Breaking

Tuesday, 5 April 2022

యోహాను వ్రాసిన మూడవ పత్రిక (పరిచయం)

 


రచయిత:

ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన యోహాను.

వ్రాసిన కాలం:

బహుశా క్రీ.శ. 85-95 మధ్య కాలంలో.

ముఖ్యాంశం:

క్రీస్తు రాయబారి యోహాను తన ప్రియ మిత్రుడైన గాయస్‌కు ఈ లేఖ రాశాడు. ఈ చిన్న లేఖలో ముగ్గురు వ్యక్తులున్నారు – సత్యంలో నడుచుకొన్న గాయస్, తనను గొప్ప చేసుకొని క్రీస్తు రాయబారిని ఎదిరించిన దియొత్రిఫెస్, మంచి సాక్ష్యం పొందిన దేమేత్రియస్. ఈ లేఖలోని విశేషాంశం స్థానిక సంఘంలో తగిన ప్రవర్తన. విశ్వాసులు దియొత్రిఫెస్ చూపిన ప్రవర్తనకు దూరంగా ఉండి గాయస్, దేమేత్రియస్ చూపిన మాదిరిని అనుసరించాలి (11వ).

విషయసూచిక

గాయస్ – తన పనులతో తానొక విశ్వాసినని నిరూపించుకున్న మనిషి 1-8 వచనాలు

దియొత్రిఫెస్ – తన పనులతో తాను విశ్వాసి కాదని నిరూపించుకున్న మనిషి 9-11 వచనాలు

దేమేత్రియస్ – సత్యంవల్ల సాక్ష్యం పొందినవాడు 12 వ వచనం

No comments:

Post a Comment