రచయిత:
ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన యోహాను.
వ్రాసిన కాలం:
బహుశా క్రీ.శ. 85-95 మధ్య కాలంలో.
ముఖ్యాంశం:
క్రీస్తు రాయబారి యోహాను “ఎన్నికైన అమ్మగారికి” రాశాడు. ఒక స్థానిక సంఘాన్ని ఉద్దేశించి అలంకారికంగా మాట్లాడుతున్నాడని కొందరి అభిప్రాయం. మరి కొందరేమో ఉన్నత స్థానంలో ఉన్న ఒక క్రైస్తవురాలిని ఉద్దేశించి రాస్తున్నాడంటారు. ఈ లేఖకు మూలపదాలు “సత్యం”, “ప్రేమ”. ఈ లేఖలో దుర్బోధకులను గురించి గంబీరమైన హెచ్చరిక ఉంది.
విషయసూచిక
ప్రేమలోనూ, సత్యంలోను నడవడం 1-6 వచనాలు
తప్పుడు బోధకుల గురించిన హెచ్చరికలు 7-11 వచనాలు
వారు యేసును గురించి సత్యాన్ని బోధించరు 7 వ వచనం
వారిని అనుసరించడం చాలా నష్టం 8 వ వచనం
క్రీస్తు బోధలను దాటి ఇంకెటో వెళతారు 9 వ వచనం
విశ్వాసులు వారితో పొంతన పెట్టుకోకూడదు 10-11 వచనాలు
ముగింపు మాటలు 12-13 వచనాలు
No comments:
Post a Comment