పేరు:
యూదులు ఈ పుస్తకాన్ని మొదటి వచనాన్నిబట్టి “మాటలు ఇవి” లేదా కేవలం “మాటలు” అని పిలిచేవారు. ఆదికాండం పరిచయం చూడండి.
రచయిత, వ్రాసిన కాలం:
ఆదికాండం పరిచయం చూడండి.
ముఖ్యాంశం:
ఇది జ్ఞాపకాల పుస్తకం (1:3; 4:9-10, 23, 31; 5:15; 6:12; 7:18; 8:2, 11, 14, 18, 19; 9:7; 11:2; 15:15; 16:3; 24:9; 25:19). పర్వతం మీద దేవుడిచ్చిన ధర్మశాస్త్రం గురించి మళ్ళీ చెప్పడం, ఇస్రాయేల్‌తో దేవుని ఒడంబడికను మళ్ళీ స్థిరపరచడం, ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలూ బాధ్యతలూ తేటగా, పూర్తిగా రాసి ఉన్నాయి. ప్రత్యేకంగా దేవుడు తనకూ ఇస్రాయేల్‌కూ మధ్య ఉన్న ప్రేమ బంధం గురించి నొక్కి చెప్తున్నాడు (4:37; 6:5; 7:8, 13; 10:12, 15; 19:9; 30:6, 16, 19, 20; 33:3). విగ్రహపూజ విషయంలో ఇస్రాయేల్‌కు ఉన్న బలహీనతను తెలిసిన దేవుడు వారిని చాలా బలమైన మాటలతో హెచ్చరిస్తూ విగ్రహాలనుంచీ ఇతర దేవుళ్ళనుంచీ దూరంగా ఉండాలని చెప్తున్నాడు (6:14-15; 7:4; 8:19-20; 11:16; 13:1-18; 17:2-7; 27:15; 29:17-18; 30:17-18)
విషయసూచిక
సీనాయి పర్వతం నుంచి కనాను సరిహద్దుల వరకు ఇస్రాయేల్‌వారు సాగించిన
ప్రయాణాల సంక్షిప్త చరిత్ర 1:6—3:29
దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని ఇస్రాయేల్‌కు మోషే ఇచ్చిన ప్రోత్సాహం 4:1-24
కనానులో ఏమి జరగవచ్చునో దాని గురించిన హెచ్చరికలు 4:25-31
యెహోవా ఒక్కడే నిజమైన దేవుడు 4:32-40
యొర్దాను తూర్పున ఉన్న శరణు పట్టణాలు 4:41-43
పది ఆజ్ఞలు 5:1-33
ఆజ్ఞలన్నింటిలోకీ గొప్పది 6:5
దేవుని ఆజ్ఞలను పాటించడం విషయంలో ప్రోత్సహించడం 6:6-25
కనానునుంచి ఇతర జనాలను పారదోలడం 7:1-6
దేవుడు ఇస్రాయేల్‌జనాన్ని ఎందుకు ఎన్నుకొన్నాడు 7:7-11
విధేయతవల్ల వచ్చే దీవెనలు 7:12-15
కనానుప్రజలను తరిమివేయగల శక్తి దేవుడు వారికిస్తాననడం 7:16-26
దేవుణ్ణి, ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం ఉంచుకోమని ప్రోత్సహించడం 8:1-20
దేవుడు కనానును ఇస్రాయేల్‌కు ఎందుకు ఇస్తున్నాడు 9:1-6
బంగారు దూడ 9:7-29
ఇస్రాయేల్ విధి 10:12—11:32
బలులు అర్పించడం కోసం ఒకే ఒక స్థలం 12:1-32
విగ్రహపూజకు శిక్ష 13:1-18
శుద్ధమైనవి, అశుద్ధమైనవి 14:1-21
పదో వంతులు 14:22-29
అప్పులు రద్దుచేయడం 15:1-11
పనివారిని, బానిసలను స్వతంత్రులుగా చేయడం 15:12-18
ఏటేటా జరిగే సాంవత్సరిక పండుగలు 16:1-17
న్యాయాధిపతుల నియామకం 16:18-20
సూర్యచంద్ర నక్షత్రాదులను లేక ఇతర దేవుళ్ళను పూజించినందువల్ల వచ్చే శిక్ష 17:2-7
న్యాయాలయాలు 17:8-13
రాజును ఎన్నుకోవడం 17:14-20
దేవుని సేవకులకు కానుకలు 18:1-8
దేవునికి అసహ్యమైన పనులు 18:9-13
రాబోయే గొప్ప ప్రవక్త 18:14-22
శరణు పట్టణాలు 19:1-14
ధర్మశాస్త్ర సారం 19:21
యుద్ధాన్ని గురించి 20:1-20
అంతుతెలియని హత్య 21:1-9
బందీలయిన స్త్రీలు 21:10-14
జ్యేష్ఠుడి హక్కులు 21:15-17
తిరుగుబాటు చేసిన కొడుకుకు శిక్ష 21:18-21
వివిధ నియమాలూ, చట్టాలూ 21:22—22:12
స్త్రీ పురుషుల మధ్య ఉన్న సరైన సంబంధాన్ని ఉల్లంఘించడం 22:13-30
పౌరత్వం హక్కు 23:1-8
వివిధ రకాలయిన నియమాలూ చట్టాలూ 23:9—25:19
విడాకులివ్వడం 24:1-4
పేదలపై కనికరం 24:12-22
విధవరాండ్రకు మళ్ళీ పెళ్ళిచేసే విషయం 25:5-10
మొదటి పంటలు, పదోవంతులు 26:1-15
పాపుల పై వచ్చే శాపాలు 27:14-26
విధేయతకు వచ్చే దీవెనలు 28:1-14
అవిధేయతకు వచ్చే శాపాలు 28:15-19
రాబోయే తీర్పును గురించి భయంకరమైన హెచ్చరికలు 28:20-68
ఒడంబడిక స్థిరపరచడం 29:1-18
దేవుని ఒడంబడికను అనుసరించనివారికి శిక్ష 29:19-29
శిక్ష తరువాత కలిగే మంచివాటిని గురించిన వాగ్దానాలు 30:1-10
ఇస్రాయేల్‌కు క్రొత్త నాయకుడైన యెహోషువ 31:1-8
జీవాన్ని లేక మరణాన్ని కోరడం 30:11-20
దేవుని ధర్మశాస్త్రం చదవడం 31:9-13
మోషే పాట 32:1-43
దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరించవలసిన ప్రాముఖ్యత 32:44-47
దేవుడు మోషేకు అతని మరణం గురించి చెప్పడం 32:48-52
గోత్రాల గురించి మోషే పలికిన దీవెనలు 33:1-29
మోషే మరణం, అతని గురించిన పదాలు 34:1-12
No comments:
Post a Comment