Breaking

Wednesday, 10 November 2021

యెహోషువ (పరిచయం)

 



రచయిత:

యూదుల సాంప్రదాయాల ప్రకారం 24:29-33 మినహాయిస్తే ఈ పుస్తకానికి రచయిత యెహోషువే. యెహోషువ ఈ పుస్తకాన్ని రచించాడనడానికి పుస్తకంలోనే సాక్ష్యాధారాలున్నాయి. చూడండి 24:26. 5:1 కూడా చూడండి “మేము దాటే వరకు ఇస్రాయేల్ ప్రజల ముందు ఎండిపోయేలా” అనే వచనంలో “మేము” అనే పదాన్ని గమనించండి. యెహోషువ మోషేతో ఈజిప్ట్‌నుండి బయటకు వచ్చి ఎడారిప్రాంతాలలో మోషేతోను ఇస్రాయేల్‌తోను 40 సంవత్సరాలు గడిపాడు. అతడు యుద్ధంలో ఆరితేరిన నాయకుడు (నిర్గమ 17:8-13). అంతేకాదు అతడు విశ్వాసపరుడు, నమ్మకస్థుడు (సంఖ్యా 14:6-9). యెహోషువ అనే పేరుకు అర్థం – “యెహోవా రక్షణను ఇస్తాడు” లేక “యెహోవా జయాన్ని కలుగజేస్తాడు”.

వ్రాసిన కాలం:

కనానును వశపరచుకోవడం అనేది బహుశా సుమారు క్రీ.పూ. 1406లో జరిగి ఉండాలి. దేశాన్ని చాలమట్టుకు వశపరచుకోవడం జరిగిన తరువాత అతని జీవిత అంత్యదశలో యెహోషువ ఈ పుస్తకాన్ని వ్రాసి ఉండాలి.

ముఖ్యాంశాలు:

దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని దేవుని ప్రజలు స్వాధీనం చేసుకోవడం, దేవుడు వారికి అందించిన విజయం, కనాను కోసం పోరాడడంలో వారు నేర్చుకొనిన పాఠాలు. ఇప్పటి విశ్వాసుల కోసం ఈ పుస్తకంలో ఆత్మ సంబంధమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి. పుస్తకంలో ప్రత్యక్షంగా జరిగిన సంఘటనలు పరోక్షంగా ఆత్మసంబంధమైన మన జీవితానికి, పోరాటానికి ఆదర్శచిత్రాలుగా ఉన్నాయి. చూడండి యెహో 1:17కు వ్రాసిన నోట్స్. ఈ పుస్తకంలోని మరో ముఖ్యాంశం – దుష్ట ప్రజల నాశనం. చూడండి 6:21; 8:26; 10:28, 35, 37, 39, 40 మొదలైనవి. ఇది దైవాజ్ఞననుసరించే జరిగింది. చూడండి ద్వితీ 7:1-2, 16. అంతేగాక జరిగినది దేవుని నాయకత్వం క్రిందనే జరిగింది – యెహో 5:13-15. అయితే ప్రజలందరిని నశింపజేయడం దేవునికి న్యాయమా, సరియా? అవును ముమ్మాటికి అది న్యాయం, సరియే. అందుకే దేవుడలా చేశాడు. దేవుడేది చేసినా అది న్యాయం, సరియై ఉంటుంది. దుష్టులను నాశనం చేయడం గురించి మరెక్కువ తెలుసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన వాక్యభాగాల పీఠికలను చూడండి – ఆది 6:7; 15:16; లేవీ 18:24-25; ద్వితీ 13:12-18; కీర్తన 47:2; 2 తెస్స 1:5-9; ప్రకటన 16:5-7. కనానుదేశంలో ఉండినవారు విగ్రహారాధనను, పసిపిల్లల బలిని, లైంగిక దుష్కార్యాలను వారి దేవుని పేరట ఆచరించేవారు. వారు చాల క్రూరులు, చెడినవారు. అలాంటివారితో కలవడం అంటే ఇస్రాయేల్‌వారికి అది ముప్పే అవుతుంది. ఎందుకంటే వారిని నిజ దేవుడు తనను ఆరాధించడానికి, తన గురించి ప్రకటించడానికి ప్రత్యేకించుకున్నాడు. కనానువారి పాపాలు నిండాయి. అందుకే వారిని నాశనం చేయడానికి సమయం వచ్చిందని దేవుడు నిర్ణయించాడు. యెహోషువలోని కొన్ని ముఖ్యవాక్యాలు: 1:3-9; 5:13-15; 21:43-45; 24:14-15.

విషయసూచిక

యెహోషువను దేవుడు పనిమీద నియమించడం 1:1-9

యొర్దాను నదిని దాటడానికి సిద్ధపాటు 1:10-18

రాహాబు, గూఢచారులు 2:1-21

యొర్దానును దాటడం 3:1-17

గిల్గాలు దగ్గర ఒక స్మారక చిహ్నం 4:1-24

గిల్గాలు దగ్గర సున్నతి 5:1-9

వాగ్దాన దేశంలో పస్కా ఆచరణ, మన్నా ఆగిపోవడం 5:10-12

దేవుని సేనాధిపతి 5:13-15

యెరికో పతనం 6:1-27

రాహాబు తప్పించుకోవడం 6:22-23

యెరికోపై శాపం 6:26-27

ఆకాను దురాశ, అవిధేయత 7:1-26

హాయీ నాశనం 8:1-29

ఒడంబడికను తిరిగి స్థిరపరచడం 8:30-34

కుయుక్తిపరులైన గిబియోనువారు 9:1-27

గిబియోను యుద్ధం, సూర్యగోళం నిలిచిపోవడం 10:1-43

కనానులోని ఉత్తరభాగం వశం చేసుకోవడం 11:1-15

యెహోషువ చేసిన పోరాటాల క్లుప్త వివరణ 11:16—12:24.

భూభాగాన్ని పంచుకోవడం 13—21 అధ్యాయాలు

భూవిభజన గురించి యెహోషువ నిర్ణయించిన విధులు 13:1-7

యొర్దానుకు పూర్వదిక్కునున్న భూభాగం రూబేను,

గాదు మనష్షేలో సగం గోత్రానికి 13:8-33

కాలేబుకు హెబ్రోను 14:6-15

యూదాకు, యోసేపు కుమారులకు భూభాగం 15—17 అధ్యాయాలు

షిలోహులో సమావేశం, మిగతా గోత్రాలకు భూభాగాలు 18:1—19:48

యెహోషువకు భూభాగం 19:49-51

శరణాగతులకు 6 పట్టణాలు 20:1-9

లేవీవారికి పట్టణాలు 21:1-45

పూర్వదిక్కున ఉన్న గోత్రాలు తిరిగిరావడం సాక్ష్యవేదిక 22 అధ్యాయం

యెహోషువ ఇచ్చిన చివరి ఉపదేశం 23 అధ్యాయం

షెకెములో ఒడంబడికను తిరిగి స్థాపించుకోవడం 24:1-28

యెహోషువ మరణం 24:29-33

No comments:

Post a Comment