Breaking

Thursday, 10 November 2022

Nenemainaa Prabhuvaa song lyrics | నేనేమైనా ప్రభువా


 Nenemainaa Prabhuvaa song lyrics | నేనేమైనా ప్రభువా


నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను

నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2)

నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2)

నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2)       ||నేనేమైనా||


1.లేక లేక వృద్ధాప్యమందు

ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2)

ఇచ్చిన నీవే బలి కోరగా (2)

తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా                  ||నేనేమైనా||


2.సర్వము పోయి శరీరము కుళ్ళిన

నా అనువారే వెలివేసినా (2)

ఆప్తులంతా శత్రువులైనా (2)

అంతము వరకు సహియించిన ఆ యోబులా       ||నేనేమైనా||


3.నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే

చావైనా అది నాకెంతో మేలే (2)

ఇదిగో నేను ఉన్నానయ్యా (2)

దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా      ||నేనేమైనా||










No comments:

Post a Comment