Breaking

Tuesday, 23 May 2023

Adiyanthamu lenivada song lyrics | ఆదియంతము లేనివాడా

 


Adiyanthamu lenivada song lyrics :


ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా

నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే


1.అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి

అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి    ||ఆదియంతము||


2.ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా

యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి    ||ఆదియంతము||


3.యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి

మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి    ||ఆదియంతము||


4.పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా

కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి    ||ఆదియంతము||


5.దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు

కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి    ||ఆదియంతము||










No comments:

Post a Comment