Breaking

Wednesday, 6 April 2022

ప్రకటన గ్రంధము (పరిచయం)

 




పేరు:

మొదట్లో ప్రచురించబడిన తెలుగు బైబిల్లో ఈ పుస్తకాన్ని “ప్రత్యక్షము” అని రాశారు. ఇది మొదటి వచనమైన “ఇది యేసు క్రీస్తును గురించిన ప్రత్యక్షం” అనేదానితో ఏకీభవిస్తూ చాలా మంచి పేరై ఉంది. కానీ ఏదో వింత కారణం వల్ల పాత బైబిలును మార్పు చేసి “పరిశుద్ధ గ్రంథము”గా ప్రచురించినవాళ్ళు “ప్రకటన గ్రంథము” అని వాడారు. కానీ అది ఈ పుస్తకానికి “ప్రకటన” అంత సరియైన పేరు కాదు.


రచయిత:

ప్రభువు యేసు క్రీస్తు రాయబారి అయిన యోహాను. యోహాను సువార్త, బైబిలులోని మూడు లేఖలు రాసినది కూడా అతడే


వ్రాసిన కాలం:

క్రీ.శ. దాదాపు 96లో రాశాడని కొందరు విద్వాంసుల గట్టి నమ్మకం. అతడు అంతకు ముందు ఎప్పుడో రాశాడని మరి కొందరి అభిప్రాయం.


ముఖ్యాంశం:

యోహాను రాసినది యేసు క్రీస్తు బయలుపరచిన సంగతులే (1:1). ఈ గ్రంథంలో క్రీస్తు మహిమలో కనిపిస్తున్నాడు. ఆయన భూరాజులను పరిపాలించేవాడు (1:5), సంఘాలకు తీర్పు తీర్చేవాడు (2,3 అధ్యాయాలు), యూదా గోత్ర సింహం (5:5), మహిమాస్థితి పొందిన గొర్రెపిల్ల (5:6), ప్రభువులకు ప్రభువు (19:16), దేవుని రాజ్యమేలబోయే రాజు (19:15), ‘అల్ఫా’ ‘ఓమెగ’ అయి ఉన్నవాడు, ఆది అంతం అయి ఉన్నవాడు (22:13). ఈ గ్రంథంలో భవిష్యత్తు విషయాలు రాసి ఉన్నాయి (1:1). దీని విశేషాంశం యేసు క్రీస్తు రెండో రాకడ, దానికి ముందూ, దాని తరువాతా జరగబోయే సంఘటనలు – భూమిమీదా పరలోకంలోనూ జరగబోయే సంఘటనలు. ఈ గ్రంథం అలంకారిక భాషతో, గూఢమైన విధానంలో రాసిన సూచనలతో నిండి ఉంది. అయినా చాలా మట్టుకు ముఖ్యాంశాలు స్పష్టమే – ఈ యుగ సమాప్తిలో దుర్మార్గం అధికంగా పెరిగిపోతుంది; క్రీస్తువిరోధి లోకమంతటిమీదా ప్రభుత్వం చేసి దేవుని ప్రజలను క్రూరంగా హింసిస్తాడు; వాణ్ణి అనుసరించినవారిని దేవుడు శిక్షిస్తాడు, లోకాన్ని భయంకరమైన విపత్తులకు గురి చేస్తాడు; చివరికి యేసు క్రీస్తు దేవుని రాజ్యమేలడానికి గొప్ప మహిమతో వైభవంతో వస్తాడు. ఈ సంఘటనల వివరణతో పాటు ప్రభు విశ్వాసులకు అనేక మంచి వాగ్దానాలూ, ప్రోత్సాహకరమైన మాటలూ, ఆదరణకరమైన విషయాలూ, పరలోక సంబంధమైన మహిమగల దృశ్యాలూ ఈ గ్రంథంలో ఉన్నాయి. యేసు క్రీస్తు రెండో రాకడ, దానికి సంబంధించిన విషయాలు ఈ పుస్తకం ముఖ్యాంశం అని కొందరు బైబిలు ఉపదేశకులు వ్యాఖ్యానకర్తలు ఏకీభవించరు. వారు ఈ నోట్స్‌లో వివరించిన వివరణ కాకుండా వేరే విధాలయిన వివరణలు ఇస్తారు. కొంతమంది ఈ పుస్తకంలో రాసి ఉన్న సూచనలూ, దర్శనాలు యోహాను కాలానికే చెందినవనీ చాలావరకు అప్పుడే సంభవించాయనీ నేర్పుతారు. ఇంకా కొంతమంది ఈ పుస్తకంలోని సంగతులు యోహాను కాలంనుంచి నేటివరకు ఒక క్రమబద్ధమైన పద్ధతిలో నెరవేరుతూ ఉన్నాయని అంటే ఇది ఒక విధంగా ముందుగా రాయబడిన చరిత్ర అని నేర్పుతారు. ఇంకా కొందరు ఈ పుస్తకంలో రాసిన సూచనలూ సాదృశ్యాలూ ప్రత్యేకమైన సంఘటనలను సూచించవు కానీ ఇవి కేవలం ఈ యుగం అంతటిలో కనిపించే ఆధ్యాత్మిక సూత్రాలుగా నియమాలుగా పరిగణిస్తారు. ఈ నోట్స్ రాసిన రచయిత మాత్రం వీటన్నిటిలో దేనితోనూ ఏకీభవించడు. బైబిలంతటిలో కనబడే కొన్ని ఆధ్యాత్మిక నియమాలూ పాఠాలూ ఈ పుస్తకంలో కూడా ఉన్నప్పటికీ ఈ నోట్స్ రచయితనై ఉన్న నేను 6:1 నుంచి 22:5 వరకు రాసిన సంఘటనలు ఇంకా జరగలేదని ఇక ముందు జరుగుతాయని నమ్ముతున్నాను.

