పేరు:
మూల భాషయైన హీబ్రూలో రాసిన పాత నిబంధన గ్రంథ వ్రాత ప్రతులలో పుస్తకాలకు పేర్లు ఉండేవి కావు. యూదులు (దేవుడు వారికి తన వాక్కు ఇచ్చాడు గదా) సాధారణంగా ప్రతి పుస్తకంలో మొదటి వచనంలోని మొదటి ఒకటి లేక రెండు మాటలను ఆ పుస్తకం పేరుగా పిలుచుకునేవారు. హీబ్రూలో ఆదికాండంలోని మొదటి పదం “ఆదిలో” అని అర్థమిచ్చే పదం కాబట్టి యూదులు ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టారు. తరువాత కొన్ని శతాబ్దాలకు హీబ్రూ పండితులు పాత నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలో తర్జుమా చేసి ప్రతి పుస్తకానికి పేరు పెట్టారు. ఈ తర్జుమాను “సెప్టుయజింట్” అంటారు. చాలాకాలం తరువాత ఈ పేర్లు బైబిలు యొక్క లాటిన్ తర్జుమాలోకి వచ్చాయి. ఇంకా కొన్ని శతాబ్దాల తరువాత ఈ పేర్లను బైబిలు యొక్క ఇంగ్లీషు తర్జుమాలో వాడారు. ఈ విధంగానే ఈ పేర్లు తెలుగు బైబిల్లో కూడా వాడడం జరిగింది. అంతేగాని దేవుని ప్రేరేపణవల్ల ఈ పేర్లు రాలేదు.
రచయిత:
మోషే. బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు మోషే రాశాడని యూదుల గట్టి నమ్మకం. ఈ నమ్మకాన్ని దృఢపరచడానికి బైబిల్లోనే గట్టి సాక్ష్యాధారాలున్నాయి. నిర్గమ 17:14; 24:4; 34:27; సంఖ్యా 33:2; ద్వితీ 31:19, 24-26; యెహో 1:8; 8:31; 1 రాజులు 2:3; లూకా 24:44; 1 కొరింతు 9:9 చూడండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ నమ్మకంతో ఏకీభవిస్తూ మోషే తనగురించి రాశాడని అన్నాడు. మత్తయి 19:8; యోహాను 5:46-47; 7:19 చూడండి.
వ్రాసిన కాలం:
బహుశా క్రీ.పూ. 1446-1406 మధ్యకాలంలో.
ముఖ్యాంశం:
ఆరంభాలు. ఇక్కడ ఉన్నది దేవుడు తనను తాను వెల్లడి చేసుకోవడం గురించిన ఆరంభం, ప్రపంచ ప్రారంభం, మానవజాతి, పాపం, పాప విమోచనకోసం దేవుని పద్ధతి, వివిధ జాతుల ఆరంభాలు, దేవుడు తన వాక్కును అందించిన ఇస్రాయేల్ ప్రజల ఆరంభం.
