Breaking

Tuesday, 7 March 2023

సైన్స్ vs బైబిల్

👉క్రీ.శ 1978లో భూగర్భ శాస్త్రవేత్తలు భూమియొక్క అంతర్భాగములోనికి వెళ్ళే కొలది విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుందని
తెలిపారు.
👇
సుమారు క్రీ॥పూ॥ 1800, యోబు 28:5లో భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపల భాగము
అగ్నిమయమైనట్లుండును అని, భూగర్భములోని ఉష్ణతీవ్రత గురించి బైబిల్ ముందే తెలియజేసింది


👉సముద్ర జలములు సూర్యవేడిమి చేత ఆవిరిగా మారి, మేఘములుగా మారి వర్షం కురిసి నదులు, సముద్రాలు నిండుతున్నాయి అని ఇది ఒక జల చక్రం అని క్రీ.శ. 17వ శతాబ్దములో మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
👇
ఈ విషయాన్ని బైబిలు క్రీస్తు పూర్వమే తెలియజేసింది. (కీర్తనలు 135:7; ప్రసంగి 1:7; యిర్మియా 10:13; యోబు 36:28).
నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును (ప్రసంగి 1:7).
భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును. (కీర్తనలు 135:7)


👉క్రి.శ.1543లో నికోలస్ కోపర్నికస్ -భూమి కదులుతుందని అ౦తే కాదు ఇలా సూర్యుడు చుట్టూ తిరగటం వలనే కాలములు మారుతున్నాయని చెప్పాడు.
👇
సుమారు క్రి.పు.1800లో బైబిల్ లో యోబు 9.6.లో భూమిని దాని స్థలములో నుండి కదలించువాడు నేనె అన్ని వ్రాయబడింది,అంటే భూమి కదులుతుందని 3343 సంల క్రితమే దేవుడు పై విషయమును బైబిల్ లో వ్రాయబడింది. అంటే నికోలస్ కోపర్నికస్ కన్నా 2343 సంల క్రితమే దేవుడు పై విషయమును బైబిల్ లో వ్రాయి౦చాడు


👉విలియం హార్వే క్రీ.శ. 1628 లో ప్రాణం రక్తములో ఉన్నదని చెప్పాడు.
👇
క్రీ.పూ. 14వ శతాబ్ధములోనే ఈ విషయాన్ని దేవుడు మోషే ద్వారా తన గ్రంధములో వ్రాయించాడు. (ఆదికాండము 9:4,5; లేవికాండము 17:11)
లేవీయకాండము 17:11 రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.

ఆదికాండము 9:4 అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.
ఆదికాండము 9:5 మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.


👉క్రి.శ 1648లో sir Issac Newton-భూమి శూన్యములో వ్రేలడుతున్నదని చెప్పాడు.
👇
సుమారు క్రి.పూ 1800లో బైబిల్ లో యోబు:26:7లో దేవుడు శూన్యమ౦డలముపైన భూమిని వ్రేలాడచేసెను అని వ్రాయబడ౦ది.అనగా Sir Issac Newton కన్నా 3448 సంవత్సరాల క్రితమే దేవుడు పై విషయమును బైబిల్ లో వ్రాయి౦చాడు.

👉క్రీ.శ॥ 1862లో రాబర్ట్ బాయిల్ గాలికి ద్రవ్యరాశి (బరువు) ఉందని తెలిపాడు.
👇
సుమారు క్రీ.పూ॥ 1800,
యోబు28-25లో గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు అనగా, వాయువులకు ద్రవ్యరాశి ఉందని బైబిల్ ముందేతెలియజేసింది.

యోబు 28:25 గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి నప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు

👉క్రీ. శ 1522, ఫెర్డినాండ్ మాజిలాన్ - భూమి గోళాకారంగా ఉందని తెలియజేసాడు (అంతవరకు అందరూ బల్లపరుపుగాఉందనుకొనేవారు )
👇
సుమారు క్రీ.పూ. 1800 సం॥లు, యోబు 37:12లో నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద.. అనగా భూమి గోళాకారంగా ఉందని శాస్రం కన్నా ముందే బైబిల్ ఏనాడో తెలియజేసింది.