విషయసూచిక

ఈ పుస్తకం దేని గురించి 1:1-2

దీన్ని పాటించిన వారికి ధన్యత 1:3

క్రీస్తు సంఘాలకు త్రిత్వంనుంచి కృప, శాంతి 1:4-5

విశ్వాసుల కోసం క్రీస్తు ప్రేమ, ఆయన చేసినది 1:5-6

క్రీస్తు రెండో రాకడ 1:7

క్రీస్తు దర్శనం 1:9-16

యోహాను చేసినది, క్రీస్తు అన్నది 1:17-20

ఏడు సంఘాలు 2:1—3:22

ఎఫెసు 2:1-7

స్ముర్న 2:8-11

పెర్గము 2:12-17

తుయతైర 2:18-29

సార్దీస్ 3:1-6

ఫిలదెల్ఫియా 3:7-13

లవొదికయ 3:14-22

పరలోకానికి సంబంధించిన దృశ్యం 4:1-11

గొర్రెపిల్ల, చుట్టి ఉన్న పత్రం 5:1-7

పరలోక నివాసులందరూ గొర్రెపిల్లను స్తుతిస్తూ పాడడం 5:8-14

గొర్రెపిల్ల మొదటి ఆరు ముద్రలు విప్పడం 6:1-16

క్రీస్తు విరోధి బయలు దేరడం 6:1-2

యుద్ధం 6:3-4

కరవు 6:5-6

మరణం, నాశనం 6:7-8

మహా బాధకాలంలో చనిపోయినవారు 6:9-11

ప్రభు దినం సూచనలు 6:12-17

144,000 మంది 7:1-8

విముక్తి పొందిన గొప్ప జన సమూహం 7:9-17

వారేమి అన్నారు 7:10

దేవదూతలు ఏమన్నారు 7:11-12

ఒక పెద్ద ఏమన్నాడు 7:13-17

గొర్రెపిల్ల 7వ ముద్రను విప్పడం 8:1-5

మొదటి ఆరు బూరలు 8:6—9:21

మొదటి బూర – వడగండ్లు, నిప్పు, రక్తం 8:7

రెండో బూర – ఇంకా రక్తం 8:8-9

మూడో బూర – చేదు నక్షత్రం 8:10-11

నాలుగో బూర – మూడో భాగం చీకటి 8:12-13

ఐదో బూర – అగాధం 9:1-12

ఆరో బూర – నలుగురు దేవదూతలు 9:13-19

పశ్చాత్తాపం లేదు 9:20-21

దేవదూత, చుట్టి ఉన్న ఇంకో పత్రం 10:1-11

ఆలయాన్ని కొలవడం 11:1-2

దేవుని కోసం ఇద్దరు సాక్షులు 11:3-14

ఏడో బూర 11:15-19

స్త్రీ, ఆమె సంతానం, రెక్కలున్న మహా సర్పం 12:1-17

రెండు మృగాలు 13:1-18

సముద్రంనుంచి వచ్చిన మృగం 13:2-10

భూమిమీదనుంచి వచ్చిన మృగం 13:11-17

మొదటి మృగం సంఖ్య 13:18

గొర్రెపిల్ల, 144,000 మంది 14:1-5

