రచయిత:
ప్రభువైన యేసు తమ్ముళ్ళలో ఒకడూ, యాకోబు సోదరుడూ అయినవాడు (మత్తయి 13:55; మార్కు 6:3). యేసు చనిపోయి సజీవంగా లేచిన తరువాత అతడు ఆయనమీదL నమ్మకముంచాడు.
వ్రాసినకాలం:
క్రీ.శ. 68-80 మధ్య కాలంలో.
ముఖ్యాంశం:
క్రీస్తు సంఘాలలో సత్యాన్ని త్రోసిపుచ్చి తప్పు సిద్ధాంతాలు నేర్పేవారిని గురించి రాశాడు. వారి ఉపదేశాన్ని, జీవిత విధానాన్ని కఠినంగా ఖండించాడు. ఈ లేఖలోని విశేషాంశం మూడో వచనంలో ఉంది – “పవిత్రులకు ఒక్క సారే అప్పగించబడ్డ విశ్వాస సత్యాలకోసం మీరు పోరాడాలి.
విషయసూచిక
యూదా ఈ లేఖ రాసిన కారణం 3,4 వచనాలు
పూర్వ కాలాల్లో దుర్మార్గులు 5-7 వచనాలు
ప్రస్తుతమున్న దుర్మార్గులు 8-19 వచనాలు
వారు మూర్ఖులు 10 వ వచనం
వారు ముగ్గురు వ్యక్తుల చెడు మార్గాలను అనుసరిస్తారు 10 వ వచనం
కొందరు సంఘాల నాయకులు 12 వ వచనం
వారి అంతం భయంకరం 13 వ వచనం
హనోకు వీరి గురించి చెప్పాడు 14,15 వచనాలు
క్రీస్తు రాయబారులు వీరిని గురించి హెచ్చరించారు 17,18 వచనాలు
విశ్వాసులు ప్రవర్తించవలసిన విధానం 20-23 వచనాలు
దీవెన 24,25 వచనాలు
No comments:
Post a Comment