Breaking

Monday, 14 March 2022

ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు | Prema Purnudu Lyrics in Telugu


 



Prema Purnudu Lyrcs in Telugu :


ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు

నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)

నే పాడెదన్ – కొనియాడెదన్ (3)

నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4)      ||ప్రేమా||


1.లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ

గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)

యేసుని ప్రేమ వెల యెంతో

ఇహమందైనా పరమందైనా (2)

వెల కట్టలేని కలువరిలో ప్రేమ

వెలియైన ప్రేమ నాకై బలియైన ప్రేమ – (2)      ||ప్రేమా||


2.మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ

మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ (2)

రక్తము కార్చి రక్షణ నిచ్చి

ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)

గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ

బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2)      ||ప్రేమా||




No comments:

Post a Comment