రచయిత:
ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన యోహాను. యోహాను శుభవార్త రాసినది ఇతడే.
వ్రాసిన కాలం:
బహుశా క్రీ.శ. 85-95 మధ్య కాలంలో.
ముఖ్యాంశం:
ఈ లేఖ దేవుని అనుగ్రహం చేత ఆధ్యాత్మికమైన కొత్త జన్మం పొందిన వారందరికి రాశాడు. వారు దేవుని ప్రియమైన చిన్న పిల్లలు (2:12-13, 18, 28; 3:7; 4:4; 5:21). వారు తండ్రి అయిన దేవుని కుటుంబంలో దేవుని గృహసీమలో ఉన్నారు. ఈ సత్యానికి తగినట్టుగా వారు ప్రవర్తించాలని యోహాను రాస్తున్నాడు. అంటే, వారు దేవుని సహవాసంలో ఉంటూ ఒకరితో ఒకరు సహవాసం అనుభవించాలి (1:3-7), తప్పు, పాపం ఏదైనా చేస్తే ఒప్పుకొని క్షమాపణ పొందాలి (1:8—2:2), తండ్రి ఆజ్ఞలు శిరసావహించాలి (2:3-7), ఒకరినొకరు ప్రేమతో చూచుకోవాలి (3:11-20). ఈ లేఖకు మూల పదాలు ఈ మూడు – “జీవం” (1:1-2; 2:25; 3:15; 5:11-12, 13, 20), “వెలుగు” (1:5, 7; 2:8-9, 10), “ప్రేమ” (3:11-18; 4:7-12).
విషయసూచిక
యోహాను ప్రకటించినది ఏమిటి? ఎందుకు? 1:1-4
దేవుని వెలుగులో నడవడం, అందులో ఉన్న ఫలితం 1:5—2:12
దేవునితోనూ సాటివారితోనూ సహవాసం 1:6-7
పాపంనుంచి శుద్ధీకరణ 1:7
పాపులమని గ్రహిస్తూ పాపాన్ని ఒప్పుకోవడం, క్షమాపణ 1:9
పాపం చేయకుండా ఉండే సాధ్యత 2:1
పాపం చేసిన విశ్వాసులకు ఏర్పాటు 2:1
పాప క్షమాపణకు ఏకైక ఆధారం 2:2
దేవుని వాక్కును శిరసావహించడం 2:3-6
సోదర ప్రేమ 2:7-11
యోహాను ఎందుకు రాశాడు 2:12-14
విశ్వాసి, ఈ లోకం 2:15-17
క్రీస్తువిరోధుల గురించి హెచ్చరికలు 2:18-27
దేవుని సంతానం 2:28—3:10
వారు మంచి చేస్తారు 2:29; 3:10
వారు దేవునిద్వారా కొత్త జన్మం పొందారు 2:29
వారు దేవునికి ప్రియులు 3:1
లోకం వారిని అర్థం చేసుకోదు 3:1
క్రీస్తు వచ్చినప్పుడు వారు క్రీస్తులా ఉంటారు 3:2
వారు తమను తాము శుద్ధిపరచుకొంటారు 3:3
క్రీస్తు పాపం లేనివాడని, వారి పాపాలకోసం చనిపోయాడని వారికి తెలుసు 3:4-5
వారు కొత్త జన్మం పొందకముందు పాపంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండరు 3:6-10
ఒకరినొకరు ప్రేమించమని ఆజ్ఞ 3:11-24
కొత్త జన్మానికి ప్రేమ సాక్ష్యం 3:14
ప్రేమ చేతలతో రుజువవుతుంది, మాటలతో కాదు 3:16-18
ప్రేమ దేవునిపట్ల గొప్ప నిశ్చయతనిస్తుంది 3:19-24
ఆత్మలను పరీక్షించడం ఎలా? 4:1-6
ప్రేమ పూర్తి వివరణ 4:7—5:3
నిజమైన ప్రేమ దేవుని దగ్గరనుంచే వస్తుంది 4:7
దైవప్రేమ లేనివారు దేవుణ్ణి తెలుసుకోరు 4:8
దేవుడు తన ప్రేమను ఎలా నిరూపించాడు 4:9-10
దేవుడు ప్రేమించినట్లే మనం ప్రేమించాలి 4:11-12
దేవుని ఆత్మ మనకు ప్రేమనిస్తాడు 4:13-16
ప్రేమ ధైర్యాన్ని ఇచ్చి భయాన్ని తీసివేస్తుంది 4:17-19
ఇతర విశ్వాసులపై చూపించే ప్రేమ
దేవునిపై ప్రేమ ఉందనడానికి రుజువు 4:20-21
ప్రేమ దేవుని ఆజ్ఞలను శిరసావహిస్తుంది 5:2-3
విశ్వాసమే విజయం 5:4-5
మనకు రక్షణ, శాశ్వత జీవం ఉన్నాయని తెలుసుకోవడం ఎలా 5:6-13
ప్రార్థనకు సంబంధించిన గొప్ప వాగ్దానం 5:14-15
మరణకరమైన పాపం 5:16-17
విశ్వాసులు తెలుసుకోగల సంగతులు 5:18-20
ఈ లేఖలోని సత్య సారాంశం విగ్రహారాధనకు వ్యతిరేకం 5:21
No comments:
Post a Comment