👉ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ 1901 వ సంవత్సరములో మొక్కలకు జీవం ఉంటుంది అని శాస్త్రపూర్వకంగా రుజువు చేసాడు
👇
కానీ బైబిల్ లో ముందుగానే ఈ విషయం గురుంచి ప్రస్తావించబడింది 
1కోరింథీయులకు 15:37 నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు.
1కోరింథీయులకు 15:38 అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు.
1కోరింథీయులకు 15:39 మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసమువేరు, చేప మాంసము వేరు.

👉క్రీ.శ. 1910లో మిలుటేన్, కోవిచ్ (యుగోస్లోవియా) 1990లో జాక్వెన్ లస్కర్ (అమెరికా) వీరు భూ వాతావరణములో చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పారు.
👇
క్రీ.పూ 800 సం॥ కీర్తన 104:19 లో ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించెను అని వ్రాయబడింది..

👉క్రి.శ.1905లో Thomas graham-గాలి అన్ని వైపులా వ్యాపించే గుణాన్ని కలిగి ఉన్నాదని తెలియజేసాడు
👇
బైబిల్ లో సుమారు క్రి.పూ.935లో వ్రాయబడిన ప్రసంగి.1.6లో-గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును.మరలా తిరుగుతూ తన సంచర మార్గమును వచ్చును అని వ్రాయబడింది.అంటే Thomas graham కన్నా 2840 సంవత్సరాల క్రితమే దేవుడు పై విషయమును బైబిల్ లో వ్రాయి౦చాడు..........

ప్రసంగి 1:6 గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును.

👉క్రీ.శ. 1610లో గెలీలియో టెలిస్కోపును కనుగొన్న తరువాత చంద్రునికి స్వయం ప్రకాశక శక్తి లేదని, చంద్రుడు ప్రకాశించాలంటే సూర్యకాంతి అవసరమని తెలుసుకున్నారు
👇
క్రీ॥పూ॥ 1800 సం॥ యోబు 25:5లో ఆయన దృష్టికి చంద్రుడు
కాంతిగలవాడుకాడు అనగా, స్వయం ప్రకాశక శక్తిలేదని
క్రీ॥పూ॥ 740 లో యెషయా 13:10లో - సూర్యున్ని చీకటి కమ్మును చంద్రుడు.
ప్రకాశింపడు అని వ్రాయబడింది.

👉ఈ మధ్యకాలంలో నక్షత్రములన్నీ ఒకే రకమైనవి కావు. అని బ్లూస్టార్స్, డార్క్ స్టార్స్, మ్యాగ్నెటార్స్, క్రాస్ట్యులాలు. సూపర్ నోవాలు, క్వాజార్లు, న్యూట్రాన్ స్టార్స్ గా ఇలా వివిధ రకాలుగా ఉన్నాయని తెలుసుకున్నారు.
👇
సుమారు క్రీ॥శ॥ 50, 1కొరింథ 15:41లో సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు ఇంకొక నక్షత్రమునకు భేదము కలదు. అని నక్షత్రాలు వివిధ రకాలుగా ఉన్నాయనే ఖగోళ రహస్యాన్ని బైబిల్ ఏనాడో తెలియజేసింది.



👉టెలీస్కోప్ ను కనిపెట్టకముందు మరియు కనిపెట్టిన (క్రీ.శ. 1600) తరువాత చాలా మంది నక్షత్రాలను లెక్కపెట్టడానికి ప్రయత్నించారు. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి, ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు క్రీ.శ. 20వ శతాబ్దములో నక్షత్రాలను లెక్కించలేమని విజ్ఞాన శాస్త్రవేత్తలు తెలియజేసారు.
👇
నక్షత్రాలను లెక్కించడం వీలు కాదని బైబిలు క్రీస్తు పూర్వమే తెలియజేసింది
ఆదికాండము 15:5 మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చినీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను.

యిర్మియా 33:22 ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును.