ముగ్గురు దేవదూతలు, వారి సందేశం 14:6-12

పరలోకంనుంచి స్వరం 14:13

రెండు పంటలు 14:14-20

భూమి పంట 14:1-16

ద్రాక్ష పండ్ల పంట 14:17-20

ఏడు తెగుళ్ళు 15:1-8

మోషే పాట, గొర్రెపిల్ల పాట 15:2-4

ఏడుగురు దేవదూతలు 15:5-8

ఏడు కోప పాత్రలు 16:1-21

మొదటి పాత్ర – కురుపులు 16:2

రెండో పాత్ర – రక్తం 16:3

మూడో పాత్ర – ఇంకా రక్తం 16:4

దేవుని తీర్పులో న్యాయం 16:5-7

నాలుగో పాత్ర – తీవ్రమైన వేడి 16:8-9

అయిదో పాత్ర – చీకటి 16:10-11

ఆరో పాత్ర – మూడు దయ్యాలు, వాటి పని 16:12-16

ఏడో పాత్ర – గొప్ప భూకంపం, బ్రహ్మాండమైన వడగండ్లు 16:17-21

వేశ్య, మృగం 17:1-18

బబులోను పతనం 18:1-24

పరలోకంలో ఆనందం, దానికి కారణం 19:1-8

యోహాను, దేవదూత 19:9-10

బలప్రభావాలతోను, మహిమతోను యేసు భూమిమీదికి రావడం 19:11-16

పక్షుల కోసం గొప్ప విందు 19:17-21

మృగం, కపట ప్రవక్త దండన 19:20

సైతానుకు వెయ్యేళ్ళ చెర 20:1-3

క్రీస్తు, ఆయన ప్రజలు, 1000 ఏళ్ళ పాలన 20:4-6

సైతాను విడుదల తర్వాత ఏమి జరుగుతుంది 20:7-10

తెల్లని మహా సింహాసనం తీర్పు 20:11-15

క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త జెరుసలం 21:1—22:6

దేవుడు మనుషులతో ఉంటాడు 21:3-4

దేవుని వాగ్దానం 21:5,7

పశ్చాత్తాపపడని పాపుల దండన 21:8

దేవుని నగరం 21:9-26

నగరంలోకి ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించరు 21:27

జీవజల నది 22:1-2

మహిమాన్వితమైన భవిష్యత్తు 22:3-5

బైబిలులోని చివరి సందేశం 22:6-21

యేసు వస్తున్నాడు 22:7,12,20

రెండు రకాల మనుషులు, వారి భవిష్యత్తు 22:14-15

చివరి ఆహ్వానం 22:17

చివరి హెచ్చరిక 22:18-19

చివరి ప్రార్థన 22:20

చివరి మాట 22:21

No comments:

Post a Comment