Breaking

Thursday, 10 November 2022

Noothanamainadi nee vathsalyamu song lyrics | నూతనమైనది నీ వాత్సల్యము

 


Noothanamainadi nee vathsalyamu song lyrics | నూతనమైనది నీ వాత్సల్యము


నూతనమైనది నీ వాత్సల్యము – ప్రతి దినము నన్ను దర్శించెను

ఎడబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెను

తరములు మారుచున్నను – దినములు గడచుచున్నను

నీ ప్రేమలో మార్పు లేదు (2)

సన్నుతించెదను నా యేసయ్యా

సన్నుతించెదను నీ నామము (2)


1.గడచిన కాలమంతా – నీ కృప చూపి – ఆదరించినావు

జరగబోయే కాలమంతా – నీ కృపలోన – నన్ను దాచెదవు (2)

విడువని దేవుడవు – ఎడబాయలేదు నన్ను

క్షణమైనా త్రోసివేయవు (2)         ||సన్నుతించెదను||


2.నా హీన దశలో – నీ ప్రేమ చూపి – పైకి లేపినావు

ఉన్నత స్థలములో – నను నిలువబెట్టి – ధైర్యపరచినావు (2)

మరువని దేవుడవు – నను మరువలేదు నీవు

ఏ సమయమైననూ చేయి విడువవు (2)         ||సన్నుతించెదను||


3.నీ రెక్కల క్రింద – నను దాచినావు – ఆశ్రయమైనావు

నా దాగు స్థలముగా – నీవుండినావు – సంరక్షించావు (2)

ప్రేమించే దేవుడవు – తృప్తి పరచినావు నన్ను

సమయోచితముగా ఆదరించినావు (2)         ||సన్నుతించెదను||







No comments:

Post a Comment