస్థ్యముగా నొసంగెదను నీకు (2)           ||అన్యజనులేల||


6.ఇనుప దండముతో నీవు

వారిని నలుగగొట్టెదవు – ఇనుప దండముతో

కుండను పగులగొట్టునట్లు

వారిని పగులగొట్టెదవు (2)           ||అన్యజనులేల||


7.ఓ రాజులారా మీరు

జ్ఞానవంతులై యుండుడి – ఓ రాజులారా

ఓ భూపతులారా మీరు

నాభోద నొందుడి నేడే (2)           ||అన్యజనులేల||


 

No comments:

Post a Comment