Breaking

Monday, 22 May 2023

Athmiya ganalatho song lyrics | ఆత్మీయ గానాలతో

 


Athmiya ganalatho song lyrics :


ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధన చేయనా

స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజించనా (2)

మహిమ ఘనత ప్రభావములు

నీకే చెల్లించుచున్నానయ్యా (2)

ఆరాధించనా నీ పాద సన్నిధి (2)

స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా

ఆరాధనా నీకే ఆరాధనా (2)      ||ఆత్మీయ||


సమీపించరాని తేజస్సులో

వసియించుచున్న పరిశుద్ధుడా (2)

కెరూబులు సెరాపులు (2)

దీవా రాత్రులు నీ సన్నిధిలో (2)

స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా (2)      ||స్తుతి పాత్రుడా||


అందరిలోను అతి శ్రేష్టుడా

వేల్పులలోన మహనీయుడా (2)

పూజార్హుడా స్తోత్రార్హుడా (2)

అతి సుందరుడా మనోహరుడా (2)

చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో (2)        ||స్తుతి పాత్రుడా||


అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా

అపరంజిని పోలిన పాదాలు గలవాడా (2)

(దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన (2)

స్వరమును కలిగిన ఘననీయుడా (2)

శిరము వంచనా సర్వోన్నతుడా (2)        ||స్తుతి పాత్రుడా||








No comments:

Post a Comment