👉క్లోరోఫాం అనే మత్తు మందును కనుగొన్న శాస్త్రజ్ఞుడి పేరు జేమ్స్ సింప్సన్, ఇతను 1811 జూన్ 7న స్కాట్లాండ్ దేశములో జన్మించాడు.
ఇతను క్లోరోఫాం కనిపెట్టక ముందు ఎవరికైనా ఆపరేషన్ చెయ్యాలంటే రోగిని నలుగురు, ఐదుగురు బలవంతముగా పట్టుకొని ఆపరేషన్ చేసేవారు. రోగికి మత్తు ఇవ్వనందున, ఎక్కువ శాతం ఆపరేషన్లు విఫలం అయ్యేవి. అయితే జేమ్స్ సింప్సన్ 1847లో క్లోరోఫాం కనిపెట్టిన తరువాత వైద్య రంగంలో ఆపరేషన్లు (శస్త్ర చికిత్స) చెయ్యడం సులభం అయింది.
ఇంత గొప్ప మందుని కనిపెట్టిన ఈయనకు సన్మానం చేస్తుండగా, కొందరు వ్యక్తులు జేమ్స్ సింప్సన్ గారు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? దీనిని మీరు ఎలా కనిపెట్టగలిగారు? అని అడిగారు. దానికి జేమ్స్ సింప్సన్ ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరచినది.
నేను బాల్యం నుండి దైవ భయం, భక్తి కలిగిన వాడను గనుక ప్రతి రోజు బైబిలు చదువుట వాడుక. బైబిలు చదువుట, ప్రార్థన లేకుండా నేను ఏ పని చెయ్యను. అదే విధముగా ఒక రోజు ఆదికాండం చదువుచుండగా దేవుడు ఆదాముకు చేసిన ఆపరేషన్ గురించి చదివాను.
అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. (ఆదికాండము 2:21)
ఈ మాటలు చదివినప్పుడు నాలో ఒక ఆలోచన పుట్టింది. దేవుడు ఆదాముకు చేసిన ఆపరేషన్లో మొదటిగా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసాడు, గనుక ఆపరేషన్ చేయవలసిన రోగికి ముందుగా గాఢ నిద్ర కలుగజేయాలి. అలా గాఢ నిద్ర కలుగజేయడానికి ఏదైనా మందు కనుగొంటే వైద్య రంగంలో ఆపరేషన్ సులభం అవుతుంది అని ఆలోచించి కొన్ని మూలికల ద్వారా క్లోరోఫాం అను మత్తు మందును కనిపెట్టాను.
నేను క్లోరోఫాంను కనిపెట్టుటకు ప్రధమ కారణం “పరిశుద్ధ గ్రంధము” చదువుటయే. బైబిలు నేను చదవకపోయి ఉంటే, క్లోరోఫాం కనిపెట్టే వాడిని కాదు అని చెప్పాడు.


👉ఈరోజు అంతర్జాతీయ మార్కెట్టులో అతి ప్రధానమైన వస్తువుగా ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలను శాసించే విలువైన వాణిజ్య సంపదగా పెట్రోలియం చెలామణి అవుతున్నది. ఇలాంటి పెట్రోలియం చమురు నిక్షేపాలు భూగర్భంలో ఎక్కడ ఎలా దొరుకుతాయో బైబిల్ లో ముందే వ్రాయబడింది.
సుమారు క్రీ॥పూ॥ 1845, ద్వితీ. శాం. 33.19 ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పిల్చుదురు. ద్వితి.కాం. 32:13 చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జురించెదను. లాటిన్ భాషలో పెట్రో అనగా బండ అని ఓలియమ్ అనగా నూనె అని అర్ధం. దీనినే ఆంగ్లములో రాక్ అయిల్ అనగా బండ నుండి తీయబడిన నూనె అందురు. వ్రాయబడి వాక్యమును విశ్లేషిస్తే ఈరోజు ఇసుకతో నిండిన ఎడారి ప్రాంతములో భూమియొక్క అంతర్భాగములో కొన్ని వందల మీటర్ల దిగువన చెకుముకి రాతి పొరల మధ్యన చమురు నిక్షేపాలు ఉన్నాయి. వీటిని పైపులు వేసి పైకి తీస్తున్నారు

ద్వితియోపదేశకాండము 33:19 వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలుల నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుదురు.

ద్వితియోపదేశకాండము 32:13 భూమియొక్క ఉన్నతస్థలములమీద వాని నెక్కిం చెను పొలముల పంట వానికి తినిపించెను కొండబండనుండి తేనెను చెకుముకి రాతిబండనుండి నూనెను అతనికి జుఱ్ఱించెను.


No comments:

Post a Comment