పేరు:
“న్యాయాధిపతులు” అని అనువదించిన హీబ్రూ పదానికి “నాయకులు” అనే అర్థం కూడా ఉంది. ఈ పుస్తకానికి “నాయకులు” అని పేరు పెట్టడమే ఎక్కువ సమంజసంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఎన్నుకొన్న నాయకులు ప్రజలకు తీర్పు చెప్పడంకంటే మించినదానినే చేశారు. బైబిలు పుస్తకాల పేర్ల గురించి ఆదికాండం పరిచయం చూడండి.
రచయిత:
యూదుల సాంప్రదాయం ప్రకారం సమూయేలు ఈ పుస్తకాన్ని వ్రాశాడు. అయినా అలా చెప్పడానికి ఖచ్చితమైన రుజువు లేదు.
వ్రాసినకాలం:
సుమారు క్రీ.పూ. 1000లో.
ముఖ్యాంశం:
ఈ పుస్తకంలో యెహోషువ మరణం మొదలుకొని సమూయేలు జన్మం వరకు ఇస్రాయేల్ చరిత్రలోని కొన్ని సంఘటనల వివరణ ఉంది. ఏ ప్రజలైనా గాని దేవునికిష్టమైనదానిని చేయడానికి బదులు వారికిష్టమైనదానిని చేస్తే ఏమవుతుందో ఈ పుస్తకం తెలియజేస్తుంది. అసహ్యమైన పనుల దోషం ప్రజలమీద ఉన్నప్పటికీ వారిపట్ల దేవుడు చూపే కనికరం, చేసే సహాయం గురించి కూడా ఇది తెలియజేస్తుంది. పాపాన్ని దేవుడు ఎంతగా ద్వేషిస్తాడు, దానిని ఎలా శిక్షిస్తాడు అనే సంగతులను గురించి కూడా తెలియజేస్తుంది. మరో దృక్కోణంలో చూస్తే అయోగ్యులైన ప్రజలను దేవుడు ఎలా విడిపించాడు, మహా శూరులైన వ్యక్తులను ఎలా వాడుకున్నాడు అనే సంగతులను కూడా ఈ పుస్తకం తెలియజేస్తుంది. కొన్ని ముఖ్య వాక్యాలు 2:10-23; 21:25.
విషయసూచిక
కనానులో మిగతా భూభాగాలను వశపరచుకోవడం 1:1—2:5
క్రొత్త తరంవారు విపరీతమైన మతాచారాలను అనుసరించడం 2:6-20
కనానువారిలో కొందరిని దేవుడు బ్రతకనివ్వడం 2:21—3:6
నాయకుడైన ఒతనీయేలు 3:7-11
నాయకుడైన ఏహూదు 3:12-20
నాయకుడైన షమ్గరు 3:31
నాయకులైన దెబోరా, బారాకు 4:1-24
దెబోరా గీతం 5:1-31
నాయకుడైన గిద్యోను 6:1—8:35
గిద్యోను ఒక గుర్తును కోరడం 6:11-23
గిద్యోను రెండవ గుర్తును కోరడం 6:36-40
మిద్యానువారిని గిద్యోను ఓడించడం 7:8-21
గిద్యోను ఒక విగ్రహం చేయడం 8:22-27
గిద్యోను మరణం 8:28-35
క్రూర రాజు అయిన అబీమెలెకు 9:1-57
ముండ్లపొద ఉపమానం 9:8-15
దేవుడు అబీమెలెకును దండించడం 9:52-57
నాయకుడైన తోలా 10:1-2
నాయకుడైన యాయీరు 10:3-5
ఇస్రాయేల్ తిరిగి పాపం చేయడం, పశ్చాత్తాపపడడం, దేవుని కనికరం 10:6-18
నాయకుడైన యెఫ్తా 11:1—12:7
యెఫ్తా కుమార్తె, అతడు బుద్దిహీనంగా ఇచ్చిన మాట 11:34-36
యెఫ్తా ఎఫ్రాయిం వారు 12:1-7
నాయకులైన ఇబ్సాను, ఏలోను, అబ్దోను 12:8-15
ఫిలిష్తీయవారు ఇస్రాయేలువారిని వశం చేసుకోవడం 13:1
నాయకుడైన సమ్సోను 13:2—16:31
సమ్సోను పుట్టుక 13:2-25
సమ్సోను ఫిలిష్తీయ అమ్మాయిని వివాహమాడుట 14:1-20
సమ్సోను ఒక సింహాన్ని చంపడం 14:5-6
సమ్సోను పొడుపుకథ 14:12-20
సమ్సోను ఫిలిష్తీ వారి పంటకొచ్చిన చేనులను తగలబెట్టడం 15:1-5
సమ్సోను గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపడం 15:14-20
సమ్సోను దెలీలా 16:1-21
దాగోను దేవత గుడిని సమ్సోను నేలకూల్చడం 16:23-31
మీకా విగ్రహం, ప్రతిమ, అతని యాజి, దాను ప్రజలు 17:1—18:31
గిబియాలో ఒక ఘోర సంఘటన 19:1-30
బెన్యామీన్ వారి నాశనం 20:1-48
మిగిలిన బెన్యామీన్ వారికి భార్యలు దొరకడం 21:1-25
No comments:
Post a Comment