విషయసూచిక:
ఆకాశాలు భూమిని సృజించడం 1:1-31
సృష్టిని గురించిన మరింత సమాచారం 2:1-25
మనిషి పాపంలో పడడం, దాని ఫలితం 3:1-24
కయీను, హేబెలు 4:1-18
కయీను సంతతివాళ్ళ గుణము 4:19-24
మొదటి ప్రజల వంశావళి 5:1-32
నోవహు, ఓడ, జలప్రళయం 6:1—8:22
నోవహుతో దేవుని నిబంధన 9:1-17
వివిధ దేశాల ప్రారంభం 9:18—10:32
బాబెలు గోపురం 11:1-9
మరిన్ని వంశావళులు 11:10-32
అబ్రాహాము దేవుని పిలుపును శిరసావహించడం 12:1-9
ఈజిప్ట్‌లో అబ్రాహాము 12:10-20
లోత్, అబ్రాహాము విడిపోవడం 13:1-18
అబ్రాహాము, లోత్‌ను రక్షించడం 14:1-17
అబ్రాహాము, మెల్కీసెదెకు 14:18-20
అబ్రాహాముకు దేవుని వాగ్దానాలు 15:1-19
ఇష్మాయేల్ పుట్టుక 16:1-15
సున్నతి సంస్కారం గురించిన ఆజ్ఞ 17:1-14
ఇస్సాకును గురించిన వాగ్దానం 17:15-19
అబ్రాహాము ముగ్గురు అతిధులు 18:1-15
అబ్రాహాము సొదొమ గురించి ప్రార్థించడం 18:16-33
సొదొమ నాశనం 19:1-29
లోత్, అతని కుమార్తెలు 19:30-38
అబ్రాహాము, అబీమెలెకు 20:1-18
ఇస్సాకు పుట్టుక, ఇష్మాయేల్ వీడ్కోలు 21:1-21
ఇస్సాకు గురించి దేవుడు అబ్రాహామును పరీక్షించడం 22:1-19
శారా మరణం, భూస్థాపన 23:1-20
ఇస్సాకుకోసం పెండ్లి కూతురు 24:1-67
అబ్రాహాము చనిపోవడం 25:1-11
ఇష్మాయేల్ సంతానం 25:12-18
యాకోబు, ఏశావుల పుట్టుక 25:19-26
ఏశావు తనజన్మహక్కును యాకోబుకు అమ్మడం 25:27-34
ఇస్సాకు, అబీమెలెకు 26:1-33
యాకోబు ఇస్సాకును మోసంచేసి అతని దీవెనలు పొందడం 27:1-29
ఏశావుకు నష్టం, అతని కోపం 27:30-45
యాకోబు లాబాను దగ్గరకు పారిపోవడం 28:1-22
యాకోబుకు వచ్చిన నిచ్చెన కల 28:10-22
యాకోబు భార్యలూ, పిల్లలూ 29:1—30:24
యాకోబు, లాబాను – ఇద్దరు మోసగాళ్ళు 30:25-43
యాకోబు పలాయనం, లాబాను వెంటబడడం 31:1-55
యాకోబు ఏశావును కలుసుకోవడానికి సిద్ధపడడం 32:1-21
యాకోబు దేవదూతతో పెనుగులాడడం 32:22-32
యాకోబు ఏశావుల కలయిక 33:1-17
షెకెంలో యాకోబు 34:1-31
బేతేల్‌లో యాకోబు 35:1-15
ఇస్సాకు, రాహేలుల మరణం 35:16-29
ఏశావు వంశావళి 36:1-43
యోసేపు కలలు 37:1-11
యోసేపు సోదరులు, అతణ్ణి అమ్మడం 37:12-36
యూదా, తామారు 38:1-30
ఈజిప్ట్‌లో యోసేపు – ఫోతీఫరు భార్య 39:1-19
చెరసాలలో యోసేపు, కలలభావం చెప్పడం 39:20—40:23
ఫరో కలలకు యోసేపు భావం చెప్పడం 41:1-38
యోసేపు ఈజిప్ట్ ప్రధానమంత్రి 41:39-57
యోసేపు, అతని సోదరులు 42:1—44:34
యోసేపు తనను తాను తెలియపర్చుకోవడం 45:1-15
యోసేపు సోదరులు యాకోబును ఈజిప్ట్‌కు తీసుకురావడం 45:16—46:34
యాకోబు ఫరోను కలుసుకోవడం 47:1-12
ప్రధానమంత్రిగా యోసేపు చర్యలు 47:13-31
యాకోబు యోసేపు కుమారులను ఆశీర్వదించడం 48:1-22
యాకోబు తన స్వంత కుమారులను ఆశీర్వదించడం 49:1-28
యాకోబు మరణం 49:29-33
ఈజిప్ట్‌లో యోసేపు చివరి రోజులు 50:1-26
No comments:
Post a Comment